Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana-Rs.330-complete-details

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana-Rs.330-complete-details

PMJJBY: సామాన్యులకు వరం.. మరింత చౌకగా జీవన్‌జ్యోతి బీమా స్కీం.. వివరాలు

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana:

ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన (PMJJBY) పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఇతర జీవిత బీమా సంస్థలు అందిస్తున్నాయి. ఈ బీమా ప్రయోజనం అందించడం కోసం బీమా సంస్థలు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. దేశ పౌరులందరికీ జీవిత బీమా ఉండాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. 2015 మే 9న ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనను ప్రారంభించారు.

ఇది ఒక సంవత్సరంపాటు రూ.2లక్షల జీవిత బీమాను అందిస్తుంది. ఈ బీమా తీసుకొన్న వ్యక్తి ఒకవేళ మరణించినట్లయితే.. నామినీకి (వారి కుటుంబానికి) పూర్తి కవరేజీని అందిస్తారు.

ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన కోసం దరఖాస్తు చేసుకోవడానికి వినియోగదారులు రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను నెట్‌ నుంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే బ్యాంకుల్లో తీసుకోవచ్చు. పేరు, సేవింగ్ బ్యాంక్ ఖాతా నంబర్, ఈ మెయిల్ ఐడి, చిరునామా మొదలైన వివరాలతో ఫాం నింపాల్సి ఉంటుంది.

అర్హత..

ఈ ప‌థ‌కంలో చేర‌డానికి 18-50 మ‌ధ్య వ‌య‌స్కులు అర్హులు.

సంవత్సరానికి రూ.330 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతా ఉన్న ఏ వినియోగ‌దారుడైనా ఈ ప‌థకంలో లబ్ధిదారుడిగా చేర‌వ‌చ్చు. ఏడాదికి ఒక‌సారి ఏక‌ మొత్తంలో రూ.330 ప్రీమియం చెల్లించాలి. వారికి రూ.2లక్షల బీమా సదుపాయం ఉంటుంది. అయితే అంతకుముందు ప్రధాని జీవన్ జ్యోతి బీమా యోజన నుంచి వైదొలిగిన వ్యక్తి కూడా మళ్లీ ఈ పథకంలో చేరవచ్చు.
క‌వ‌రేజీ..


ప్రతీ ఏడాది క‌వ‌రేజీ జూన్ 1 నుంచి మే 31 వ‌ర‌కూ వ‌ర్తిస్తుంది. ఇందుకోసం ఏటా రూ.330తో పాల‌సీ రెన్యువ‌ల్ చేస్తారు. దీనికోసం లబ్ధిదారులు బ్యాంకులో ఫాంను సమర్పించాల్సి ఉంటుంది. కావున ప్రతీ ఏడాది ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు..

బ్యాంకులో ఖాతా తప్పనిసరిగా ఉండాలి
ఒక బ్యాంకు ఖాతాతో, ఒక బీమా కంపెనీ ద్వారానే ఈ ప‌థకంలో చేర‌డానికి వీలుంటుంది.
వినియోదారుడికి 50 ఏళ్ల వయసు దాటితే పాల‌సీ ముగుస్తుంది.
పాలసీదారుడు మరణించినప్పుడు మాత్రమే నామినీకి బీమా రూ.2లక్షల నగదు అందుతుంది. దీనికోసం ఖాతా ఉన్న బ్యాంకులో సమాచారం అందించాలి.

సురక్ష భీమా యోజన పథకంలో చేరిన వారికి రూ. 2 లక్షల వరకు ప్రమాద భీమ లభిస్తుంది 18 నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్నవారు ఈ పథకంలో చేరవచ్చు. COMPLETE DETAILS CLICK HERE