How-many-phone-numbers-for-yourself-report

How-many-phone-numbers-for-yourself-report

మీ పేరుపై ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయో తెలుసుకోండి…

Aadhaar Card | మీరు మీ ఆధార్ కార్డుతో (Aadhaar Card) సిమ్ కార్డులు తీసుకున్నారా? మరి మీ ఆధార్ కార్డుకు ఎన్ని సిమ్ కార్డులు లింక్ అయ్యాయి? సింపుల్‌గా ఇలా తెలుసుకోండి.

మనకు తెలియకుండానే మన పేరు మీద ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయో తెలుసుకోవచ్చు.

దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను విజయవాడ టెలికాం విభాగం(డీవోటీ) రూపొందించి  ప్రారంభించింది.

http://tafcop.dgtelecom.gov.in అనే వెబ్‌సైట్‌లో మొబైల్‌ నంబరు..

దానికి వచ్చే ఓటీపీ నమోదు చేయగానే మన పేరుమీద ఉన్న ఫోన్‌ నంబర్ల వివరాలన్నీ వస్తాయి.

వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరుమీద ఉన్న వాటిని సెలక్ట్‌ చేసి సబ్మిట్‌ చేస్తే.. టెలికం శాఖ చర్యలు తీసుకుంటుంది.

‘‘ఒకరి పేరు మీద అత్యధికంగా 9 నంబర్లు ఉండేందుకు వీలుంది. కొందరి పేర్ల మీద అంతకంటే ఎక్కువ నంబర్లు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది.

ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈ పోర్టల్‌ను ప్రారంభించాం’’ అని విజయవాడ టెలికం శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ రాబర్ట్‌ రవి ఒక ప్రకటనలో తెలిపారు.

దీనివల్ల అనధికారికంగా వినియోగిస్తున్న నంబర్లకు చెక్‌ పడనుందని టెలికం వర్గాలు తెలిపాయి.

తొలుత ఏపీ, తెలంగాణ టెలికం సర్కిళ్లలో ఈ సదుపాయాన్ని ప్రారంభించామని.. త్వరలో దేశ వ్యాప్తంగా అందుబాటులోనికి వస్తుందని వెల్లడించాయి.

ఒక ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్ కార్డులు తీసుకోవచ్చు? మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి? తెలుసుకోండిలా!*

గతంలో అయితే ఒక వ్యక్తి పేరుపై 9 సిమ్ కార్డులు తీసుకోవడానికి వీలుండేది. అయితే తర్వాత ప్రభుత్వం 18 సిమ్ కార్డులు తీసుకునే వెసులుబాటు కల్పించింది. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ నిబంధనల ప్రకారం ప్రస్తుతం మీరు మీ ఆధార్ నెంబర్‌పై 18 వరకు సిమ్ కార్డులు తీసుకోవడానికి వీలవుతుంది*

అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సాధారణ మొబైల్ ఫోన్ కమ్యూనికేషన్ కోసం 9 సిమ్ కార్డులు పొందొచ్చు. ఇక మిగిలిన 9 సిమ్ కార్డులను ఎం2ఎం కమ్యూనికేషన్ కోసం తీసుకోవచ్చు. ఇకపోతే మీరు https://tafcop.dgtelecom.gov.in/ లింక్ ద్వారా మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మీరు వాడని నెంబర్లను, అవసరం లేని నెంబర్లను బ్లాక్ చేయొచ్చు.

ఒకప్పుడు ఏదైనా ఐడీ ప్రూఫ్ జిరాక్స్ కాపీ ఉంటే చాలు… ఈజీగా సిమ్ కార్డు (SIM cards) తీసుకునేవారు. ఇలా ఒకరికి తెలియకుండానే వారి పేర్ల మీద సిమ్ కార్డులు ఉండేవి. ఆ తర్వాత ప్రభుత్వం నిబంధనల్ని కఠినతరం చేయడంతో ఇలాంటి మోసాలు (SIM Frauds) తగ్గిపోయాయి.

ఇప్పుడు ఇతరుల పేర్ల మీద సిమ్ కార్డులు తీసుకోవడం అంత సులువు కాదు. మరి మీ పేరు మీద ఎవరైనా సిమ్ కార్డ్ తీసుకున్నారని అనుమానం ఉందా? అసలు మీ ఆధార్ కార్డుతో (Aadhaar Card) ఎన్ని సిమ్ కార్డులు యాక్టివేట్ అయ్యాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? చాలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు. ఇందుకోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ (DoT) కొత్తగా వెబ్ పోర్టల్ లాంఛ్ చేసింది.

టెలికామ్ అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAFCOP) పేరుతో రూపొందించిన ఈ పోర్టల్ మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. పౌరులు ఎవరైనా తమ పేరు మీద ఉన్న సిమ్ కార్డుల వివరాలు తెలుసుకోవచ్చు. మీ ఆధార్ కార్డుతో జారీ చేసిన సిమ్ కార్డుల వివరాలన్నీ తెలుస్తాయి.

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒకరు తమ పేరు మీద గరిష్టంగా 9 మొబైల్ కనెక్షన్స్ తీసుకోవచ్చు. మీ పేరు మీద యాక్టీవ్‌లో ఉన్న సిమ్ కార్డు వివరాలు కూడా ఈ పోర్టల్‌లో తెలుస్తాయి. ఈ పోర్టల్‌లో మీకు సంబంధం లేని ఫోన్ నెంబర్లు కనిపిస్తే రిపోర్ట్ చేయొచ్చు. మరి మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.

మీ ఆధార్ కార్డుపై ఉన్న సిమ్ కార్డుల వివరాలు తెలుసుకోండి ఇలా…

Step 1- ముందుగా TAFCOP వెబ్‌సైట్ https://tafcop.dgtelecom.gov.in/ ఓపెన్ చేయండి.

Step 2- మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి.

Step 3- Request OTP పైన క్లిక్ చేయండి.

Step 4- డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ (DoT) మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ పంపిస్తుంది.

Step 5- ఆ ఓటీపీ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయాలి.

Step 6- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మీ ఆధార్ కార్డుతో తీసుకున్న మొబైల్ నెంబర్ల వివరాలు ఉంటాయి.

Step 7- మీకు సంబంధంలేని ఫోన్ నెంబర్లు కనిపించినా, మీరు ప్రస్తుతం వాడని మొబైల్ నెంబర్స్ ఉన్నా రిపోర్ట్ చేయొచ్చు.

The Telecom Analytics for Fraud management and Consumer Protection (TAF-COP) portal

Department of Telecommunications (DoT) has taken several measures to ensure proper allocation of telecom resources by Telecom Service Providers (TSPs) to subscribers and protect their interests in ensuring reduction of frauds. As per existing guidelines, individual mobile subscribers can register up to nine mobile connections in their name.

This website has been developed to help subscribers, check the number of mobile connections working in their name, and take necessary action for regularising their additional mobile connections if any. However, the primary responsibility of handling the Customer Acquisition Form (CAF) lies with the service providers.

The facilities provided in this portal are as under:

  • Subscribers having more than nine multiple connections in their name will be intimated by SMS.

  • Subscribers having more than nine multiple connections in their name can – Click here, to take necessary action.

  • Go check the status Click here to login with your number and enter the “Ticket ID Ref No” in the “Request Status” box.

DoT has released guidelines on Customer Acquisition. These guidelines permit registration of up to nine mobile connections in a Subscriber’s name – Click here.

FIND YOUR PHONE NUMBERS CLICK HERE