ysr-kalyanamasthu-and-ysr-shaadi-tohfa-details

ysr-kalyanamasthu-and-ysr-shaadi-tohfa-details

వైఎస్సార్ కళ్యాణమస్తు | వైఎస్సార్ షాదీ తోఫాᵛᶜ – అర్హతలు, విధి విధానాలు

వైఎస్సార్ కళ్యాణమస్తు షాదీ తోఫాను అక్టోబర్ 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అమలు చేస్తారు. ఆ రోజు నుంచి నవశకం లబ్దిదారుల మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తారు.
– – – – – – – – – – – – – – – – – – – – – –
■ వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి. తొలి వివాహానికి మాత్రమే అర్హత.
– – – – – – – – – – – – – – – – – – – – – –
■ వధువు, వరుడు పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి. (ఈ షరతుకు 2024 జూన్ 30 వరకు సడలింపు ఇస్తారు)
– – – – – – – – – – – – – – – – – – – – – –
■ వరుడు, వధువు ఇద్దరి కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పది వేల రూపాయల్లోపు, పట్టణ ప్రాంతాల్లో 12 వేల రూపాయల్లోపు ఉండాలి.
– – – – – – – – – – – – – – – – – – – – – –
■ మూడు ఎకరాలకు మించి మాగాణి, లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండరాదు. మెట్ట, మాగాణి రెండు కలిపి పది ఎకరాల్లోపు ఉండవచ్చు.
https://t.me/apteachers360
– – – – – – – – – – – – – – – – – – – – – –
■ కుటుంబాల్లో సభ్యులెవ్వరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో, ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగిగా, పెన్షనర్ గా ఉండకూడదు. అయితే పారిశుధ్య కార్మికుల మినహాయింపు ఉంది.
– – – – – – – – – – – – – – – – – – – – – –
■ నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు (ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు)
– – – – – – – – – – – – – – – – – – – – – –
■ నెలవారీ విద్యుత్ వినియోగం (గత 12 నెలల సగటు) 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి.
– – – – – – – – – – – – – – – – – – – – – –
■ ఏ కుటుంబమూ ఆదాయపు పన్ను చెల్లింపుదారు కాకూడదు.
– – – – – – – – – – – – – – – – – – – – – –
■ మునిసిపల్ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మించిన ఆస్తిని కలిగి ఉండకూడదు.
– – – – – – – – – – – – – – – – – – – – – –
■ ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకం నిర్వహణ ఉంటుంది.

FOR MORE DETAILS G.O.NO.47 CLICK HERE PDF

YSR Kalyana Masthu, YSR Shaadi Thofa ప్రశ్నల – సమాదానాలు

1). YSR Kalyana Masthu, YSR Shaadi Thofa ఎలా అప్లికేషన్ చేయాలి ?

Ans: గ్రామ వార్డు సచివాలయం లో అప్లికేషన్ చేసుకోవాలి.
– – – – – – – – – – – – – – – – – – – – – –
2). ఏ రోజు నుంచి పెళ్లి అయిన వారు YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు అర్హులు ?

Ans : తేదీ 01 అక్టోబర్ 2022 నుంచి ఆన్లైన్ అవకాశం ఉంది. ఎప్పటి నుంచి పెళ్లి అయిన వారు అని ఇంకా Operational Guidlines రాలేదు.
– – – – – – – – – – – – – – – – – – – – – –
3) YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు వరుడు, వధువుకు ఎంత వయసు ఉండాలి ?

Ans : వరుడుకు 21 సంవత్సరాలు. వధువు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
– – – – – – – – – – – – – – – – – – – – – –
4). ఒక కుటుంబం లో ఇద్దరు మహిళలు ఉండి ఒకరికి YSR Kalyana Masthu, YSR Shaadi Thofa వస్తే రెండో మహిళకు కూడా వస్తాయా ?

Ans: రెండో మహిళకు రావు.
– – – – – – – – – – – – – – – – – – – – – –
5). వదువు వరుడులకు YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు విద్యా అర్హతలు ఉండాలా?

Ans : 2024 జూన్ 30 వరకు పెళ్లి అయ్యే వదువు వరుడులకు ఎటువంటి విద్యా అర్హత అవసరం లేదు. తరువాత కనీసం 10వ తరగతి చదివి ఉండాలి.
https://t.me/apteachers360
– – – – – – – – – – – – – – – – – – – – – –
6). YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు దరఖాస్తు చెయ్యాలి అంటే కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరమా ?

Ans : అవును. అవసరము. ముందుగా సచివాలయం లో దరఖాస్తు చేసుకొని ఉండవలెను.
– – – – – – – – – – – – – – – – – – – – – –
7). YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు దరఖాస్తు చేయు సమయం లో ఆధార్ అప్డేట్ హిస్టరీ అవసరమా ?

Ans ; అవసరం అయ్యే అవకాశం ఉంది. ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ ఉంటే తెలుస్తుంది.. కావున వధువు వరుడు ఆధార్ నెంబర్ కు మొబైల్ నెంబర్ పెళ్ళికి ముందే లింక్ చేసుకోవాలి.
[ *ఆధార్ హిస్టరీ లింక్* : http://bit.ly/2ZQxMR4 ]
– – – – – – – – – – – – – – – – – – – – – –
8). YSR Kalyana Masthu, YSR Shaadi Thofa దరఖాస్తు కు ముందుగా సచివాలయం ను సందర్శించాల ?

Ans : సచివాలయం ను సందర్శించి ముందుగా వధువు వరుడు ఆధార్ నెంబర్ తో NBM పోర్టల్ లో Eligibility Criteria చెక్ చేసుకోవాలి. అన్ని సరిగా ఉంటే ఎటువంటి సమస్య ఉండదు.
– – – – – – – – – – – – – – – – – – – – – –
9).. YSR Kalyana Masthu, YSR Shaadi Thofa నగదు ఏ బ్యాంకు ఖాతా లో జమ అవుతాయి ?

Ans : లబ్ధిదారుని ఆధార్ కు NPCI లింక్ అయిన బ్యాంకు ఖాతా లో మాత్రమే జమ అవుతుంది. మిగతా ఏ బ్యాంకు ఖాతా లో జమ అవ్వదు
[ *NPCI లింక్* – http://bit.ly/2ZNNSL8 ]
– – – – – – – – – – – – – – – – – – – – – –
10). YSR Kalyana Masthu, YSR Shaadi Thofa కు వధువు ఆంధ్ర ప్రదేశ్ కాకుండా వేరే రాష్ట్రము వారు అయితే అర్హుల ?

Ans : అర్హులు అవ్వరు.