UGADI-whatsapp-messeges-photo-frames-2023
ఈ ఏడాది పాడ్యమి తిథి మార్చి 21వ తేదీన మంగళవారం రాత్రి 10:52 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే 22వ తేదీ రాత్రి 8:20 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథిని పరిగణనలోకి తీసుకుంటాం కాబట్టి ఈసారి ఉగాది పండుగను 22వ తేదీ బుధవారం నాడు జరుపుకుంటారు.
తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం వచ్చేసింది. ప్రజలు ఎంతో సంతోషంగా, నూతనోత్సాహంతో ఈ పండుగను జరుపుకునేందకు సిద్ధమయ్యారు. కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో అంతా మంచే జరగాలని కోరుకుంటారు. అందరూ బాగుండాలని ఆకాంక్షిస్తారు. ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అయితే తమ దగ్గర లేని సన్నిహితులకు ఫోన్‌ల ద్వారా చాలా మంది విషెస్ చెబుతారు. కొత్త సంవత్సరంలో అంతా శుభమే జరగాలని శుభాకాంక్షలు పంపుతారు. అయితే టెక్ట్స్ రూపంలో కాకుండా వాట్సాప్ స్టిక్కర్స్ ద్వారా అయితే మరింత వినూత్నంగా, ఆకర్షణీయంగా శుభాకాంక్షలు చెప్పవచ్చు. ఇందుకోసం ముందుగా వాట్సాప్‌కు ఉగాది స్టిక్కర్లను యాడ్ చేసుకోవాలి.
UGADI 2023 PHOTO FRAMES MOBILE APP SET-1
UGADI FESTIVAL PHOTO FRAMES APPS SET-2

UGADI FESTIVAL MOBILE APPS SET-3
UGADI FESTIVAL MOBILE APPS SET-4
ఆ తర్వాత ఆ స్టిక్కర్లను ఇష్టమైన వారికి పంపవచ్చు. మరి వాట్సాప్‌కు ఉగాది స్టిక్కర్లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి.. ఎలా సెండ్ చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
వాట్సాప్‌కు ఉగాది స్టిక్కర్లు యాడ్ చేయండిలా
- ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ ( Google Play Store ) యాప్ ఓపెన్ చేయాలి.
- ఆ తర్వాత సెర్చ్ బార్‌లో ఉగాది వాట్సాప్ స్టిక్కర్స్ (Ugadi WhatsApp stickers) లేదా ఉగాది స్టిక్కర్స్ (Ugadi Stickers ) అని టైప్ చేసి, సెర్చ్ చేయాలి.
- ఆ తర్వాత కింద వచ్చిన యాప్స్‌లో నచ్చిన దానిపై క్లిక్ చేయాలి. అనంతరం దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
- ఇన్‌స్టాల్ చేసుకున్న స్టిక్కర్స్ యాప్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత ఇష్టమైన ఉగాది స్టిక్కర్ ప్యాక్‌పై క్లిక్ చేయాలి.
- క్లిక్ చేయగానే యాడ్ టూ వాట్సాప్ అనే బటన్ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఆ స్టిక్కర్లు వాట్సాప్‌కు యాడ్ అవుతాయి.
- అనంతరం వాట్సాప్ యాప్‌లోకి వెళ్లాలి. ఎవరికి విషెష్ పంపాలనుకున్నారో వారి చాట్‌లోకి వెళ్లాలి.
- ఆ తర్వాత టెక్ట్స్ బాక్స్ పక్కన ఉండే ఎమోజీ సింబల్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత GIF ఐకాన్ పక్కనే స్టిక్కర్స్ సింబల్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీరు స్టిక్కర్స్ యాప్ ద్వారా యాడ్ చేసిన ఉగాది స్టిక్కర్స్ కనిపిస్తాయి.
- అనంతరం ఏది పంపాలనుకుంటే ఆ స్టిక్కర్‌పై క్లిక్ చేస్తే చాలు సెండ్ అవుతుంది.
UGADI FESTIVAL PHOTO FRAMES-1 CLICK HERE
UGADI FESTIVAL PHOTO FRAMES -2 CLICK HERE
Ugadi 2022 Wishes in Telugu / ఉగాది శుభాకాంక్షలు 2023
- జీవతం సకల అనుభూతుల సమ్మిశ్రమం – స్థితప్రజ్ఞత అలవరుచుకోవడం వివేక లక్షణం అదే ఉగాది తెలిపే సందేశం.ఉగాది శుభాకాంక్షలు
- తీపి, చేదు కలిసిందే జీవితం.. కష్టం, సుఖం తెలిసిందే జీవితం.. ఆ జీవితంలో ఆనందోత్సాహాలు పూయించేందుకువస్తుంది ఉగాది పర్వదినం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.
- వసంతం మీ ఇంట రంగవల్లులు ఆడాలి,కోకిల మీ ఇంటికి అతిధిగా రావాలి, కొత్త చిగురుల ఆశల తోరణాలు కట్టాలి.మీకు, మీ కుటుంబసభ్యులకు ఉగాది శుభాకాంక్షలు .
- కాలం పరుగులో మరో మైలు రాయి ఈ కొత్తసంవత్సరం… ఈ సంవత్సరమంతా జయాలు కలగాలి సంతోషాలు పొంగలి ఉగాది శుభాకాంక్షలు.
- ప్రకృతిని పులకరింప చేసేదే చైత్రం.. మనలను పలకరించేదే మన స్నేహం… షడ్రుచుల కలబోత మన బంధం.. అను భూతులతో నిత్య నూతనం.. ఉగాది శుభాకాంక్షలు.
- జీవితం సకల అనుభూతుల సమ్మిశ్రమం స్థితప్రజ్ఞత అలవరుచుకోవడం వివేకి లక్షణం
అదే ఉగాది తెలిపే సందేశం. ఉగాది శుభాకాంక్షలు