International-womens-day-special-leave-for-women-employees

International-womens-day-special-leave-for-women-employees

అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2022: తెలుసుకోవలసిన విషయాలు

మార్చి 8నే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా

అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి Spl. Cl కి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు.
మహిళా ఉపాధ్యాయులు ఎక్కడ హాజరు ఐనా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇచ్చిన అటెండెన్స్ సర్టిఫికేట్ డిడీఓ గారికి ఇస్తే చాలు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి Spl. Cl అప్లికేషన్

మహిళలు ప్రత్యేక సౌలభ్యాలు- సెలవులు*

ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ సబార్డినేట్ సర్వీసు రూల్సు లోని నిబంధన 22 ద్వారా వెసులుబాటు కల్పించినది.*

*(G.O.Ms.No.237,GAD తేది:28-05-1996)*

*(ఇది మహిళా ఉద్యోగులకు చరిత్రలో నిలిచిపోయే G.O.)*

*ఉద్యోగ కల్పనకు సంబంధించి మహిళల పట్ల అమలౌతున్న వివక్షను నిర్మూలించడానికి, ఉద్యోగ కల్పనలో సమానత్వం సాధించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలు.*

*(G.O.Ms.No.27 తేది:09-01-2004)*

*మరణించిన ప్రభుత్వ ఉద్యోగి వివాహిత కుమార్తెకు కారుణ్య నియామక పథకం ద్వారా ఉద్యోగం కల్పిస్తారు.*

*(G.O.Ms.No.350 తేది:30-07-1999)* 

*అవివాహిత ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భంలో ఆ ఉద్యోగి మీద ఆధారపడిన చెల్లెలుకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ అవకాశం.*

*(Memo.No.17897 తేది:20-04-2000)*

పనిస్థలాల్లో మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులను నిషేధిస్తూ ఉత్తర్వులు.*

*(G.O.Ms.No.322 GAD తేది:19-07-1995)*

ఎస్.ఎస్.సి సర్టిఫికేట్ లో తండ్రి పేరుతో పాటు తల్లిపేరు చేర్చు ఉత్తర్వులు.*

మెమో.నం.7679 తేది:14-09-2010)*

*మార్చి 8న మహిళా దినోత్సవం రోజున మహిళా ఉద్యోగులకు స్పెషల్ సి.ఎల్ మంజూరు.*

*(G.O.Ms.No.433 GAD తేది:4-8-2010)*

మహిళా ఉపాధ్యాయులకు 5 రోజుల అదనపు సెలవు మంజూరు.*

G.O.Ms.No.374 తేది:16-03-1996)*

జూనియర్  లెక్చరర్లకు 5 రోజుల అదనపు సెలవుల మంజూరు.*

*(G.O.Ms.No.03 తేది:05-01-2011)*

మహిళా ఉద్యోగులకు 5 రోజుల అదనపు సెలవు మంజూరు.*

*(G.O.Ms.No.142 తేది:01-09-2018)*

వివాహం ఐన మహిళా ఉద్యోగికి 180 రోజులు జీతం తో కూడిన ప్రసూతి  సెలవు మంజూరు చేయబడుతుంది.*

*(G.O.Ms.No.152 తేది:04-05-2010)*

మహిళా ఉద్యోగులు ట్యూబెక్టమి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి పద్నాలుగు రోజులకు (14)మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు. ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించనియెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల పద్నాలుగు(14) రోజులు మంజూరు చేయవచ్చు.*

G.O.Ms.No.1415 M&H తేది:10-06-1968)*

G.O.Ms.No.124 F&P తేది:13-04-1982)*

మహిళా ఉపాధ్యాయులు గర్భనిరోధక సాధనం(LOOP) అమర్చుకున్నరోజు ఒక(1) రోజు ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.*

(G.O.Ms.No.128 F&P తేది:13-04-1982)*

ఇద్దరికంటే తక్కువ పిల్లలున్నప్పుడు, ఆపరేషన్ తరువాత మగ, ఆడ పిల్లలందరూ చనిపోయినపుడు రీకానలైజేషన్ చేయించుకునే మహిళా ఉద్యోగికి 21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే ఆమేరకు మంజూరుచేస్తారు.*

(G.O.Ms.No.102 M&H తేది:19-02-1981)*

మహిళా ఉద్యోగి హిస్టరెక్టమి ఆపరేషన్(గర్భసంచి తొలగింపు) శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫారసు మేరకు 45 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరు చేస్తారు.*

(G.O.Ms.No.52 F&P తేది:01-04-2011)*

చట్టబద్దంగా గాని, అప్రయత్నంగా గాని గర్భస్రావం (Abortion) జరిగినచో 6 వారాల సెలవు మంజూరుచేయబడును.*

(G.O.Ms.No.762 M&H తేది:11-08-1976)*

మహిళా ఉద్యోగులు,టీచర్లకు వారి  మొత్తం సర్వీసులో 60 రోజులు శిశుసంరక్షణ సెలవు మంజూరు.*

G.O.Ms.No.132 తేది:06-07-2016)*

మార్చి 8న.. మహిళలు సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం, ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం. కానీ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అది మార్చి 8వ తేదీన వచ్చింది. అందుకే ప్రతి ఏటా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే 1975వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించింది.

మహిళా దినోత్సవం 2022: ప్రతి సంవత్సరం, మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఒక ప్రత్యేకమైన థీమ్‌తో పాటిస్తారు, ఈ సంవత్సరం థీమ్ వాతావరణ సంక్షోభానికి అనుగుణంగా ఉంది, మరింత తెలుసుకోవడానికి చదవండి.

Womens Day 2022: ఈ ఏడాది ఉమెన్స్ డే థీమ్.. స్థిరమైన రేపటి కోసం.. ‘రేపటి మహిళలు’.. లింగ సమానత్వం సాధించానికి కీలకం..

Womens Day 2022: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’S Day) ప్రతి సంవత్సరం మార్చి 8 (March 8th)న జరుపుకుంటారు. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని  మంగళవారం(Tuesday)..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (IWD) ప్రతి సంవత్సరం మార్చి 8 న మహిళల సాంస్కృతిక, రాజకీయ మరియు సామాజిక ఆర్థిక విజయాలను స్మరించుకోవడానికి జరుపుకుంటారు. దీని ప్రాముఖ్యత ఒక్కో ప్రదేశానికి భిన్నంగా ఉంటుంది, కొన్ని దేశాల్లో లింగ సమానత్వం కోసం పోరాడే రోజు అయితే కొన్ని దేశాల్లో ఇది మహిళల విజయాలను జరుపుకునే రోజు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2022 గురించి తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.

థీమ్

ప్రతి సంవత్సరం, మహిళా దినోత్సవాన్ని ఒక ప్రత్యేకమైన థీమ్‌తో జరుపుకుంటారు. ఈ సంవత్సరం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం UN యొక్క థీమ్ ‘స్థిరమైన రేపటి కోసం ఈ రోజు లింగ సమానత్వం’, వాతావరణ మార్పుల అనుసరణ, ఉపశమనం మరియు ప్రతిస్పందనను ప్రోత్సహించే వారి కమ్యూనిటీలలో పాల్గొనే ప్రపంచవ్యాప్తంగా మహిళలు మరియు బాలికల సహకారాన్ని హైలైట్ చేసే లక్ష్యంతో. అందరికీ మరింత స్థిరమైన భవిష్యత్తును నిర్మించడానికి.

WOMENS DAY MARCH 8 SPECIAL CL LETTER PDF

పురుషుల కంటే మహిళలు వాతావరణ మార్పు ప్రభావాలకు ఎక్కువ హాని కలిగి ఉంటారు, ఎందుకంటే వారు ప్రపంచంలోని పేదలలో ఎక్కువ మంది ఉన్నారు మరియు వాతావరణ మార్పు ఎక్కువగా బెదిరించే సహజ వనరులపై ఎక్కువ ఆధారపడి ఉన్నారు. అదే సమయంలో, మహిళలు మరియు బాలికలు సమర్థవంతమైన మరియు శక్తివంతమైన నాయకులు మరియు వాతావరణ అనుసరణ మరియు ఉపశమనానికి మార్పు-నిర్ణేతలు. వారు ప్రపంచవ్యాప్తంగా సుస్థిరత కార్యక్రమాలలో పాల్గొంటున్నారు మరియు వారి భాగస్వామ్యం మరియు నాయకత్వం మరింత ప్రభావవంతమైన వాతావరణ చర్యకు దారితీస్తుందని IWD 2022 కోసం UN ఉమెన్ అధికారిక ప్రకటన పేర్కొంది.

INTERNATIONAL WOMENS DAY SPECIAL LEAVE LETTER CLICK HERE