MDM-IMMS-app-precausions-for-taking-images

IMMS APP లో జగనన్న గోరుముద్ద – ఇన్స్పెక్షన్ లో ఇమేజస్ అప్లోడ్ చేయడం లో కొన్ని సూచనలు

 ప్రధానోపాధ్యాయులు కు తెలియజేయునది ఏమనగా ఇదివరకే జగనన్న గోరుముద్ద ఇన్స్పెక్షన్ లో భాగంగా ఫోటోలు తీయడం లోను అప్లోడ్ చేయడం లోను సూచనలు ఇవ్వడం జరిగింది. కానీ అనుకున్న ఫలితాలు రావడం లేదు.

కావున ఉత్తమ ఫలితాలు సాదించుటకు ఈ క్రింది సూచనలు పాటించవలసినదిగా ప్రధానోపాధ్యాయులు ను కోరడమైనది.*

1. ఫోటోలు తీసే సమయంలో ఫుడ్ మొత్తం కవర్ అయ్యేటట్టు చేసుకోవలెను.

2. ఫోటోలు తీసే సమయంలో మన యొక్క చేతులు కాళ్ళు భాగాలు పడకుండా జాగ్రత్త పడవలెను.

3. మెనూ మొత్తం తీసే సమయంలో అప్పుడే వండిన పదార్థాలును ప్లేట్ లో కాకుండా వండిన వంట పాత్రలోనే ఉండగా ఫోటో తీసి అప్లోడ్ చేయవలెను.

4. అన్ని ఐటమ్స్ ఫోటో తీసినప్పుడు పాత్రలు నిండుగా ఉన్నప్పుడు మాత్రమే తీయవలెను.

5. ఐటమ్ వారీగా ఫోటో తీసేటప్పుడు కూడా వండిన వంట పాత్ర లో ఉంచి తీయవలెను.

6. ఉడికించిన గ్రుడ్లు అన్ని ఒక పాత్ర లో పెట్టి ఫోటో తీయవలెను మరియు , చిక్కి లను ప్యాకింగ్ నుండి తీసి బల్క్ గా ఒక పెద్ద పాత్రలో పెట్టి మొత్తంగా ఫోటో తీయవలెను.

7. ముఖ్యంగా కొంతమంది ప్రధానోపాధ్యాయులు ఫోటోలకు ఫోటో తీసి పెడుతున్నారు అలా చేయకూడదు.

8. ఇక నుండి అన్ని పాఠశాలలు కు సంబంధించి ఇమేజస్ *AI టెక్నాలజీ* ద్వార వెరిఫై చేసి ఫుడ్ క్వాలిటీ చెక్ చేయడం జరుగుతుంది. కావున ఫుడ్ క్వాలిటీ విషయంలోను ఇమేజస్ తీయడంలోను జాగ్రత్తలు తీసుకోవాలి.

పై సూచనలను జగనన్న గోరుముద్ద ఇన్స్పెక్షన్ చేసే సమయంలో అందరు ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా పాటించడం వలన ఇన్స్పెక్షన్ విషయంలో ఉత్తమ ఫలితాలు పొందగలమని తెలియజేయడమైనది.

From

The Director,
MDM&SS.

IMMS MDM MOBILE APP UPDATED VERSION CLICK HERE LINK

IMMS USER MANUAL RELEASED BY TCS