Salary-details-for-grama-ward-sachivalayam-employees-after-probation-period

Salary-details-for-grama-ward-sachivalayam-employees-after-probation-period

 ప్రొబెషన్ పరీక్ష. 75  మార్కులకు రాత పరీక్ష.

25 మార్కులకు ప్రాజెక్ట్ వర్క్.

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు ప్రొబెషన్ పరీక్షల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జాబ్ చార్టుకు సంబంధించి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల విధానంతో రాత పరీక్ష 75 మార్కులకు, ప్రాజెక్టు వర్క్ 25 మార్కులకు ఉంటుంది. ఆ పరీ క్షలో ఉత్తీర్ణులైన తరువాతే మహిళా పోలీసులు ప్రొబెషన్ పూర్తవుతుంది. ఆ పరీక్షలో ఉత్తీర్ణులు కానివారి ప్రొబెషన్ సర్వీసును మరో ఏడాదిపాటు పొడిగించే అవకాశం ఉంటుంది. అప్పటికి కూడా ప్రాబెషన్ పరీక్షలో ఉత్తీ ర్ణులు కాకపోతే వారిని సర్వీసు నుంచి తొలగిస్తారు.

రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికి అన్ని జిల్లా కలెక్టర్స్ కు ఉత్తర్వులు విడుదల, 2సంవత్సరాల సర్వీస్ సంతృప్తికరంగా పూర్తి చేసుకున్న వారికి రెగులర్ స్కేల్ చెల్లింపు ఇవ్వడం జరుగుతుంది.

గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు అక్టోబర్ నుండి ప్రొబేషన్ డిక్లేర్ ఐన తరువాత వచ్చే వేతనం, మినహాయింపులు, నెట్ సాలరీ పూర్తి వివరాలు ఒకే క్లిక్ లో కింది లింక్ లో తెలుసుకోవచ్చు

https://net.apteachers.in/gsws/pay.php

సర్వీసు రూల్స్‌ ప్రకారమే గ్రేడ్‌-2 వీఆర్‌ఓల ప్రొబేషన్‌

గ్రేడ్‌-2 గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌ఓ) ప్రొబేషన్‌ను ఇప్పుడున్న సర్వీసు రూల్స్‌ ప్రకారమే ప్రకటించాలని రెవెన్యూశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌కు ఉత్తర్వులు ఇచ్చారు. 2019లో సవరించిన 2008 వీఆర్‌ఓ సర్వీసు రూల్స్‌ను మార్చాల్సిన అవసరం లేదని, అవి రెండు కేటగిరీలకు సరిపోతాయని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి వి.ఉషారాణి స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 2008 వీఆర్‌ఓ సర్వీసు రూల్స్‌ (సవరించిన) ప్రకారమే గ్రేడ్‌-2 వీఆర్‌ఓల ప్రొబేషన్‌ను డిక్లేర్‌ చేయాలని సీసీఎల్‌కు లేఖ రాశారు. ఈ మేరకు విలేజ్‌వార్డు సెక్రటేరియట్‌ విభాగానికి తెలియజేయాలని లేఖలో పేర్కొన్నారు.