how-to-Filing-income-tax-e-filing-process-step-by-step-exaplanation

how-to-Filing-income-tax-e-filing-process-step-by-step-exaplanation

HOW TO FILE INCOME TAX RETURN E FILING AY 2023- 24 IN TELUGU FY 2022-23 – IT E FILING

ITR Filing: సీఏ సహాయం లేకుండా సొంతంగా ఐటీ రిటర్న్‌ ఫైల్ చేయొచ్చు.. ప్రాసెస్ ఇదే.

ITR Filing: కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే ఎవరి సహాయం లేకుండానే ఇంట్లో కూర్చొని సొంతంగా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం.

పన్ను చెల్లింపుదారులు (Tax Payers) ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచే 2022-23 ఆర్థిక సంవత్సరం (2023-24 అసెస్‌మెంట్‌ ఇయర్‌)కు సంబంధించి ఇన్‌కమ్‌ ట్యాక్స్ రిటర్న్స్‌ (ITR)ను దాఖలు చేస్తున్నారు. ఐటీ రిటర్న్స్ దాఖలుకు చివరి తేదీని 2023, జులై 31గా ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది. ఈ గడువు తేదీలోగా ఎలాంటి లేట్ ఫీజు లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. లేని పక్షంలో రూ.100 నుంచి రూ.500 వరకు పెనాల్టీ రూపంలో చెల్లించుకోక తప్పదు. పెనాల్టీలను నివారించడానికి, అర్హత ఉన్న ఏవైనా డిడక్షన్స్ లేదా రీఫండ్స్ క్లెయిమ్ చేయడానికి ITR సమయానికి ఫైల్ చేయడం ముఖ్యం. ప్రస్తుతం ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి మూడు వారాల సమయమే మిగిలి ఉంది.

గత ఏడాది ఐటీ రిటర్న్‌ల దాఖలు గడువును పొడిగించలేదు, ఈ ఏడాది కూడా పొడిగించే సూచనలు కనిపించడం లేదు. కాబట్టి సమస్యల్లో పడకుండా ఇచ్చిన గడువులోపు దాఖలు ప్రక్రియను పూర్తి చేయడం చాలా కీలకం. చివరి నిమిషం వరకు ఆలస్యం చేసి హడావుడిగా పూర్తి చేస్తే తప్పులు దొర్లే అవకాశం కూడా ఉంది కాబట్టి వీలైనంత త్వరగా ఈ ప్రాసెస్ పూర్తి చేయడం మంచిది.

* CA సహాయం అవసరం లేదు

INCOME TAX E FILING LOGIN PAGE LINK

e-Filing of ITR PROCESS TWO METHODS CLICK HERE

అయితే ఇన్‌కమ్‌ ట్యాక్స్ ఫైల్ చేయడం చాలా కష్టతరంగా ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. సర్టిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ (Chartered Accountant) సహాయం తీసుకోవాలని కూడా అనుకుంటారు. కానీ కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే ఎవరి సహాయం లేకుండానే ఇంట్లో కూర్చొని సొంతంగా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం.

ఐటీ రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి సింపుల్ స్టెప్స్

– ముందు ఐటీ శాఖకు చెందిన ఈ-ఫైలింగ్ పోర్టల్‌ www.incometaxindiaefiling.gov.inని విజిట్ చేయాలి.

– ఆల్రెడీ అకౌంట్ ఉంటే, పోర్టల్‌కు లాగిన్ అవ్వాలి. లేకుంటే అకౌంట్ క్రియేట్ చేయడానికి “నౌ రిజిస్టర్”పై క్లిక్ చేయాలి.

– లాగిన్ అయ్యాక హోమ్‌పేజీలో “ఫైల్” ఆప్షన్ ఎంచుకుని, “ఫైల్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్”పై ట్యాప్ చేయాలి.

– రిటర్న్‌ను ఫైల్ చేస్తున్న తగిన అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంచుకోవాలి.

– ప్రొఫైల్ ఆధారంగా సరైన ఫారమ్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. జీతం పొందే వారు ITR-1 ఫారమ్‌ను ఎన్నుకోవాలి. దానిని సంబంధిత వివరాలతో ఫిల్‌ చేయాలి.

– శాలరీ స్లిప్, ఫారమ్‌ 16, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS) డాక్యుమెంట్స్‌తో ఫిల్ అయిన డేటాను వెరిఫై చేయాలి.

– రిటర్న్‌ను క్లెయిమ్ చేయడానికి ముందు బ్యాంక్ ఖాతా వివరాలు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి.

– డేటాను వెరిఫై చేశాక ITRని సబ్మిట్ చేయాలి.

– బ్యాంక్ వివరాలను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ఐటీఆర్‌ని ఈ-వెరిఫై చేయాలి.

– ఐటీ డిపార్ట్‌మెంట్‌ సాధారణంగా 3-4 వారాలలోపు ITRని ప్రాసెస్ చేస్తుంది. దాఖలు చేసిన రిటర్న్ స్టేటస్ చెక్ చేయడానికి, రిసిప్ట్ నంబర్‌ను ఉపయోగించవచ్చు.

INCOME TAX E FILING LOGIN PAGE LINK

e-Filing of ITR PROCESS TWO METHODS CLICK HERE