Incometax-doubts-answers-it-sodtware

Incometax-doubts-answers-it-sodtware

Income Tax ఈ ఫైలింగ్ కు చివరి తేదీ: 31-12-2021*
ఫైనాన్షియల్ ఇయర్ 2020–21 కోసం ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్ రిటర్న్స్‌‌‌‌ (ఐటీఆర్‌‌‌‌‌‌‌‌) ఫైల్ చేయడానికి ఈ నెల 31 డెడ్‌‌‌‌లైన్‌‌‌‌.

నా సంవత్సరాదాయంపై ఆదాయపుపన్ను లేదు ఐటి రిటరన్స్ దాఖలు చేయాలా? చేయకపోతే ఏమిటి? ట్రెజరీ వారు నా ఆదాయంలో కొంత పన్నుగా డిటక్ట్ చేసుకొన్నారు నేను ఐటి రిటరన్స్ ఇవ్వడం అవసరమా? వంటి మన అనుమానాలకు ఆదాయపు పన్ను శాఖ వారిచ్చిన జవాబులు ఓ సారి పరిశీలించండి.

ప్రశ్న). రిటర్న్ దాఖలు చేయనందుకు జరిమానా ఏమిటి?*

జవాబు). 31 డిసెంబర్ 2021 తర్వాత దాఖలు చేసిన రిటర్న్‌లు(ఇ ఫిల్లింగ్), పెనాల్టీ పరిమితి రూ.5,000కి పెంచబడుతుంది. అయితే, చిన్న పన్ను చెల్లింపుదారులకు ఉపశమనంగా, మీ మొత్తం ఆదాయం రూ. 5 లక్షలకు మించకపోతే, ఆలస్యమైతే గరిష్టంగా రూ. 1000 జరిమానా మాత్రమే ఉంటుందని ఐటీ శాఖ పేర్కొంది.*

ప్రశ్న). నా ఆదాయం 5 లక్షల కంటే తక్కువ ఉన్నట్లయితే నేను పన్ను రిటర్న్‌ను దాఖలు చేయాలా?*
జవాబు). పన్ను చెల్లించదగిన ఆదాయం 5 లక్షల కంటే తక్కువ ఉంటే మీరు పన్నులు చెల్లించనవసరం లేనప్పటికీ, మీరు ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేయాలి. మీరు ITR ఫైల్ చేయడంలో విఫలమైతే, మీరు ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసును పొందవచ్చు*

ప్రశ్న) ట్రెజరీ వారు నా ఆదాయంలో కొంత పన్నుగా డిటక్ట్ చేసుకొన్నారు నేను ఐటి రిటరన్స్ ఇవ్వడం అవసరమా?*
*జవాబు) ఆదాయం నుండి ఆదాయపు పన్ను డిడక్ట్ చేయబడిన వారు ఖచ్చితంగా ఐటి రిటరన్స్ సబ్మిట్ చేయాలి*

ప్రశ్న) ఎవరు ఐటీఆర్‌‌‌‌‌‌‌‌ను ఫైల్ చేయాలి?*
*జవాబు) సాధారణంగా ఒక ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌‌‌‌‌లో రూ. 2.5 లక్షలు కంటే ఎక్కువ ఇన్‌‌‌‌కమ్ సంపాదిస్తే ఇన్‌‌‌‌కమ్ ట్యాక్స్ కట్టాలి. ఒక ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌‌‌‌‌లో వ్యక్తి సంపాదించిన ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ (గ్రాస్‌‌‌‌) బేసిక్ మినహాయింపును మించితే, ఆ వ్యక్తి ట్యాక్స్ రిటర్న్స్‌‌‌‌ ఫైల్ చేయాల్సిందే.*

ప్రశ్న) కొత్త ట్యాక్స్ సిస్టమ్‌‌‌‌ ఎంచుకుంటే హౌస్‌‌ రెంట్‌‌ అలవెన్స్‌‌ (హెచ్‌‌ఆర్‌‌‌‌ఏ), లీవ్‌‌ ట్రావెల్ అలవెన్స్‌‌ వంటి కామన్‌‌ ట్యాక్స్ మినహాయింపులను క్లయిమ్ చేసుకోవచ్చా ?*

జవాబు) వీలు లేదు.

ప్రశ్న) పాత ట్యాక్స్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ను ఎంచుకుంటామనుకుంటే బేసిక్ ఇన్‌‌‌‌కమ్ మినహాయింపు ఎంత?*
జవాబు) బేసిక్ ఇన్‌‌‌‌కమ్ మినహాయింపు ఏజ్‌‌‌‌ను బట్టి మారుతుంది. బేసిక్ ఎక్జంప్సన్ 60 ఏళ్లలోపు వాళ్లయితే, సంపాదించిన ఆదాయంలో రూ. 2.5 లక్షలు , 60–80 ఏళ్లు మధ్య ఉన్న వారి (సీనియర్ సిటిజన్స్‌‌‌‌) ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ రూ. 3 లక్షలు , 80 ఏళ్ల పైన ఉంటే (సూపర్‌‌‌‌‌‌‌‌ సిటిజన్స్‌‌‌‌) రూ. 5 లక్షలుగా ఉంది.*

ప్రశ్న) ఇన్‌‌‌‌కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం ఐటీఆర్‌‌‌‌‌‌‌‌ ఎవరు ఫైల్ చేయాలి?.*

జవాబు) కింద పేర్కొన్న కేటగిరీలు వారు తప్పని సరిగా ఐటిఆర్ ఫైల్ చేయాలి
1) ఫారిన్ కంట్రీకి ట్రావెల్ చేయడానికి తన కోసమైన లేదా ఇతరుల కోసమైన ఒక ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌‌‌‌‌లో రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసినవాళ్లు.

2) ఒక అకౌంట్ లేదా వివిధ బ్యాంక్ అకౌంట్లలో రూ. కోటి కంటే ఎక్కువ డిపాజిట్ చేసినవారు.

3) ఫైనాన్షియల్‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌లో ఒకే ఎలక్ట్రిసిటీ బిల్లులో రూ. లక్ష చెల్లించిన వారు.

4) విదేశాల నుంచి ఆదాయం వస్తున్న వారు. విదేశాల్లో ఆస్తులు ఉన్నవారు.

5) క్యాపిటల్‌‌‌‌ గెయిన్స్‌‌‌‌పై ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్ చట్టంలోని కొన్ని మినహాయింపులను క్లయిమ్ చేసుకోకముందే, వ్యక్తి గ్రాస్ ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ బేసిక్‌‌‌‌ మినహాయింపును దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాలి.

6) ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌‌‌‌‌లో వ్యక్తి యొక్క ఆదాయం బేసిక్ మినహాయింపును దాటకపోయినా, ట్యాక్స్ కట్‌‌‌‌ అయితే రీఫండ్ కోసం ఐటీఆర్‌‌‌‌‌‌‌‌ ను ఫైల్ చేయాలి.

Income tax Latest Software.
F.Y 2021-22, A.Y 2022-23
మొబైల్ సాఫ్ట్‌వేర్ & Excel సాఫ్ట్‌వేర్

INCOME TAX LATEAT SOFTWARE CLICK HERE

Incometax-doubts-answers-it-software

 REMINDER
ఆదాయపు పన్ను – Incometax e-filing గడువు తేదీ 31.12.2021 …*
Income Tax Return: 5 నిమిషాల్లోనే ఐటీఆర్ ఫైల్ చేసుకోవచ్చు ఇలా… మొత్తం ప్రాసెస్ 8 స్టెప్స్‌లోనే.
ఐటీఆర్ ఫైలింగ్ ప్రాసెస్ STEP BY STEP
https://apteachers360.com/income-tax-return-efiling-process-within-5-minutes-details/
Reminder*

Income tax e-filing చేయని వారికి messages వస్తున్నాయి,*

కావున ఉపాధ్యాయులు అందరు తే:31.12.2021ది వరకు wait చేయకుండా త్వరపడి e-filing పూర్తి చేయవలసినదిగామనవి.. సమయం ఉంది అనుకుంటే, సర్వర్ బిజీ అవుతుంది.*

కావున ఇపుడే A.Y: 2021-22 సంబంధించి త్వరగా e-filing చేసుకోగలరు