LIC Golden Jubilee Scholarship-online-application

LIC Golden Jubilee Scholarship-online-application

LIC Golden Jubilee Scholarship: విద్యార్థులకు ఏడాదికి రూ.20,000 స్కాలర్‌షిప్‌.. వెంటనే ఇలా అప్లయ్‌ చేసుకోండి

LIC Scholarship 2021: ఎల్‌ఐసీ 2021 సంవత్సరానికి సంబంధించి గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందిస్తారు

LIC Golden Jubilee Scholarship: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) 2021 సంవత్సరానికి సంబంధించి గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందిస్తారు. డిసెంబర్‌ 31 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://licindia.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

అర్హతలు: 2020–21 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2 లక్షలు మించకుండా ఉండాలి. మెడిసిన్‌/ఇంజనీరింగ్‌/ఏదైనా గ్రాడ్యుయేషన్‌ /ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు/ఏదైనా విభాగంలో డిప్లొమా/తత్సమాన కోర్సులు/ఒకేషనల్‌ కోర్సు(ఐటీఐల్లో)ల్లో చేరాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ ఉపకార వేతనాలు అందజేస్తారు.

2020–21 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2 లక్షలు మించకుండా ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజీల్లో/ఐటీఐల్లో ఒకేషనల్‌ కోర్సుల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్స్‌ అందజేస్తారు.

ప్రత్యేకంగా బాలికలకు ఉపకార వేతనాలు: బాలికల విద్యను ప్రోత్సహించడానికి వీటిని అందిస్తున్నారు. కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై.. ఇంటర్మీడియట్‌ చదువుతున్న బాలికలు దీనికి అర్హులు. 2020–21 విద్యా సంవత్సరంలో 60 శాతం మార్కులతో పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2లక్షలు మించకూడదు.

LIC GJS 2021 SCHOLARSHIP NOTIFICATION & GUIDELINES CLICK HERE

INSTRUCTIONS TO CANDIDATES WHO ARE SUBMITTING ONLINE APPLICATION FOR GOLDEN JUBILEE SCHOLARSHIP SCHEME-2021

LIC GJS SCHOLARSHIP-2021 ONLINE APPLICATION CLICK HERE

error: Content is protected !!
Scroll to Top