DEECET-2024-notification-online-application

DEECET-2024-notification-online-application

టీచర్ అవ్వాలని అనుకునే వారికి గుడ్ న్యూస్. ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. టీచర్ జాబ్ కొట్టాలంటే ముందు ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఆ కోర్సు చేయాలి. రెండు సంవత్సరాలు కాల వ్యవధి ఉన్న ఈ డైట్ కోర్సు చేస్తే డీఎస్సీ ద్వారా టీచర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడైనా ప్రైవేట్ గా స్కూల్లో చెప్పాలనుకున్న ఈ డైట్ కోర్స్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. రెండు సంవత్సరాలుచేసే ఈ డైట్ కోర్స్ కి దరఖాస్తులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి వివరాలు  జిల్లా విద్యా శిక్షణ సంస్థ డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ విడుదల అయినట్లు విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఏప్రిల్ 23 నుంచి మే 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తు రుసుము చెల్లించి ఆన్లైన్లోనే ప్రవేశ పరీక్ష దరఖాస్తు దాఖలు చేయాలన్నారు. మే 9 వరకు గడువు ఉందని తెలిపారు. మే 21 నుండి హాల్ టికెట్లు ఆన్‌లైన్‌లో పొందవచ్చని, ప్రవేశ పరీక్ష మే 24న జరుగుతుందని తెలిపారు. ఫలితాలు మే 30న విడుదల చేసి, జూన్ 6 నుంచి 8 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకుంటే జూన్ 12 నుండి కేటాయించిన డైట్ కళాశాలలో ప్రవేశాలు జరుగుతాయని ఈ సందర్భంగా ఆమె వివరించారు.

పూర్తి వివరాలకు www.apdeecet.apcfss.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు అన్నారు. పైన తెలిపిన వివరాలు ఆధారంగా విద్యార్థులందరూ కూడా తెలుసుకొని అప్లై చేసుకోవాలని తెలియజేశారు. దరఖాస్తు రుసుము చెల్లించిన తేదీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఒకరోజు ముందు రుసుము చెల్లిస్తే మంచిదని తెలియజేశారు. ప్రవేశ పరీక్ష నెల రోజుల్లోపు ఉన్నందున ప్రతి ఒక్కరు కూడా మంచి పుస్తకాలు చదివి పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వాలని తెలియజేశారు. పరీక్ష రాసిన తర్వాత కచ్చితంగా ఫలితాలు చూసుకొని వెబ్ ఆప్షన్లు సక్రమంగా పెట్టి కళాశాలలకు జాయిన్ అవ్వాలని తెలియజేశారు.

AP DEECET-2024 PAYMENT FORM LINK CLICK HERE

AP DEECET-2024 ONLINE APPLICATION LINK CLICK HERE

AP DEECET-2024 OFFICIAL WEBSITE LINK CLICK HERE