is-it-safe-raw-eggs

is-it-safe-raw-eggs

గుడ్డులోని పచ్చ సొన తింటే మంచిది కాదా..

మానవుని ఆహారంలో గుడ్డు చాలా ఏళ్ళ నుంచి అంతర్భాగంగా ఉంది. అంతే కాదు దీన్ని సంపూర్ణ పోషకాహారంగా పేర్కొన్నారు. కేవలం గుడ్డులోని తెల్ల సొన మాత్రమే తినాలని మొత్తం గుడ్డు తినడం వల్ల కొవ్వు పెరుగుతుందని అనే వారు అనేకమందే ఉన్నారు. అందుకు కారణం పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉండడమే. అయితే తెల్లగుడ్డు నిస్పందేహంగా మంచిదే. అయితే రోజుకు ఒక్క పచ్చసొన అయినా తినాలి అంటారు ఆరోగ్య నిపుణులు.

గుడ్డులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు కొంతమంది తమను తమూ ఎగ్ టేరియన్స్‌గా చెప్పకుంటుంటారు. అందుకు కారణం వారు మాంసాహారం తీసుకోకపోయినా గుడ్డులో అధిక పోషకాలు ఉన్నందువల్ల, గుడ్డును తినడానికి ఎక్కువగా ఇష్టపడటం వల్ల ఎగ్‌టేరియన్లుగా ఫిక్స్ అయిపోతారు.

ఎగ్ వైట్‌లో ఆరోగ్యప్రయోజనాలు:

* ఎగ్ వైట్‌లో పుష్కలమైన అల్బుమిన్ ఉంది. ఇది ప్రోటీనులకు ఒక అద్భుతమైన మూలం. కండరాలను బలోపేతం చేసుకోవడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది.
* గుడ్డులోని పచ్చసొన కాకుండా ఎగ్ వైట్‌లో కొలెస్ట్రాల్ ఉండదు . కాబట్టి, మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే మీ రెగ్యులర్ డైట్‌లో ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్‌ను తప్పక చేర్చుకోవాలి.
* ఎగ్ వైట్‌లో ఫ్యాటీ యాసిడ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. మరియు చాలా తక్కవ క్యాలరీలను కలిగి ఉన్నది. అందుకే ఇది బెస్ట్‌లోకాలరీ బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకోవచ్చు.
* ఎగ్ వైట్ వల్ల మహిళలకు అవసరం అయ్యే కాల్షియం వీటి నుండి పుష్కలంగా అందుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఎముకల ఆరోగ్యానికి మరియు ఓస్టియోపొరోసిస్‌ను దూరంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది.
* పురుషుల్లో మేల్ హార్మోన్ టెస్టో‌స్టిరోన్ ఉత్పత్తికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది. అందువల్లే పురుషులు ఎగ్ వైట్‌ను ఎక్కువగా తీసుకోవాలి.
* విటమిన్ బి12 ఆరోగ్యకరమైన నాడీ సంరక్షణ కొరకు విటమిన్ బి12 అద్భుతంగా సహాయపడుతుంది. ముఖ్యంగా విటమిన్ బి12 పొందడానికి ఎగ్ వైట్ అద్భుతంగా సహాయపడుతుంది.
* ఎగ్ వైట్‌లో పుష్కలంగా ఐరన్ ఉంటుందని చాలా మందికి తెలియదు . ఇది రెడ్ బ్లడ్ సెల్స్‌ను ఉత్పత్తి చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది .
* ఎగ్ వైట్‌లో ట్రేస్ మినరల్స్ మెగ్నీషియం మరియు ఫాస్పరస్‌లు కలిగి ఉన్నాయి. ఈ మినరల్స్ చర్మం అందానికి మరియు కంటి ఆరోగ్యానికి చాలా అవసరం అవుతాయి.

గుడ్డు పచ్చ సొన ఉపయోగాలు:

* మానవుని ఆహారంలో చాలా ఏళ్ల నుంచి గుడ్డు అంతర్భాగంగా ఉంది. అంతే కాదు దీన్ని సంపూర్ణ పోషకాహారంగా పేర్కొన్నారు. వేలకొద్ది పోషక ప్రయోజనాలు లభిస్తాయి. కాబట్టి దీన్ని భూమిపైనే అత్యంత విలువైన ఆహారంగా చెబుతారు. అయితే గుడ్డులోని పచ్చసొన తింటే రక్తంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయని కొంత మంది భావిస్తారు.

* అయితే అది కేవలం అపోహ మాత్రమే. అందులో ఏ మాత్రం నిజం లేదు. గుడ్డులో అధిక మొత్తంలో కొవ్వు కలిగి ఉన్నప్పటికీ దీని ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మాత్రం పెరగవని ఓ పరిశోధనలో తేలింది. ఒకవేళ టైప్-2 మధుమేహం, ఊబకాయం లాంటి సమస్యలుంటే తప్ప దీని వల్ల ఎలాంటి ముప్పు లేదని పరిశోధకులు.

* గుడ్డులోని ఐరన్‌ని శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఐరన్‌ గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడుతుంది. మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా కాపాడుతుంది. జట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. గుడ్డులో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి సాయపడతుంది. గుడ్డులో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడతాయి. అలానే నరాల బలహీనత ఉన్న వారు రోజూ గుడ్డును తీసుకోవాలి. ఇది నరాల బలహీనత తగ్గేలా చేస్తుంది. గుండె జబ్బుల నివారణకు తోడ్పడుతుంది.