union-budget-2023-highlights

union-budget-2023-highlights

ప్రస్తుతం బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 2023 -24 ఉన్న ఆదాయపు పన్ను వివరాలు
ప్రస్తుతం ఉన్న ఐదు లక్షల వరకు ఉన్న ఆదాయపరిమితిని 7 లక్షల పెంచారు.
 వచ్చిన ఆదాయంలో ఇంటి అద్దె లోను (₹.2,00, 000) స్టాండర్డ్ డైడక్షన్ (₹.1,50,000 )అన్ని ఫోను అంటే 7 లక్షలు లక్షలు దాటితే 
3 లక్ష వరకు  Nil
3 నుండి 6 లక్షల వరకు 5%
 6 నుండి 9 లక్షల వరకు 10% శాతం
 9 నుండి 12 లక్షల వరకు 15%
12 లక్షల నుండి 15 లక్షల వరకు 20శాతం
15 లక్షల పైన 30%

Budget Highlights పన్నుల్లో వాటా కింద ఏపీకి రూ. 41,338 కోట్లు

కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కారు 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం చేస్తూ.. అమృత కాలంలో తొలి బడ్జెట్ ఇదని ఆమె అన్నారు. గత బడ్జెట్‌లో వేసిన పునాదిలపై నిర్మాణానికి ఇది సహకరిస్తుందని భావిస్తున్నామని అన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నామని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఉన్నతే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించామని అన్నారు.

నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముఖ్యాంశాలు:

తొమ్మిదేళ్లలో దేశంలో తలసరి ఆదాయం రెట్టింపయ్యిందని, ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ నిలిచిందన్నారు. కోవిడ్ సమయంలో ఎవరూ ఆకలితో బాధపడకుండా చూశామన్నారు. అనేక రంగాల్లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించామని అన్నారు. సామాజిక భద్రత, డిజిటల్ పేమెంట్స్‌లో పురోగతి సాధించామని అన్నాారు.

⍟ ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగుతోంది. వంద కోట్ల మందికి 220 కోట్ల టీకా డోస్‌లను పంపిణీ చేశాం.. 2047 లక్ష్యంగా దిశగా ప్రభుత్వ పథకాలు..

ఆదాయపు పన్నులో ఐదు స్లాబ్‌లను కొనసాగుతుంది. వేతన జీవులకు ఊరటనిచ్చేలా మినహాయింపులతో కలుపుకుని రూ.7 లక్షలోపు ఆదాయం ఉన్న వారికి ఎటువంటి పన్ను విధించలేదు. అయితే, ఇది కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకున్నవారికి మాత్రమే వర్తిస్తుంది.

⍟ రూ.3 నుంచి రూ.6 లక్షల వరకూ 5 శాతం, రూ.6 నుంచి రూ. 9 లక్షల వరకూ 10 శాతం, 9 లక్షల నుంచి 12 లక్షల వరకూ 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ 20 శాతం విధించారు.

⍟ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం సిగరెట్లు, బంగారం, వెండి, వజ్రాల ధరలు పెరగనుండగా.. టీవీలు, మొబైల్స్, కెమెరాల ధరలు తగ్గనున్నాయి.

⍟ కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ.41,338 కోట్లు, తెలంగాణ వాటా రూ.21,437 కోట్లు.

⍟ విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.683 కోట్లు, పెట్రోలియం యూనివర్సిటీకి రూ.167 కోట్లు కేటాయింపు.

⍟ వ్యవసాయ స్టార్టప్‌లకు మద్దతుగా అగ్రికల్చరల్ యాక్సిలరేటర్ ఫండ్‌ను ఏర్పాటు

⍟ బడ్జెట్‌లోమూలధన వ్యయం 33 శాతం పెంపు

⍟ దేశీయ, విదేశీ పర్యాటకులకు అపారంగా ఆకర్షణఖఉ టూరిజంలో పెద్ద ఎత్తున అవకాశం ఉంది. ఈ రంగంలో ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు, వ్యవస్థాపకత కోసం భారీ అవకాశాలను కలిగి ఉందన్నారు.

⍟ వచ్చే మూడేళ్లలో ఏకలవ్య మోడల్ స్కూల్‌లో 38,800 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు

⍟ దేశంలోని నాలుగు ప్రాంతాల్లో 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు

⍟ ప్రధాన మంత్రి అజాజ్ యోజనకు 66 శాతం నిధులు పెంపుదల

⍟ దేశంలో ఎయిర్ కనెక్టివిటీ కోసం కొత్తగా 50 విమానాశ్రయాలు, ఏరో డ్రోమ్‌లు నిర్మాణం

⍟ రూ.20 లక్షల కోట్లతో వ్యవసాయ రుణాలు.. ఆత్మ నిర్బర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ ప్రారంభం. దేశంలోని 63 వేల వ్యవసాయ పరపతి సంఘాలు డిజిటలైజేషన్.

⍟ శ్రీ అన్న పథకం ద్వారా చిరు ధాన్యాల రైతులకు ప్రోత్సాహం.. మత్స్య రంగానికి రూ.6 వేల కోట్లు కేటాయింపు

⍟ రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు మరో ఏడాది పాటు పొడిగింపు. ఇందుకోసం రూ.13.7 లక్షల కోట్లు కేటాయింపు.

⍟ రైల్వేలకు రూ.2.4 లక్షల కోట్లు కేటాయింపు. 2013్-14తో పోల్చితే 9 శాతం పెరిగిన నిధులు

⍟ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.75 వేల కోట్లు కేటాయింపు.

⍟ బడ్జెట్‌లో మూలధన వ్యయానికి రూ.10 లక్షల కోట్లు కేటాయింపు.

⍟ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి రూ.79 వేల కోట్లు

⍟ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. అమృతకాలంలో ప్రవేశపెట్టి మొదటి బడ్జెట్.. అభివృద్ధి భారత్ కలను నెరవేర్చడానికి సహకరిస్తుందని అన్నారు. దేశాభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని మోదీ చెప్పారు. పూర్తి కథనం

⍟ డేటా లభ్యతను మరింత సులభతరం చేసేందుకు కొత్తగా జాతీయ డేటా గవర్నెన్స్ విధానం

⍟ ‘మేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఇండియా’, ‘మేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ ఫర్ ఇండియా’ కోసం మూడు కృత్రిమ మేధస్సు కేంద్రాలు ఏర్పాటు

⍟ మరింత సరళీకృతం కానున్న కేవైసీ ప్రక్రియ. డిజిటల్ ఇండియాకు అనుగుణంగా ఒన్‌ స్టాప్ కేవైసీ

⍟ దేశంలోని నగరాల్లో100 కీలకమైన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అమలు. ఇందుకోసం రూ.75 వేల కోట్లు

⍟ 5 జీ సేవల కోసం ప్రత్యేకంగా 100 ల్యాబొరేటరీలు ఏర్పాటు

⍟ వచ్చే మూడేళ్లలో కోటి మంది రైతులను సెంద్రీయ వ్యవసాయానికి మళ్లించాలని లక్ష్యం

⍟ 2030 నాటికి 5 MMT గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని చేరుకోవడమే లక్ష్యం.. సున్నా లక్ష్యం, ఇంధన పరివర్తన సాధించడానికి రూ. 35,000 కోట్లు కేటాయింపు.

⍟ ఎస్టీల సంక్షేమానికి రూ.15 వేల కోట్లు కేటాయింపు.

⍟ ఎంఎస్ఎంఈలు, పెద్ద సంస్థల కోసం డిజిలాకర్ వ్యవస్థ ఏర్పాటు

⍟ ల్యాబ్‌లో తయారైన వజ్రాలపై కస్టమ్స్ సుంకం తగ్గింపు

⍟ దేశవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రమాణాలతో 30 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు

⍟ పట్టణ మౌలిక వసతుల కోసం రూ.10 వేల కోట్ల కేటాయింపు.

⍟ చిన్నారులు, యువత కోసం జాతీయ స్థాయిలో డిజిటల్ లైబ్రరీ

⍟ ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ కోసం మిషన్ కర్మయోగి

⍟ ప్రభుత్వ, ప్రయివేట్ పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక విభాగం

⍟ నీతి ఆయోగ్‌ మరో మూడేళ్లు పొడిగింపు

⍟ రైతుల కోసం 10వేల బయో ఇన్‌పుట్‌ రిసోర్స్‌ కేంద్రాలు ఏర్పాటు.

⍟ లడఖ్‌లో 13 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం రూ.20,700 కోట్లు కేటాయింపు

⍟ కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి, కొనుగోలు చేయాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. బడ్జెట్‌లో (Budget 2023) భాగంగా పీఎం ఆవాస్ యోజన పథకానికి ఈ సారి భారీగా నిధులను పెంచుతున్నట్లు ప్రకటించింది.

⍟ తీర ప్రాంతాల్లో మడ అడవులు పెంపకానికి మిస్టీ పేరుతో కొత్త పథకం


⍟ జీడీపీలో ద్రవ్యలోటు 5.9 శాతంగా ఉండే అవకాశం. 2025-26 నాటికి 4.5 శాతానికి పరిమితం చేయాలనేది లక్ష్యం

⍟ సీనియర్ సిటిజన్స్ డిపాజిట్ పరిమితి రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంపు

⍟ మహిళలు, బాలికలు కోసం సమ్మాన్ బచిత్ పత్ర పథకం. 2025 వరకూ అమలు.

⍟ కర్ణాటకలోని కోస్తా తీరంలో సాగు కోసం ప్రత్యేకంగా రూ.5,300 కోట్లు కేటాయింపు

⍟ టీవీలు, మొబైల్స్, కెమెరాల విడి భాగాల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు.

⍟ ఎన్నో అంచనాల నడుమ వార్షిక బడ్జెట్‌ను (Union Budget 2023) ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు గుడ్‌న్యూస్ చెప్పింది. వడ్డీ లేని రుణాల పథకం మరో ఏడాది పాటు పొడగిస్తున్నట్లు చెప్పారు.

⍟ రాంసార్ చిత్తడి నేలలు, సరస్సుల అభివృద్ధికి ప్రత్యేక పథకం. ఈ ప్రాంతాల్లోని స్థానికులకు టూరిజం,
ఉపాధిలో ప్రాధాన్యత.

⍟ కొత్త సహకార సంఘాలకు 15% పన్ను తగ్గింపు

⍟ వేతన జీవులకు ఊరటనిస్తూ ఆదాయపు పన్ను పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. రూ.7 లక్షల వరకూ ఎటువంటి పన్ను లేదు.

⍟ దేశంలోని 22 ఎయిమ్స్‌లకు రూ.6,835 కోట్లు, మణుగూరు, కోట భార జలకేంద్రాలకు రూ.1,473 కోట్లు కేటాయింపు.

⍟ పార్లమెంట్‌లో వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించిన వార్షిక బడ్జెట్ 2023-24 ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న కర్ణాటక రాష్ట్రంపై వరాల జల్లు కురిపించారు

Pan Card: ఈసారి కేంద్ర బడ్జెట్‌లో పాన్ కార్డు హోల్డర్లపై (Pan Card Holders) కీలక ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దీని గురించి తప్పక తెలుసుకోవాలి. పాన్ కార్డును సింగిల్ బిజినెస్ ఐడీగా (Pan Card Single Business ID) చట్టబద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో.. వ్యాపార అనుమతులు, వ్యాపార కార్యకలాపాల నిబంధనలను సడలించారు. వ్యాపార సంస్థలు ఇకపై 10కి పైగా గుర్తింపు కార్డులను ఉపయోగించాల్సిన పరిస్థితి ఉండదు. దీంతో పెద్ద విముక్తి లభించినట్లయింది.

వ్యాపారాలను మరింత సులువు చేసేందుకు.. కేంద్రం బడ్జెట్‌లో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక వ్యాపార గుర్తింపు కార్డుగా (Budget Pan Card) పాన్ కార్డు ఒక్కటుంటే చాలు.

దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను కూడా మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. నిబంధనల్లో మరోసారి వెసులుబాటు కల్పించింది. వ్యాపార సంస్థలు 10కిపైగా ఐడీ కార్డులు ఉండాల్సిన పరిస్థితి నుంచి విముక్తి కల్పించింది. దీంతో వారికి పెద్ద ఊరట కలిగినట్లయింది. గత డిసెంబర్‌లో ప్రవేశపెట్టిన జన్ విశ్వాస్ బిల్లుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. వ్యాపారాలకు సంబంధించి దాదాపు 3900 నిబంధనలను తొలగిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

error: Content is protected !!
Scroll to Top