post-office-best-schemes

post-office-best-schemes

పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్.. మీ చేతికి ఏకంగా రూ.17 లక్షలు

Post Office: చిన్న మొత్తం పొదుపు చేసి పెద్ద మొత్తం చేతికి తీసుకునేలా అదిరే స్కీమ్ అందుబాటులో ఉంది. ఈ స్కీమ్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

అన్ని రకాల పెట్టుబడుల ప్రధాన లక్ష్యం మంచి రాబడిని అందించడం. అయితే ప్రాధాన్యతలు, పనితీరు, ఇతర అంశాల ఆధారంగా వీటిని షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లుగా పరిగణిస్తారు. దీర్ఘకాలం పాటు నిధులను ఆదా చేయడానికి ఉన్న మార్గాల్లో రికరింగ్ డిపాజిట్లు (RD) బెస్ట్ ఆప్షన్.

వీటిలో ఇన్వెస్ట్ చేసేవారు నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక లేదా వార్షిక వాయిదాల్లో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. వీటిపై ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే వడ్డీని పొందవచ్చు. బ్యాంకులతో పాటు పోస్టాఫీసులు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా రికరింగ్ డిపాజిట్ అకౌంట్లను అందిస్తున్నాయి.


ప్రస్తుతం పోస్టాఫీస్‌లో వడ్డీ రేట్లు అధికంగా ఉన్నాయి. నెల నెల చిన్న మొత్తాల్లో పొదుపు చేయాలనుకునే వారికి పోస్టాఫీసు అందించే రికరింగ్ డిపాజిట్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఇందులో వడ్డీ రేటు 6.7 శాతంగా ఉంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు.

పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ లో పదేళ్ల కాలం పాటు కొంత సొమ్ము పెట్టుబడి పెట్టుకుంటూ పోతే ఏకంగా రూ.17 లక్షలు మీ చేతికి అందుతాయి. నెలకు రూ.10 వేల చొప్పున ఐదేళ్ల పాటు పెట్టుబడి పెట్టి ఆ తర్వాత మరో ఐదేళ్లు వేచి ఉంటే అసలు, వడ్డీ కలిపి రూ.17 లక్షలు మీ చేతికి అందుతాయి

అన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రికరింగ్ డిపాజిట్ల ఫీచర్లు దాదాపు ఒకే విధంగా ఉన్నప్పటికీ, కొన్ని ప్రయోజనాలు, వడ్డీ రేట్లు మాత్రం మారుతుంటాయి. ముఖ్యంగా డిపాజిటర్ల పొదుపు అలవాట్లను పోత్స్రహించడమే లక్ష్యంగా పోస్టాఫీసులు రికరింగ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లను అందిస్తాయి. బ్యాంకులు అందించే ఆర్డీల వడ్డీరేట్లు మాత్రం మారవచ్చు.