world-ozone-day-september-16th-2023

world-ozone-day-september-16th-2023

World Ozone Day 2023, Theme, History and Significance | ప్రపంచ ఓజోన్ దినోత్సవం 2023, నేపథ్యం, చరిత్ర మరియు ప్రాముఖ్యత.

సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాల నుంచి భూమిని కాపాడే కవచం ఓజోన్ పొర. మూడు పరమాణువులతో కూడిన ఆక్సిజన్ అణువైన ఓజోన్(O3) వాయు రూపంలో, లేత నీలం రంగులో ఉంటోంది

International Ozone Day : ఓజోన్ పొరను రక్షించుకోవడానికి ఓ రోజును పెట్టుకోవడానికి బలమైన కారణాలున్నాయి. ఈ భూమిపై జీవరాశి ఉండటానికి ఓజోనే కారణం. ఆ పొరే లేకపోతే… భూమి అగ్నిగోళంలా మండుతూ ఉండేదే.

World Ozone Day 2023: History ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1994లో సెప్టెంబర్ 16వ తేదీని ఓజోన్ పొరను కాపాడేందుకు ప్రపంచ ఓజోన్ దినోత్సవం లేదా అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. సెప్టెంబర్ 16, 1987న, “ఓజోన్ పొరను క్షీణింపజేసే పదార్థాలపై మాంట్రియల్ ప్రోటోకాల్” 46 దేశాల ప్రభుత్వాలచే సంతకం చేయబడింది.

సూర్యుడి తీవ్రమైన ఎండల నుంచి భూమిని కాపాడేది ఓజోన్ పొరే. ఆ పొరను కాపాడుకోవడం మన బాధ్యత. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ దినోత్సవం జరుపుకుంటున్నాం.

సూర్యుడి ఎండ వల్లే ఈ భూమిపై ప్రకృతి గమనం సాగుతోంది. ఐతే… సూర్యుడి నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలు (ultraviolet rays) భూమిపై డైరెక్టుగా పడితే సకల జీవరాశి మనుగడకు ప్రమాదమే. అలా జరగకుండా మనందర్నీ కాపాడుతోంది భూమి చుట్టూ వాతావరణంలో ఆవహించి ఉన్న ఓజోన్ పొర (ozone layer). 1975లో అంటార్కిటికా (Antarctica) ప్రాంతంలో ఓజోన్ పొర దెబ్బతినడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. నానాటికీ అది పలుచన అవుతూ… 1987 నాటికి తీవ్రంగా దెబ్బతింది. మనుషులు చేసే చర్యల వల్ల ఉత్పత్తి అవుతున్న ప్రమాదకర వాయువులు, రసాయనాలే.. ఓజోన్ పొరను దెబ్బతీశాయని గుర్తించారు. మరి దాన్ని రక్షించుకునేందుకు ఏటా సెప్టెంబర్ 16న ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం (World ozone day)ను నిర్వహిస్తున్నాయి.
ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న 100 రకాల ఉత్పత్తులను వాడకుండా చేసేందుకు ప్రపంచ దేశాల మధ్య మాంట్రియల్ ప్రోటోకాల్ అనే ఒప్పందం సెప్టెంబర్ 16, 1987న కుదిరింది. అప్పటి నుంచి ఏటా సెప్టెంబర్ 16న ఓజోన్ పొరను ఎలా కాపాడాలనే అంశంపై ప్రపంచ దేశాలు అవగాహన కలిగిస్తున్నాయి. అందులో భాగంగా మనం ఏం చేస్తే ఓజోన్ పొరను కాపాడగలమో తెలుసుకుందాం.
Use Local items:
మీకు దగ్గర్లో ఉన్న వస్తువులనే వాడండి. చుట్టుపక్కల లభించే వాటినే కొనుక్కోండి. దాని వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. దూరంలో ఉన్న వాటికోసం ఆర్డర్ ఇస్తే రవాణా, డెలివరీ వల్ల వాహనాల నుంచి చాలా కాలుష్యం వస్తుంది. అది ఓజోన్‌కు ప్రమాదకరం. వీలైనంతవరకూ సేంద్రియ ఉత్పత్తులు (organic products) వాడితే ఓజోన్‌ను కాపాడిన వాళ్లం అవుతాం.
Energy-efficient technology:
మనం వాడే చాలా వస్తువులు కాలుష్యాన్ని పెంచుతూ ఉంటాయి. వాటి స్థానంలో కొత్తగా వచ్చే, పర్యవరణ హిత వస్తువులను కొనాలి. తద్వారా చాలా వరకూ కాలుష్యాన్ని తగ్గించగలం. ఏసీల వాడకాన్ని తగ్గించి.. కిటికీలు తెరిస్తే… అది ఓజోన్‌కు మేలు. ఫిలమెంట్ బల్బుల స్థానంలో లెడ్ (LED) బల్బులు వాడాలి. ఇలాంటి చర్యలు ఓజోన్‌కు మేలు చేస్తాయి.
Reduce Chemicals:
మన ఇళ్లు, బాత్‌రూంలు, కిచెన్ వంటి వాటిలో క్లీన్ చేసే ఉత్పత్తుల్లో చాలా వరకూ కృత్రిమ, రసాయనాలతో తయారయ్యేవే. వాటి బదులు పర్యావరణానికి మేలు చేసే, తక్కువ రసాయనాలతో తయారుచేసినవి వాడటం మేలు. HCFCs, CFCs బదులు… ప్రోపేన్, బ్యూటేన్ వంటి హైడ్రోకార్బన్స్‌తో తయారైనవి వాడటం వల్ల ఓజోన్‌ను కాపాడగలం.

Compost:
మన ఇళ్లలో తడి చెత్త, పొడి చెత్త ఉంటుంది. తడి చెత్తను తిరిగి ఎరువుగా మార్చవచ్చు. దాన్ని చెత్త బుట్టలో పారేయకుండా… ఇంటి పెరట్లో ఓ గొయ్యి తవ్వి అందులో వేస్తే… 90 రోజుల్లో అది మొక్కల ఎరువుగా మారుతుంది. ఆ ఎరువుతో మొక్కలు చాలా వేగంగా పెరుగుతాయి. దీని వల్ల మనం పర్యావరణాన్ని కాపాడినట్లు అవుతుంది. మొక్కలకూ సేంద్రియ ఎరువు లభిస్తుంది.
Reduce, recycle, reuse:
పాలిథిన్ కవర్లు, బాటిల్స్, ఫుడ్ ప్యాకేజింగ్, స్ట్రాలు ఇలా ఒకసారి వాడి పారేసే (single use and throw) వాటి వాడకం ఎంత తగ్గిస్తే ఓజోన్‌కు అంత మేలు. షాపింగ్‌కి వెళ్లినప్పుడు జనపనారతో తయారయ్యే బ్యాగులను వెంట తీసుకెళ్తే… పాలిథిన్ కవర్ల వాడకం తగ్గి, పర్యావరణానికి హాని తగ్గుతుంది.. బయటకు వెళ్లినప్పుడు షాపుల్లో మినరల్ వాటర్ బాటిళ్లు కొనే బదులు.. సొంతంగా ఇంటి నుంచి బాటిల్ వాటర్ తీసుకెళ్తే… ప్లాస్టిక్ వాడకం చాలా వరకూ తగ్గుతుంది.
ఓజోన్‌ను మనం కాపాడితే, అది మనల్ని కాపాడుతుంది. ఇది మనందరి బాధ్యత. కలసికట్టుగా కృషి చేస్తేనే ఈ భూమి పది కాలాలపాటూ పచ్చగా ఉంటుంది. ఆ దిశగా మనం చేపట్టే ప్రతి చర్యా, తీసుకునే ప్రతి నిర్ణయమూ సమస్త జీవరాశికీ మేలు చేస్తుంది.

ప్రపంచ ఓజోన్ దినోత్సవం 2023: ప్రతి సంవత్సరం ప్రపంచ ఓజోన్ దినోత్సవం లేదా ఓజోన్ పొర పరిరక్షణ కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 16న జరుపుకుంటారు. ఓజోన్ పొర క్రమంగా క్షీణిస్తోందని, దానిని సంరక్షించేందుకు మనం కొన్ని చర్యలు తీసుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఓజోన్ పొర పరిరక్షణ కోసం అంతర్జాతీయ దినోత్సవం అంటే ఓజోన్ రంధ్రాలు ఏర్పడటం వల్ల ఓజోన్ క్షీణత ఏర్పడుతుందని, ఇది ఓజోన్ క్షీణత పదార్ధాల (ODS) కారణంగా సంభవిస్తుందని సూచిస్తుంది. ఓజోన్ క్షీణించే పదార్ధాలలో కొన్ని క్లోరోఫ్లోరో కార్బన్‌లు (CFCలు), HCFCలు మరియు హాలోన్‌లు ఉన్నాయి. ఓజోన్ పొర భూమి యొక్క స్ట్రాటో ఆవరణలో కనుగొనబడింది మరియు మీడియం-ఫ్రీక్వెన్సీ రేడియేషన్‌లో 97-99% గ్రహించడం ద్వారా సూర్యుని హానికరమైన కిరణాల నుండి భూమిని రక్షిస్తుంది. ఈ కథనంలో, ప్రపంచ ఓజోన్ దినోత్సవం 2023 యొక్క చరిత్ర, ప్రాముఖ్యత మరియు నేపథ్యం గురించి మేము ప్రస్తావించాము.

World Ozone Day 2023: History | ప్రపంచ ఓజోన్ దినోత్సవం 2023: చరిత్ర


World Ozone Day 2023: History ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1994లో సెప్టెంబర్ 16వ తేదీని ఓజోన్ పొరను కాపాడేందుకు ప్రపంచ ఓజోన్ దినోత్సవం లేదా అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. సెప్టెంబర్ 16, 1987న, “ఓజోన్ పొరను క్షీణింపజేసే పదార్థాలపై మాంట్రియల్ ప్రోటోకాల్” 46 దేశాల ప్రభుత్వాలచే సంతకం చేయబడింది. ఈ ప్రత్యేక సంఘటనకు గుర్తుగా సెప్టెంబర్ 16వ తేదీని ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పాటించే రోజుగా ఎంచుకున్నారు. మొట్టమొదటిసారిగా, ఓజోన్ పొరను పరిరక్షణ కోసం అంతర్జాతీయ దినోత్సవం సెప్టెంబర్ 16, 1995 న గుర్తించబడింది.

World Ozone Day 2023: Significance: ఓజోన్ పొర యొక్క ప్రాముఖ్యతను మరియు దానిని క్షీణించకుండా సంరక్షించవలసిన అవసరాన్ని హైలైట్ చేయడానికి ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఓజోన్ పొర క్షీణిస్తున్నట్లు 1970లలో మొదటిసారిగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఉత్తర మరియు దక్షిణ ధ్రువం చుట్టూ ఉన్న ధ్రువ ప్రాంతాలలో ఓజోన్ కవచం సన్నగా మారింది. ఓజోన్ పొర యొక్క ఉనికి హానికరమైన UV రేడియేషన్‌ను తగ్గిస్తుంది, ముఖ్యంగా UV-B వేరియంట్ యొక్క రేడియేషన్ భూమి యొక్క ఉపరితలం చేరకుండా చేస్తుంది. రేడియేషన్ చాలా హానికరం మరియు అనేక ఇతర వ్యాధులతో పాటు సన్‌బర్న్, చర్మ క్యాన్సర్ మరియు కంటిశుక్లాలకు కారణమవుతుంది. మనం కొన్ని కార్యకలాపాలను ఆచరిస్తే ఓజోన్ పొర దాని కనిష్ట స్థాయిలో క్షీణిస్తుంది:

అవసరమైనప్పుడు మాత్రమే ఎయిర్ కండీషనర్‌లను ఉపయోగించండి మరియు క్రమమైన సమయ వ్యవధిలో ACల సరైన నిర్వహణ ఉంటుంది.
కనీస వాహనాలను ఉపయోగించండి మరియు వాటిని భాగస్వామ్యం చేయడానికి ఇష్టపడండి ఎందుకంటే అవి పెద్ద మొత్తంలో గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేస్తాయి, ఇది చివరికి ఓజోన్ క్షీణతకు దారితీస్తుంది.
ఇళ్లలో ఉపయోగించే శుభ్రపరిచే ఉత్పత్తులు పర్యావరణ అనుకూలమైనవిగా ఉండాలి.
పురుగుమందుల వాడకాన్ని నివారించండి ఎందుకంటే అవి ఏదో ఒకవిధంగా వాతావరణంలోకి ప్రవేశించి ఓజోన్ పొరను ప్రభావితం చేస్తాయి.

ఓజోన్ కోసం ఏం చెయ్యాలి :

1.క్లోరో ఫ్లోరో కార్బన్ల వాడకాన్ని నిషేధించాలి. నిషేధం పక్కాగా అమలయ్యేలా చెయ్యాలి.

2. భూతాపాన్ని తగ్గించేందుకు వీలయ్యే అన్ని చర్యలూ చేపట్టాలి.

3. మొక్కలు, చెట్లూ పెంచాలి. అడవుల నరికివేతను అడ్డుకోవాలి.

4. పర్యావరణాన్ని రక్షించే చర్యలు తీసుకోవాలి. చెట్లు నరికే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం బలమైన చట్టాలు తేవాలి.

5. అపార్ట్‌మెంట్లు, షాపింగ్ మాళ్లూ నిర్మించేటప్పుడే… 33 శాతం మొక్కలు, చెట్లు పెంచేందుకు ప్లేస్ ఉండేలా నిబంధనలు తేవాలి.

6. సంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో సోలార్ విద్యుత్ వాడకాన్ని పెంచడం ద్వారా… భూతాపాన్ని తగ్గిస్తూ… ఓజోన్ పొరను కాపాడేందుకు వీలవుతుంది.