SBI Quick: ఫోన్ ఉంటే చాలు… ఎస్‌బీఐ నుంచి ఈ సేవలన్నీ ఈజీగా పొందొచ్చు
టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ బ్యాంకింగ్ సేవలూ సులువవుతున్నాయి.
ఫోన్ ఉంటే చాలు… బ్యాంకింగ్ సేవల్ని ఎక్కడ్నుంచైనా పొందొచ్చు. ‘ఎస్‌బీఐ క్విక్’ పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక బ్యాంకింగ్ సేవల్ని కస్టమర్లకు అందిస్తోంది.
మరి ఎస్‌బీఐ క్విక్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.
మీరు మీ ఫోన్ నెంబర్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేయించారా?
అయితే ఫోన్ బ్యాంకింగ్ సేవలు ఈజీగా పొందొచ్చు. ‘ఎస్‌బీఐ క్విక్’ ద్వారా బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఇ-స్టేట్‌మెంట్, లోన్ ఆఫర్స్ ఇలా ఎలాంటి సేవలైనా సులువుగా పొందొచ్చు.
మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇప్పటికే అనేక సేవలు పొందుతూ ఉండొచ్చు.
కానీ ఫోన్ బ్యాంకింగ్ ద్వారా కొన్ని సేవలు ఇంకా సులువుగా లభిస్తాయి.
ఖాతాదారులకు కావాల్సిన సమాచారాన్ని వెంటనే అందించేందుకు మిస్డ్ కాల్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవల్ని ప్రారంభించింది SBI.