sbi-personel-loans-through-sbi-yona-app

sbi-personel-loans-through-sbi-yona-app

SBI Personal Loan: ఎస్​బీఐ కస్టమర్లకు ప్రాసెసింగ్ ఫీజు లేకుండా పర్సనల్ లోన్… ఎలా తీసుకోవాలంటే

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం స్టేట్ ​బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (SBI) కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. యోనో యాప్​ ద్వారా పర్సనల్ లోన్​ కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రాసెసింగ్​ ఫీజు మినహాయింపు ఇస్తామని ప్రకటించింది.

అంతేకాదు, యోనో యాప్​ ద్వారా కేవలం నాలుగు క్లిక్​లలో పర్సనల్​ లోన్​కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మరిన్ని వివరాల కోసం, ఆసక్తిగల కస్టమర్లు ఎస్​బీఐ అధికారిక వెబ్‌సైట్ www.sbi.co.in ను సందర్శించాలని కోరింది.

ఎస్​బీఐ తాజాగా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పర్సనల్​ లోన్లకు సంబంధించిన వివిధ ఆఫర్లు, బెనిఫిట్స్​ గురించి ట్వీట్ చేసింది.

ఆ ట్వీట్‌లో, “ఇప్పుడు ఎస్​బీఐ జీరో ప్రాసెసింగ్​ ఫీజుతోనే పర్సనల్ లోన్లను ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, కేవలం 9.60 శాతం తక్కువ వడ్డీ రేటుకే పర్సనల్​ తీసుకోవచ్చు.

సుదీర్ఘమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియ అవసరం లేకుండా యోనో యాప్​ ద్వారా కేవలం నాలుగు క్లిక్​లలో ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు.” అని తెలిపింది.

ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేయాలంటే…

ఆసక్తి గల కస్టమర్లు 567676 నంబర్​కు మెసేజ్​ చేయడం ద్వారా మీ లోన్​ ఎలిజిబిలిటీ చెక్​ చేసుకోవచ్చు. ఇందు కోసం మీ రిజిస్టర్ మొబైల్​ నంబర్​ నుంచి టైప్​ చేసి 567676 నంబర్​కు ఎస్​ఎమ్ఎస్​ పంపించాలి. ఆ తర్వాత మీరు ఎంత లోన్​ తీసుకునేందుకు అర్హత ఉంది? వర్తించే వడ్డీ రేటు ఎంత? అనే వివరాలు ఎస్​ఎమ్ఎస్​​ రూపంలో వస్తాయి. ఆ తర్వాత మీ ఆండ్రాయిడ్​​ లేదా ఐఫోన్​ డివైజెస్​లో యోనో యాప్​ను డౌన్​​లోడ్​ చేసుకొని లాగిన్​ అవ్వండి. కేవలం 4 క్లిక్​లలో పర్సనల్​ లోన్​కు దరఖాస్తు చేసుకోండి.

CHECK YOUR SBI BALANCE AND MINI STATEMENT CLICK HERE

ఎస్​బీఐ యోనోలో ఇలా దరఖాస్తు చేసుకోండి

Step 1- ముందుగా మీ మొబైల్​లో యోనో యాప్​ను తెరవండి. మీ లాగిన్ ఐడీ, పాస్​వర్డ్​ డీటెయిల్స్​తో లాగిన్ అవ్వండి.

Step 2- లోన్​ సెక్షన్​లో కనిపించే ‘అవైల్​ నౌ’ ఆప్షన్​పై క్లిక్ చేయండి.

Step 3- మీ లోన్ మొత్తం అమౌంట్​, లోన్​​ టెన్యూర్​ వివరాలను ఎంటర్​ చేయండి.

Step 4- మీ రిజిస్టర్​ మొబైల్​ నంబర్​కు వచ్చిన ఓటీపీని ఎంటర్​ చేయండి. కొద్ది నిమిషాల తర్వాత మీ బ్యాంక్​ అకౌంట్​కు లోన్​ అమౌంట్​ క్రెడిట్ అవుతుంది.

SBI ATM WITHDRAWAL NEW RULE OTP BASED CLICK HERE