ap-new-districts-divisions-collectors-details

ap-new-districts-divisions-collectors-details

పరిపాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లాల విభజన

17,500కు పైగా సూచనల పరిశీలన

కొన్ని జిల్లాల్లో మండలాల మార్పు

కుప్పం కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌

అదనంగా 21.. మొత్తం 72 రెవెన్యూ డివిజన్లు

బాలాజీ జిల్లా పేరు తిరుపతి జిల్లాగా ఖరారు

4వ తేదీన కొత్త జిల్లాల నుంచి పరిపాలన

13 జిల్లాలు.. 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరణ

తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం

13 జిల్లాలను 26 కొత్త జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించింది. అలాగే 21 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. దీంతో డివిజన్ల సంఖ్య 51 నుంచి 72కు చేరింది. ఈ మేరకు శనివారం తుది గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేసింది

ప్రజల అభిప్రాయం మేరకు స్వల్ప మార్పులు
కొత్త జిల్లాల ప్రతిపాదనలపై రాష్ట్ర వ్యాప్తంగా 284 అంశాలపై ప్రజల నుంచి 17,500కు పైగా సూచనలు వచ్చాయి. y2mate downloader crack వాటిని రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. సహేతుకంగా ఉన్న వాటిపై అధ్యయనం చేసి అందుకనుగుణంగా స్వల్ప మార్పులు చేసింది. దీనివల్ల కొత్త జిల్లాల్లో గతంలో ప్రతిపాదించిన కొన్ని మండలాలు అటు ఇటు మారాయి.

పూర్తయిన కొత్త జిల్లాల ప్రక్రియ..*

 ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది. శనివారం వర్చువల్‌గా భేటీ అయిన కేబినెట్‌.. చిన్న చిన్న మార్పులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేయబోతోంది.  ఏప్రిల్‌ 4వ తేదీన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రారంభమవుతుంది.

కాగా, 26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లతో ఫైనల్‌ గెజిట్‌ సిద్దమైంది. ఈ క్రమంలో పలు మండలాలను ప్రభుత్వం మార్చింది. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 51 నుండి 73కి పెరిగింది. పాత రెవెన్యూ డివిజన్‌లన్నీ యథాతథంగా కొనసాగనున్నాయి.

కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు.

1. శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం

2. విజయనగరం : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం

3. ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ

4. అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం

5. విశాఖపట్నం : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం

6. అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం,

7. కాకినాడ : పెద్దాపురం, కాకినాడ

8. కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త)

9. తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు

10. పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం (కొత్త)

11. ఏలూరు : luminar ai cracked జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు

12. కృష్ణా : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)

13. ఎన్టీఆర్‌ : విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త)

14. గుంటూరు : గుంటూరు, తెనాలి

15. బాపట్ల : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)

16. పల్నాడు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త)

17. ప్రకాశం : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి (కొత్త)

18. నెల్లూరు : కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు

19. కర్నూలు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)

20. నంద్యాల : ఆత్మకూరు (కొత్త), డోన్‌ (కొత్త), నంద్యాల

21. అనంతపురం : అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్‌ (కొత్త)

22. శ్రీ సత్యసాయి : ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి (కొత్త)

23. వైఎస్సార్‌ కడప : బద్వేల్, కడప, జమ్మలమడుగు

24. అన్నమయ్య : రాజంపేట, మదనపల్లె, రాయచోటి (కొత్త)

25. చిత్తూరు : చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)

26. తిరుపతి : గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి.

కొత్త జిల్లాలు, మండలాల సంఖ్య..*

– శ్రీకాకుళం జిల్లా.. 30 మండలాలు

– విజయనగరం జిల్లా.. 27 మండలాలు

– పార్వతీపురం మన్యం జిల్లా.. 15 మండలాలు

– అల్లూరి సీతారామరాజు జిల్లా.. 22 మండలాలు

– విశాఖపట్నం జిల్లా.. 11 మండలాలు

– అనకాపల్లి జిల్లా.. 24 మండలాలు

– కాకినాడ జిల్లా.. 21 మండలాలు

– కోనసీమ జిల్లా.. 22 మండలాలు

– తూర్పుగోదావరి జిల్లా.. 19 మండలాలు

– పశ్చిమగోదావరి  జిల్లా.. 19 మండలాలు

– ఏలూరు జిల్లా.. 28 మండలాలు

– కృష్ణా జిల్లా.. 25 మండలాలు

– ఎన్టీఆర్ జిల్లా.. 20 మండలాలు

– గుంటూరు జిల్లా.. 18 మండలాలు

– బాపట్ల జిల్లా.. 25 మండలాలు

– పల్నాడు జిల్లా.. 28 మండలాలు

– ప్రకాశం జిల్లా.. 38 మండలాలు

– నెల్లూరు జిల్లా.. 38 మండలాలు

– కర్నూలు జిల్లా.. 26 మండలాలు

– నంద్యాల జిల్లా.. 29 మండలాలు

– అనంతపురం జిల్లా.. 31 మండలాలు

– శ్రీ సత్యసాయి జిల్లా.. 32 మండలాలు

– వైఎస్సార్ కడప జిల్లా.. 36 మండలాలు

– అన్నమ్మయ్య జిల్లా.. 30 మండలాలు

– చిత్తూరు జిల్లా.. 31 మండలాలు

– తిరుపతి జిల్లా.. 34 మండలాలు

ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి విభజన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలోకి వెళ్లిన ద్వారకాతిరుమల మండలాన్ని అక్కడి ప్రజల అభీష్టం మేరకు ఏలూరు జిల్లాలోకి మార్చారు. అనకాపల్లి జిల్లాలోకి వెళ్లిన పెందుర్తిని స్థానికుల కోరిక మేరకు విశాఖ జిల్లాకు మార్చారు. ఇలా పలుచోట్ల మండలాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి జిల్లాలో 2011 లెక్కల ప్రకారం సగటున జిల్లాకు 18 నుంచి 20 లక్షల జనాభా ఉండేలా చూశారు. 

పార్లమెంటు నియోజకవర్గం ఒక యూనిట్‌ 
పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని జిల్లాలను విభజించింది. సాధ్యమైనంత వరకు ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒకే జిల్లాలోకి తెచ్చింది. ఇలా చేయడం వల్ల స్థానికంగా ఇబ్బందులు ఉన్నచోట ఆ మండలాలను మార్చింది. ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా జిల్లాకు కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. 10 జిల్లాల్లో రెండు, 12 జిల్లాల్లో మూడు, నాలుగు జిల్లాల్లో 4 చొప్పున మొత్తం 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. రెవెన్యూ డివిజన్ల విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతో ఉదారతతో వ్యవహరించారు.

పార్లమెంటు నియోజకవర్గం ఒక యూనిట్‌ 
పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని జిల్లాలను విభజించింది. సాధ్యమైనంత వరకు ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒకే జిల్లాలోకి తెచ్చింది. ఇలా చేయడం వల్ల స్థానికంగా ఇబ్బందులు ఉన్నచోట ఆ మండలాలను మార్చింది. ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా జిల్లాకు కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. 10 జిల్లాల్లో రెండు, 12 జిల్లాల్లో మూడు, నాలుగు జిల్లాల్లో 4 చొప్పున మొత్తం 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. రెవెన్యూ డివిజన్ల విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతో ఉదారతతో వ్యవహరించారు.

ఈ కారణంగానే 51 డివిజన్లు 72కు చేరాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజవర్గం కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఆయన కుప్పంను పట్టించుకోలేదు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ జిల్లాల విభజన చేస్తున్న సమయంలో కుప్పంను రెవెన్యూ డివిజన్‌ చేయాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ప్రభుత్వం కుప్పం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేసింది. 

మన్యం అభివృద్ధికి రెండు జిల్లాలు
పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, గిరిజన ప్రాంతం విస్తృతి దృష్ట్యా అరకు పార్లమెంట్‌ను రెండు జిల్లాలుగా చేశారు. పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాలతో పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాను అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలతో ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ఒక్కటి మినహా జిల్లాల పేర్లు యథాతథం
ప్రాథమిక నోటిఫికేషన్‌లో ప్రతిపాదించిన మేరకు కొత్త జిల్లాల పేర్లను ప్రభుత్వం దాదాపు అలాగే ఉంచింది. తిరుపతి కేంద్రంగా ప్రతిపాదించిన బాలాజీ జిల్లాను మాత్రం అక్కడి ప్రజల కోరిక మేరకు తిరుపతి జిల్లాగా మార్చింది. తమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని, అత్యంత ప్రముఖుల పేర్లను జిల్లాలకు పెట్టాలనే డిమాండ్లు పలుచోట్ల అనేక సంవత్సరాలుగా ఉన్నాయి. ఇలాంటి అనేక అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది.

అక్కడి స్థానిక ప్రాధాన్యాన్ని, కొన్ని ప్రాంతాలకు ఉన్న చారిత్రక నేపథ్యం, స్థానిక పరిస్థితులను స్వయంగా ప్రభుత్వమే గుర్తించి కొత్త జిల్లాల్లో ప్రతిబింబించేలా చూసింది. అదే సమయంలో పాత జిల్లాల ప్రాధాన్యం, ప్రాశస్త్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంది. మన్యం విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్ర పోరాటం జరిపిన ప్రాంతాన్ని ఆయన పేరుతో ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఎన్నో దశాబ్దాల నుంచి ఉంది. దాన్ని ప్రభుత్వం ఇప్పుడు సాకారం చేసింది. పాడేరు కేంద్రంగా అరకు ప్రాంతాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పాటు చేసింది.

పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా ఏర్పాటుతో గిరిపుత్రులకు గౌరవం ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతం ప్రత్యేకతను తెలియజెప్పేలా కోనసీమ జిల్లా ఏర్పాటు చేసి, అక్కడి ప్రజల మనోభావాలను గౌరవించింది. గోదావరి జిల్లాల ప్రాశస్త్యం దెబ్బ తినకుండా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను పునర్వ్యవస్థీకరించింది. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాగా, నర్సాపురం పార్లమెంటును భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాగా మార్చి వాటి ప్రాధాన్యతను కొనసాగించింది. ఈ జిల్లాలు గోదావరి తీర ప్రాంతాలు.

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు 
ఎన్టీఆర్‌ జన్మించిన కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టాలని ఈ ప్రాంత వాసులు చాలా కాలం నుంచి కోరుతున్నా, ఎవరూ పట్టించుకోలేదు. చంద్రబాబు సుదీర్ఘకాలం సీఎంగా ఉన్నప్పటికీ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. తాము అధికారంలోకి రాగానే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతామని పాదయాత్ర సమయంలో వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఆ మాట నెరవేర్చుకుంటూ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్‌ జిల్లాగా ఏర్పాటు చేశారు.

దీనిపై సర్వత్రా సానుకూలత వ్యక్తమవుతోంది. మరోవైపు మచిలీçపట్నాన్ని కృష్ణా జిల్లాగా కొనసాగిస్తూ దాని చారిత్రక ప్రాధాన్యతను ప్రభుత్వం నిలబెట్టింది. గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతం ప్రత్యేకతను నిలబెడుతూ పల్నాటి పౌరుషాన్ని ప్రతిబింబించేలా నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేసింది.

బాపట్లను జిల్లాగా చేయాలనే డిమాండ్‌ సుదీర్ఘ కాలంగా ఉన్న కల నెరవేరింది. పుట్టపర్తి ప్రాంతానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చిన సత్య సాయిబాబాను స్మరిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేసి ముందడుగు వేసింది. ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య నడయాడిన ప్రాంతాన్ని ఆయన పేరుతో అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేసింది.

కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసిన రాష్ర్ట ప్రభుత్వం.

కొత్త జిల్లాల ఏర్పాటు ఉత్తర్వులను https://apegazette.cgg.gov.in/homeEgazetteSearch.do ద్వారా పొందవచ్చు.

ఈ ఉత్తర్వుల ప్రకారం 4.4.2022 నుండి నూతన జిల్లాలు అమలులోకి రానున్నాయి.

NEW 26 DISTRICTS INFORMATION CLICK HERE