Clarification-on-all-school-timings-for-teachers-students

Clarification-on-all-school-timings-for-teachers-students

*ఉన్నత పాఠశాలల పనివేళలు – టైమ్ టేబుల్ – క్లారిఫికేషన్

*పాఠశాల పనిగంటలు : 9 am – 4 pm*

*8 am – 8.45 am :*

స్వయం అభ్యసనం

పర్యవేక్షణ అధ్యయనం

We love reading

పోటీ పరీక్షల సన్నద్ధత

*4 pm – 5 pm :*

ఆటలు & క్రీడలు

*5 pm – 6 pm :*

పరిహార బోధన

We love reading

గ్రంధాలయ కృత్యములు

8 am – 8.45 am మరియు 5 pm – 6 pm కార్యక్రమాలు ఐచ్చికమే

8 am – 8.45 am మరియు 4 pm – 5 pm కార్యక్రమాలు PET / PD లు అమలు పరుస్తారు

అందు నిమిత్తం PET / PD లు 9.30 am నుండి 2.30 pm వరకు పాఠశాల హాజరు నుండి మినహాయింపబడతారు

ఆసక్తి గల ఉపాధ్యాయులు మాత్రమే స్వచ్ఛందంగా 8 am – 8.45 am సమయంలో సంబంధిత కార్యక్రమాలు చేపట్టవచ్చును

✍9 టు 4

పాఠశాలల పనివేళలపై ఉత్తర్వులు

సాయంత్రం 4 గం. నుంచి 5 గం. వరకు ఆటలు

 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకే జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన సర్క్యులర్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి చినవీరభద్రుడు శనివారం విడుదల చేశారు. ఉదయం 8 నుంచి 8.45 గంటల వరకు సెల్ఫ్ లెర్నింగ్, సూపర్విజరీ స్టడీ, కాంపిటేటివ్ పరీక్షలకు శిక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు తప్పనిసరిగా క్రీడలకు కేటాయించాలని తెలిపారు. ఈ సమయాన్ని పిఇటిలు మాత్రమే తీసుకోవాలని పేర్కొన్నారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు రెమిడియల్ టీచింగ్, లైబ్రరీ, రీడింగ్ వంటి కార్యక్రమాలను నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. స్కూల్ అసిస్టెంట్ పీ ఈ టీ లకు ఇక ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు పాఠశాల నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలిపారు. ఉదయం 8 నుంచి 8.45, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు నిర్వహించే కార్యక్రమాలు స్వచ్చందంగా మాత్రమే నిర్వహించాలని పేర్కొన్నారు.

హైస్కూళ్లు 9 నుంచి 4 గంటల వరకే

ఉదయం 8 – 8.45, సాయంత్రం 4 – 5 గంటల కార్యక్రమాలకు ఫిజికల్‌ డైరెక్టర్ల హాజరు

ఆ సమయాల్లో ఇతర టీచర్ల హాజరు ఆప్షన్‌ మాత్రమే

పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ

AP‌లోని హైస్కూళ్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయని పాఠశాల విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. హైస్కూళ్లలో ఉదయం 8 నుంచి 8.45 గంటల వరకు విద్యార్థులకు సెల్ఫ్‌ లెర్నింగ్, సూపర్వైజరీ స్టడీ, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు గేమ్స్, స్పోర్ట్స్‌ ఉంటాయి.

వీటికి ఆయా స్కూళ్ల ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్లు, ఎస్‌ఏ (పీడీ)లు తప్పని సరిగా హాజరు కావాలి. ఈ సమయాల్లో ఇతర టీచర్ల హాజరు ఆప్షన్‌ మాత్రమే. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్లకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు స్కూల్‌ సమయాల్లో హాజరు మినహాయింపు ఉంటుంది. 

For more details click here pdf