WhatsApp-is-your-group-invite-link-leaked-complete-details

WhatsApp-is-your-group-invite-link-leaked-complete-details

WhatsApp: మీ గ్రూప్‌ ఇన్వైట్‌ లింక్‌ లీకైందా?*

 వాట్సాప్‌లో గ్రూపులు క్రియేట్‌ చేయడం సులువు. మనకు నచ్చిన వారిని చేర్చొచ్చు. లేదంటే ఇన్వైట్‌ లింక్‌ ద్వారా గ్రూప్‌లోకి ఆహ్వానించొచ్చు.

అలా కొన్నిసార్లు మనం పంపే ఇన్వైట్‌ లింక్‌ మనకు పరిచయం లేని వ్యక్తులకు కూడా చేరిపోతుంటుంది. దీంతో గుర్తు తెలీని వ్యక్తులు మన గ్రూపుల్లో చేరిపోతుంటారు.

దీనివల్ల గ్రూప్ ప్రైవసీకి భంగం కలగడమే కాకుండా అడ్మిన్‌కు కొత్త చికాకులు ఎదురవుతాయి.

 ️గ్రూప్‌లో చేరే వారిని ఆపుదామంటే అప్పటికే ఇన్వైట్ లింక్ ఇతరులకు షేర్‌ అయిపోయి ఉంటుంది. అలా అని గ్రూప్‌ను సస్పెండ్ చేయలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు గ్రూప్‌లో కొత్తవారు చేరకుండా నియంత్రించేందుకు వాట్సాప్‌లో ఓ ఫీచర్ అందుబాటులో ఉంది. అదే రీసెట్ లింక్ ఆప్షన్‌. దీన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

️గ్రూప్ ఇన్వైట్ లింక్‌ని రీసెట్ చేసేందుకు కేవలం గ్రూప్ అడ్మిన్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. 

️ముందుగా మీరు అడ్మిన్‌గా ఉన్న గ్రూప్‌ ఓపెన్ చేసి అందులో గ్రూప్ ఇన్ఫోపై క్లిక్ చేయాలి. తర్వాత ఇన్వైట్ టు గ్రూప్ వయా లింక్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే అందులో రీసెట్ లింక్‌ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీ పాత లింక్‌కి బదులు కొత్త లింక్‌ క్రియేట్ అవుతుంది. 

️దాంతో పాత లింక్‌తో కొత్త వారెవరూ గ్రూప్‌లో చేరలేరు.

ఒకవేళ కొత్తగా ఎవరినైనా గ్రూప్‌లోకి ఆహ్వానించాలంటే కొత్త లింక్ వారికి షేర్ చేస్తే సరిపోతుంది. లింక్‌తో కాకుండా యాడ్‌ పార్టిస్‌పెంట్ ద్వారా కూడా గ్రూప్‌లో కొత్త వారిని చేర్చుకోవడం ఎప్పటికీ ఉత్తమం.