dsc-1998-sgts-mts-contract-appointments-proceedings

DSC 1998 పొందిన అభ్యర్థులకు DSC-2008 వారి వలె కాంట్రాక్ట్ పద్దతిలో మినిమం టైం స్కేల్ వేతనంతో SGT లుగా పనిచేసే అవకాశం

కాంట్రాక్ట్ పద్దతిలో మినిమం టైం స్కేల్ వేతనంతో SGT లుగా పని చేయుటకు ఆసక్తితో ఉన్న DSC 1998 అభ్యర్థుల వివరాలను* వెంటనే పంపాలని పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు Memo No: ESEO1-20021/3/2022-RECT-Exams, Dated:23/06/2022 విడుదల.

1998 డీఎస్సీ అభ్యర్థులకు 33వేల వేతనం

మినిమం టైమ్‌ స్కేలు’పై ఉత్తర్వులు..*

అభ్యర్థుల ఆసక్తి కోరిన విద్యాశాఖ

 1998 డీఎస్సీ అభ్యర్థులను కాంట్రాక్టు పద్ధతిలో ఎస్జీటీలుగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. 1998 అభ్యర్థులకు మినిమం టైమ్‌ స్కేలు వర్తింపజేయనున్నట్లు తెలిపింది. అంటే నెలకు రూ.33వేల వేతనం వారికి లభిస్తుంది. వీరిని డీఈవో పూల్‌లో ఉంచి, అవసరమైన చోట్లకు సర్దుబాటు చేయనుంది. కేజీబీవీల్లో ఉపాధ్యాయులుగా, సీఆర్‌పీలుగా, మోడల్‌ స్కూల్స్‌లో గెస్ట్‌ లెక్చరర్లుగా వీరిని వినియోగించుకోనున్నట్లు తెలిపింది. అయితే సుదీర్ఘకాలం తర్వాత వారిని విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించినందున ఎంతమంది ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారో వివరాలు తీసుకోవాలని జిల్లాల అధికారులను ఆదేశించింది. డీఎస్సీ 2008 అభ్యర్థుల తరహాలోనే వీరిని తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Sub: School Education – DSC 1998 Qualified candidates for taking them into service on MTS   basis on par with DSC 2008 qualified teachers- Expression of Interest – Called for-Reg.

The attention of the Commissioner of School Education, is invited to reference cited, wherein he has requested the Government to permit

(i) to call for “Expression of Interest” from the DSC-1998 eligible candidates through a web service for willing to work as teachers in Government schools purely on ad-hoc basis and

(ii) to consider them for appointments as Cluster Resource Persons in the fallen vacancies, Academic instructors in KGBVs, Guest Lecturers in AP Model Schools, teachers in DEO pool for deployment in mapped schools if necessary, and against the existing vacancies.

FOR MORE DETAILS CLICK HERE

District Wise DSC-1998 Lists : జిల్లాల వారీగా డి.ఏస్.సి-1998 లిస్ట్ లు – 1998 DSC చరిత్ర

1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ-1998 నోటిఫికేషన్ జారీచేసింది. ఆ సమయంలో అభ్యర్థుల కటాఫ్ మార్కులకు సంబంధించి.. ఓసీలకు 50, బీసీలకు 45; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించింది. ఆ మేరకు అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు కూడా పిలిచారు. దీనికి సంబంధించి అప్పటి ప్రభుత్వం 221 జీవోను జారీ చేసింది. అయితే కొన్ని విభాగాల్లో కటాఫ్ ఉన్న అభ్యర్థులు లేకపోవడంతో ఓసీలకు 45, బీసీలకు 40; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 35 మార్కులను కటాఫ్‌గా నిర్ణయిస్తూ ప్రభుత్వం మరో జీవో 618 విడుదల చేసింది.

అయితే అదే సమయంలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడంతో కొన్ని జిల్లాల్లో నియామక ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. ఆయా జిల్లాల్లో తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ప్రభుత్వం ఇలా రెండు జీవోలు జారీచేయడంతో.. మొదట 221 జీవో ప్రకారం ఎక్కువ కటాఫ్ మార్కులు ఉన్న అభ్యర్థులందరికీ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత.. 618 జీవో ప్రకారం తక్కువ కటాఫ్ మార్కులు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది.

కాని అధికారుల పొరపాటుతో ఎక్కువ కటాఫ్, తక్కువ కటాఫ్ ఉన్న రెండురకాల అభ్యర్థులను ఒకేసారి ఇంటర్వ్యూలకు పిలిచారు. దీంతో 221 జీవో ప్రకారం ఎక్కువ కటాఫ్ మార్కులు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు లభించలేదు. దీంతో వీరంతా ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. District Wise DSC-1998 Lists : జిల్లాల వారీగా డి.ఏస్.సి-1998 లిస్ట్ లు

పలు దఫాలుగా అభ్యర్థుల వాదనలు విన్న ట్రైబ్యునల్ వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని 2009లో ఆదేశాలు జారీచేసింది. 2011లో హైకోర్టు కూడా త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమర్థించింది. అయితే డీఎస్సీ నియామకాలకు సంబంధించి హైకోర్టు తీర్పు కూడా అమలుకాకపోవడంతో అభ్యర్థులు చివరగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీ-1998 మెరిట్ ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది.

District Wise DSC-1998 Lists : జిల్లాల వారీగా డి.ఏస్.సి-1998 లిస్ట్ లు

PRAKASAM DISTRICT – CLICK HERE TO DOWNLOAD 

GUNTUR DISTRICT – CLICK HERE TO DOWNLOAD 

VIZIANAGARAM DISTRICT- CLICK HERE TO DOWNLOAD

CHITTUR DISTRICT – CLICK HERE TO DOWNLOAD

KURNOOL DISTRICT –  CLICK HERE TO DOWNLOAD

KADAPA DISTRICT – CLICK HERE TO DOWNLOAD

SRIKAKULAM DISTRICT – CLICK HERE TO DOWNLOAD

WESTGODHAVARI DISTRICT –  CLICK HERE TO DOWNLOAD

KRISHNA DISTRICT – CLICK HERE TO DOWNLOAD

Note: పై సమాచారం కేవలం వాట్సప్ మాధ్యమాలలో సర్క్యులేట్ అవుతున్న  వివరాలు మాత్రమే. పూర్తి సమాచారం కోసం CSE వారి అఫిషియల్ వెబ్సైట్ ను వీక్షించ గలరు

error: Don\'t Copy!!!!