2023-24-pensioners-incometax-rules-details

2023-24-pensioners-incometax-rules-details

2023–2024 పెన్షనర్ల ఆదాయపు పన్ను- ముఖ్యాంశాలు.
ఆదాయపు పన్ను  పరిధిలో గల పెన్షనర్ల నుండి 2023-24 ఆర్ధిక సంవత్సరానికి ఆదాయపు పన్ను మినహాయింపు జులై 2023 పేయబులో ఇన్ ఆగఘ్ట పెన్షన్ నుండి పిబ్రవరి పెయిడ్ ఇన్ మార్చి వరకు సమాన వాయిదాలలో  రికవరి చేయాలని అందరు డిటివో లకు యస్ టివో లకు ఆదేశాలను FINo-2-14060/112/2022-D SEC-DTA (1899620) తేది17/7/2023 ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ట్రెజరీస్ అండ్ అక్కౌంట్సు డిపార్టుమెంట్ వారు  ఐ టి శాఖవారి సర్కులర్ నెం. 4 ఆఫ్ 2023 తేది5/4/2023 ననుసరించి  ఉత్తర్వులు విడుదల చేసారు..
 దీనివల్ల  పెన్షనర్లందరు డిపాల్ట్ గా న్యూరీజియమ్ పరిధిలోకి వస్తారు. ఎవరేని పెన్షనర్ పాత విధానంలో కొనసాగదలచుకుంటే సంబంధిత STO గారికి వ్రాత పూర్వకంగా ఓల్డ్ రీజియంలో కొనసాగించని కోరుతూ దరఖాస్తు ఇవ్వవలసి ఉంటుంది. 
ఆర్థిక సంవత్సరం 2023–2024 (1 ఏప్రిల్ 2023 నుండి 31 మార్చి 2024 )  అంటే అసెస్మెంట్ సంవత్సరం 2024-2025 లో.
పెన్షనర్స్ చెల్లించాలిసిన ఇన్కమ్ టాక్స్ వారి పెన్షన్ ఆధారంగా మదింపు చేసి ఐ టి డిడక్షన్  జులై 2023 పెన్షన్ నుండి పిబ్రవరి పెయిడ్ ఇన్ మార్చి వరకు 8నెలలో సమాన వాయిదాలలో వసులు చేయాలని డిడివో లకు ఆదేశాలు ఇచ్చినందున ఈ క్రింది అంశాలు ఓ సారి చూద్దాం.
మన ఇన్కమ్ టాక్స్ సాధారణంగా మన DDO ద్వారా మినహాయించ బడుతుంది.* ఐ టి చట్టం   Section 192 ప్రకారం  the employer will deduct TDS on salary / Pension at the time of making the payment to the employee. Since the employee gets a salary every month, the employer will make a deduction for TDS on salary every month. In case, the employer fails to deduct the same, he will be liable to pay the penalty and interest. కావునా న్యూరీజియం ప్రకారం ఐటి చెల్లించదగు ఆదాయంఉన్న పెన్షనర్ల నుండి  ప్రతీనెల ఐటి డిడక్ట్ చేయబడును.
ఫిబ్రవరి 1, 2020 నాడు ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2020 లో, సెక్షన్ 80C క్రింద అందుబాటులో ఉన్న రాయితీలు మరియు మినహాయింపులను వదులుకునే వ్యక్తుల కోసం  ఒక *నూతన మరియు ఐచ్ఛిక ఆదాయపు పన్ను విధానం ప్రవేశపెట్టబడింది* . 
2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను స్లాబ్ మరియు రేట్లు (AY 2024-25)   మార్పులను ఆర్థిక మంత్రి ప్రకటించారు.  ప్రకటించిన మార్పులు ఏప్రిల్ 1, 2023 నుండి ప్రారంభమయ్యే FY 2023-24లో ఆర్జించే ఆదాయాలకు వర్తిస్తాయి. బడ్జెట్ 2023 కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను స్లాబ్‌లను మార్చింది. 
1.ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు
2.ఆదాయపు పన్ను శ్లాబుల సంఖ్యను 6 నుంచి ఐదుకు తగ్గించారు
3.సెక్షన్ 87A కింద పన్ను రాయితీని రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షల ఆదాయ స్థాయికి పెంచారు. 
పన్ను రాయితీ మొత్తం రూ.12,500 నుంచి రూ.25,000కి రెట్టింపు అయింది.* 
4.కొత్త పన్ను విధానంలో అత్యధిక సర్‌ఛార్జ్ రేటు 37% నుండి 25%కి తగ్గించబడింది
5. *2023-24 ఆర్థిక సంవత్సరం నుండి జీతం పొందే వ్యక్తులు మరియు పెన్షనర్‌లకు రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రవేశపెట్టబడింది.* 
FY 2023-24 కోసం కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను స్లాబ్‌లు
ఆదాయపు పన్ను స్లాబ్‌లు   -ఆదాయపు పన్ను రేటు (%)
0 — 3,00,000 మధ్య                      0
3,00,001- 6,00,000 మధ్య          5%
6,00,001 – 9,00,000 మధ్య        10%
9,00,001- 12,00,000 మధ్య       15%
12,00,001- 15,00,000 మధ్య      20%
15,00,001 పైన                             30%
పాత పన్ను విధానంలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది FY 2023-24లో కూడా గతంలో వలే మూడు ఆదాయపు పన్ను స్లాబ్‌లను కలిగి ఉంటుంది. 
పాత పన్ను విధానంలో .,.,
60 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు,  ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ. 2.5 లక్షలు.
సీనియర్ సిటిజన్లకు – 60 ఏళ్లు  నుండి 80 ఏళ్లలోపు –  ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ. 3 లక్షలు. 
సూపర్ సీనియర్ సిటిజన్లకు – 80 ఏళ్లు  అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి – మినహాయింపు పరిమితి రూ. 5 లక్షలు.
 60 ఏళ్లలోపు వ్యక్తులకు FY 2023-24 పాత పన్ను విధానంలో  ఆదాయపు పన్ను స్లాబ్‌లు .
ఆదాయపు పన్ను స్లాబ్‌లు   ఆదాయపు పన్ను రేటు (%)
0- 2,50,000 మధ్య                     0
2,50,001- 5,00,000 మధ్య         5%
5,00,001- 10,00,000 మధ్య     20%
10,00,001 పైన                          30%
FY 2023-24 లో పాత పన్ను విధానంలో 60- 80 సంవత్సరాల మధ్య ఉన్న సీనియర్ సిటిజన్లకు ఆదాయపు పన్ను స్లాబ్‌లు
ఆదాయపు పన్ను స్లాబ్‌లు ఆదాయపు పన్ను రేటు (%)
0 – 3,00,000 మధ్య                   0
3,00,001 – 5,00,000 మధ్య      5%
5,00,001- 10,00,000 మధ్య   20%
10,00,001 పైన                        30%
సూపర్ సీనియర్ సిటిజన్లు (80 ఏళ్లు  అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) కొత్త పన్ను విధానంలో రూ. 3 లక్షలు గాఉంటే పాత పన్ను విధానంలో రూ. 5 లక్షల ప్రాథమిక మినహాయింపు పరిమితిని కలిగి ఉంటుంది.
పాత కొత్త పన్ను విధానంలో సూపర్ సీనియర్ సిటిజన్లకు  ఆదాయపు పన్ను స్లాబ్‌లు
ఆదాయపు పన్ను స్లాబ్‌లు ఆదాయపు పన్ను రేటు (%)
0 – 5,00,000 మధ్య                      0
5,00,001 – 10,00,000 మధ్య     20%
10,00,001 పైన                           30%
2023 బడ్జెట్ ఆదాయపు పన్నుపై కొత్త పన్ను విధానంలో సర్‌ఛార్జ్ రేటును కూడా సవరించింది. FY 2023-24 నుండి కొత్త పన్ను విధానంలో వర్తించే సర్‌ఛార్జ్ రేటు క్రింది విధంగా ఉంది:


ఆదాయం (రూ.లలో) సర్‌ఛార్జ్ రేటు (%)
50,00,000 పైన ఆదాయం          10
1,00,00,000 పైన ఆదాయం        20
2,00,00,000 పైన ఆదాయం        25
అయితే, ఒక వ్యక్తి FY 2023-24లో పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే సర్‌ఛార్జ్ రేటులో ఎటువంటి మార్పు ప్రకటించబడలేదు.
ఆదాయపు పన్ను మొత్తం పై సెస్ రెండు పన్ను విధానాలలో  పన్ను మొత్తంపై 4% ఆరోగ్య &విద్యా సెస్  కూడా లెక్కించి ఇన్కమ్ టాక్స్ కట్టాలి.
Note:- *2023 బడ్జెట్ లో ఐ టి పై ప్రకటించిన దానినిబట్టి సెక్షన్ 87A ప్రకారం,ఆదాయపు పన్ను కు లెక్కించతగు ఆదాయం రూ.7 లక్షల లోపు ఉన్నవారికి రూ.25000 వరకు రిబేట్ అందుబాటులో ఉంది*
సేవింగ్స్ అన్ని సెక్షన్లు పోను పెన్షనర్స్ ఆదాయం 5లక్షలలోపు ఉంటే ఓల్డ్ రీజియంలో ఐటి పడదు.      ఏ సేవింగ్స్ చూపకపోయినప్పటికి 7 లక్షల ఏభైవేలు లోపు ఆదాయం ఉంటే వారికి న్యురీజీయంలో  87Aఅనుసరించి టేక్స్ పడదు.* 
ఉదాహరణ 1 (60 సంవత్సరాలు పైబడిన పెన్షనర్ కు)
7 లక్షల ఆదాయం కలవారికి పాత ,కొత్త విధానములలో ఐటి ఎలా ఉంటుందో చూద్దాం.
                               ఓల్డ్                       న్యూ రీజియం
గ్రాస్ ఆదాయం      700000                 700000
SD                         50000                   50000
Taxable income 650000                650000
Tax Up to 3L                 0                             0
>3 up to5L 5%      10000  old                     –
3 L to 6 L   5%               –   new           15000
5L to 10L 20%      30000                          –
6L to 9L 10%                                          5000 
Total Tax               40000                    20000
Cess 4%                   1600                        800
net tax                    40160                    20800
న్యు రీజీయంలో 7లక్షలలోపు టేక్స్ బుల్ ఆదాయం ఉన్నందున 87A వర్తించి టేక్స్ నుండి పూర్తి మినహాయింపు లభిస్తుంది. ఓల్డ్ రీజియంలో వీరికి ఏ విధమైన సేవింగ్స్ లేనందున 40160 ఐ టి కట్టవలసి ఉంటుంది.
ఉదాహరణ 2 (60 సంవత్సరాలు పైబడిన పెన్షనర్ కు)
755000 ఆదాయం కలవారికి పాత ,కొత్త విధానములలో ఐటి ఎలా ఉంటుందో చూద్దాం.
                               ఓల్డ్                       న్యూ రీజియం
గ్రాస్ ఆదాయం      755000                 755000
SD                            50000                   50000
Taxable income 705000                705000
Tax Up to 3L                 0                             0
>3 up to5L 5%      10000  old                     –
3 L to 6 L   5%               –   new           15000
5L to 10L 20%      41000                          –
6L to 9L 10%                                       10500
Total Tax               51000                    25500
Cess 4%                   2040                      1020
net tax                    53040                   26520
న్యు రీజీయంలో 7లక్షలు పైబడి టేక్స్ బుల్ ఆదాయం ఉన్నందున 87A వర్తించదు. న్యూ రీజియంలో 26520 టేక్స్ కట్టవలసి రాగా  ఓల్డ్ రీజియంలో వీరికి ఏ విధమైన సేవింగ్స్ లేనందున 53040 ఐ టి కట్టవలసి ఉంటుంది.
ఈ ఉదాహరణను బట్టి న్యూ రీజియంలొ 7లక్షల ఏభైవేలు లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఐ టి పడదు. సేవింగ్స్ లేని పెన్షనర్లకు కూడా న్యూ రీజియం ఉపయోగకరము.
పెన్షనర్లు స్వయంగా ఐ టి లెక్కించుకొని వారికి ఏది ఉపయుక్తమో నిర్ణయించుకొని ఓల్డ్ రీజియం లాభసాటి అనుకుంటే సంబంధిత STO గారికి ఆప్షన్ ఇవ్వవలసి ఉంటుంది. న్యూ రీజియం ఉపయోగకరము అనుకునేవారు ఆప్షన్ ఇవ్వవలసి పని లేదు.