what-is-5G-technology-details
5G అంటే ఏంటి? ఈ టెక్నాలజీతో ఇంటర్నెట్ ప్లాన్ ధరలు పెరుగుతాయా? 5Gతో వచ్చే మార్పులు
5G స్పెక్ట్రమ్ వేలం నిర్వహించడానికి ప్రభుత్వం (Government) పచ్చజెండా ఊపింది. దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో 5G నెట్‌వర్క్ (Mobile Network) అంటే ఏంటి? దాని ప్రయోజనాలు ఏంటి? తదితర అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
5G అంటే ఏంటి?
5జీ నెట్‌వర్క్ కస్టమర్‌లకు అల్ట్రా ఫాస్ట్ ఇంటర్నెట్, మల్టీమీడియా సర్వీసెస్ అందించడానికి అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తోంది. 5జీ నెట్‌వర్క్ ఒక మిల్లీసెకన్ లేటెన్సీని అందిస్తుంది. అంటే ఒక మిల్లీసెకనులో డేటా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇది 4జీ కంటే 50 రెట్లు వేగవంతమైనదని చెప్పవచ్చు. 5జీ ఫోన్ల బ్యాటరీ లైఫ్ కూడా పెంచుతుందని తేలింది. 5జీ డౌన్‌లోడ్ స్పీడ్‌తో ఎలక్ట్రానిక్ పరికరాలను ఒకదానికొకటి కమ్యూనికేట్ చేయడం సులభతరం అవుతుంది. రిమోట్‌గా ఎలక్ట్రానిక్ వస్తువులను కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ మరింత మెరుగు పడుతుంది. భవిష్యత్తులో 5జీ వల్ల స్మార్ట్ సిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, రోబోటిక్ సర్జరీ వంటి కొత్త టెక్నాలజీ ప్రాధాన్యత పెరుగుతుంది. 5జీ దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్, కెనడాతో సహా అనేక ప్రదేశాలలో అందుబాటులోకి వచ్చింది.
భారతదేశంలో ఏ 5G బ్యాండ్ ఉపయోగిస్తారు?
ప్రస్తుత 4G సేవల ద్వారా సాధ్యమయ్యే దానికంటే దాదాపు 10 రెట్లు అధికంగా ఉండే వేగం, సామర్థ్యాలను అందించగల 5G టెక్నాలజీ బేస్డ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు మిడ్, హై బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను ఉపయోగించుకోవచ్చని భావిస్తున్నారు.
4G, 5G మధ్య తేడా ఏంటి?
