how-to-download-Aadhar-card-simple-steps

how-to-download-Aadhar-card-simple-steps

Aadhaar Card: ఆధార్ కార్డ్ మర్చిపోతే సింపుల్‌గా ఇలా డౌన్‌లోడ్ చేయండి

Aadhaar Card | మీ ఆధార్ కార్డ్ ఎక్కడైనా పోయిందా? ఎక్కడైనా అవసరం ఉన్నప్పుడు జేబులో ఆధార్ కార్డ్ లేదా? మీ స్మార్ట్‌ఫోన్‌లో చాలా సింపుల్‌గా ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ (Aadhaar Card Download) చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

ఆధార్ కార్డ్… భారతీయులందరికీ ఇప్పుడు తప్పనిసరిగా ఉండాల్సిన కార్డు ఇది. ఆధార్ కార్డును (Aadhaar Card) ఐడెంటిటీ ప్రూఫ్‌గా, అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగించుకోవచ్చు

ఆధార్ కార్డ్ ప్రతీ సందర్భంలో ఆధార్ నెంబర్ అవసరం అవుతోంది. మరి ఇంత ముఖ్యమైన డాక్యుమెంట్ అయిన ఆధార్ కార్డ్ ఎక్కడైనా పోగొట్టుకుంటే టెన్షన్ అంతా ఇంతా కాదు. ఆధార్ కార్డ్ పోయినంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదు. సులువుగా తిరిగి పొందొచ్చు. ఆధార్ కార్డ్ మర్చిపోయినప్పుడు కూడా అప్పటికప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేయొచ్చు

ఆధార్ కార్డ్ తిరిగి పొందడానికి ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా వర్చువల్ ఐడీ లేదా ఆధార్ నెంబర్ తెలిసి ఉండాలి. దీంతో పాటు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీ యాక్టీవ్‌గా ఉండాలి. ఇవి ఉంటే ఆధార్ కార్డు తిరిగి పొందొచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో వెంటనే ఇఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేయొచ్చు. లేదా ఆధార్ పీవీసీ కార్డ్ ఆర్డర్ చేయొచ్చు

 ఇఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ కోసం ముందుగా https://uidai.gov.in/ లేదా https://eaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Download Aadhaar లింక్ కనిపిస్తుంది. క్లిక్ చేయాలి. ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, వర్చువల్ ఐడీ, ఆధార్ నెంబర్‌లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.

Send OTP పైన క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ Plumbytes Anti Malware Lisans Anahtarı ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఇ-ఆధార్ డౌన్‌లోడ్ అవుతుంది. మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు క్యాపిటల్ లెటర్స్‌లో, పుట్టిన సంవత్సరం కలిపి పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే ఇఆధార్ ఓపెన్ అవుతుంది

AADHAR CARD MAIN WEBSITE CLICK HERE