Recruitment of various posts in Government General Hospital-Guntur

Recruitment of various posts in Government General Hospital, Guntur

జీజీహెచ్, గుంటూరులో 129 పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ).. గుంటూరు జిల్లా ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో(జీజీహెచ్‌) ఒప్పంద/అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 129

► పోస్టుల వివరాలు: ల్యాబ్‌ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఫిజిసిస్ట్, డేటాఎంట్రీ ఆపరేటర్, బయో–మెడికల్‌ ఇంజనీర్, ఆప్టోమెట్రిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, రేడియేషన్‌ సేఫ్టీ ఆఫీసర్, ల్యాబ్‌ అటెండెంట్స్‌ తదితరాలు.

► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, జీఎన్‌ఎం, డిప్లొమా/బీఎస్సీ, బయోమెడికల్‌ ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నాలజీలో సర్టిఫికేట్‌ కోర్సులతోపాటు ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. 

► వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 12,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్, జీజీహెచ్, గుంటూరు, ఏపీ చిరునామకు పంపించాలి.

Application Fee:-
Rs.300 for OC/BC Candidates
100 for SC/ST Candidates
The application fees should be paid by the way of Demand Draft only from
SBI and UNION Banks in favour of Superintendent, HDS, Government
General Hospital, Guntur payable at Guntur

► దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021

► వెబ్‌సైట్‌:  guntur.ap.gov.in

NOTIFICATION CLICK HERE

APPLICATION FORM CLICK HERE