Health-Insurance-policy-plans-top-5-best-plans

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావిస్తున్నారా? టాప్-5 బెస్ట్ ప్లాన్స్ ఇవే!

ఒకప్పుడు ఆరోగ్య భీమా గురించి ఎక్కువ మంది ఆలోచించేవారు కాదు. కానీ, కోవిడ్–19 నేపథ్యంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం ఆరోగ్య భీమా కలిగి ఉండటం అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మారింది.

అనుకోకుండా అనారోగ్యం రావొచ్చు. అప్పుడు చేతిలో డబ్బులు ఉంటే పర్వాలేదు. ట్రీట్‌మెంట్ చేయించుకోవచ్చు. ఒకవేళ డబ్బులు లేకపోతే? స్నేహితులు లేదా బంధువుల నుంచి డబ్బు అప్పు తీసుకోవాలి. వాళ్లు కూడా హ్యాండిస్తే? అందుకే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి.

రక్తపోటు, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ ఇలా ఎన్నో రకాల వ్యాధులతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు సతమతమౌతున్నారు. వైద్య ఖర్చులు పెరిగిపోవడంతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మార్కెట్‌లో చాలా ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో టాప్ 5 పాలసీలు ఏంటివో చూద్దాం.

టాప్-5 బెస్ట్ హెల్త్ పాలసీలు ఇవే..

Religare Care Health Insurance Plan: రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ పాలసీని అందిస్తోంది. కుటుంబ సభ్యులందరికీ ఈ ప్లాన్ వర్తిస్తుంది. రూ.4 లక్షల నుంచి రూ.6 కోట్ల వరకు బీమా మొత్తానికి ఈ పాలసీ తీసుకోవచ్చు. జీవితాంతం పాలసీ వర్తిస్తుంది. చిన్న పిల్లలకు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఐసీయూ, రూమ్ రెంట్ చార్జీలు, డేకేర్ ఎక్స్‌పెన్సెస్, హాస్పిటల్ అడ్మిషన్‌కు 30 రోజుల ముందు వరకు చేయించిన టెస్ట్‌లకు కూడా పాలసీ కవరేజ్ లభిస్తుంది. ఆయుర్వేద, యునాని, హోమియోపతి వంటి ట్రీట్‌మెంట్లకు కూడా పాలసీ వర్తిస్తుంది. ఆర్గాన్ డోనర్ కవర్, అంబులెన్స్ కవర్ వంటివి కూడా పాలసీలో కవర్ అవుతాయి.

Max Bupa Health Companion Individual Plan: మ్యాక్స్ బుపా కంపెనీ ఈ పాలసీని అందిస్తోంది. రూ.3 లక్షల నుంచి రూ.కోటి వరకు కవరేజ్‌కు పాలసీ తీసుకోవచ్చు. 90 రోజుల వయసు ఉన్న పిల్లల దగ్గరి నుంచి ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. రూమ్ రెంట్‌పై ఎలాంటి పరిమితి ఉండదు. దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. హాస్పిటల్‌లో ఒకవేళ బీమా మొత్తం పరిమితి దాటితే అప్పుడు రిఫిల్ బెనిఫిట్ ఉంటుంది. అంటే అదనపు ప్రీమియం చెల్లింపు ద్వారా పాలసీ మొత్తాన్ని మళ్లీ పొందొచ్చు. ప్రత్యామ్నాయ ట్రీట్‌మెంట్స్‌కు కూడా పాలసీవర్తిస్తుంది.

Star Family Health Optima Plan: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ పాలసీని అందిస్తోంది. కుటుంబంలోని అందరికీ పాలసీ కవరేజ్ లభిస్తుంది. మార్కెట్‌లో అందుబాటు ధరలో లభ్యమౌతున్న మోస్ట్ ఆఫర్డబుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఇది. పుట్టబోయే బిడ్డకు కూడా పాలసీ వర్తిస్తుంది. రూ.లక్ష నుంచి రూ.25 లక్షల వరకు కవరేజ్‌తో పాలసీ తీసుకోవచ్చు. 16 రోజుల చిన్న పిల్లల నుంచి 65 ఏళ్ల వయసు ఉన్న వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదానికి గురైతే అప్పుడు పాలసీ మొత్త ఆటోమేటిక్‌గానే 25 శాతం వరకు పెరుగుతుంది. దీనికి ఎలాంటి అదనపు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. పాలసీ గ్రేస్ పీరియడ్ 120 రోజులు.

Apollo Munich Optima Restore Plan: ప్రి-హాస్పిటలైజేషన్ నుంచి పోస్ట్-హాస్పిటలైజేషన్ వరకు దాదాపు అన్ని ఖర్చులకు ఈ పాలసీ వర్తిస్తుంది. పాలసీలో రిస్టోర్ బెనిఫిట్ ఉంటుంది. ఫాస్ట్ క్లెయిమ్ సెటిల్‌మెంట్, మెడికల్ ఎక్సె‌పెన్సెస్ రీయింబర్స్‌మెంట్ వంటివి కంపెనీ ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. రూ.3 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బీమా కరేజ్ పొందొచ్చు. 91 రోజుల పిల్లల నుంచి 65 ఏళ్ల వయసు ఉన్న వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఏడాది కాకుండా రెండేళ్ల కాల పరిమితితో పాలసీ తీసుకోవచ్చు. 7.5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

HDFC ERGO Health Suraksha Gold Plan: హెచ్‌డీఎఫ్‌సీ ఆ పాలసీ అందిస్తోంది. మెంటల్ హెల్త్‌కేర్, హాస్పిటలైజేషన్ ఎక్స్‌పెన్సెస్, ఎయిర్ అంబులెన్స్ సహా ఇతర వైద్య ఖర్చులకు ఈ పాలసీ వర్తిస్తుంది. రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు. వయసు పరిమితి అంటూ ఏమీ లేదు. ఎవరైనా పాలసీ పొందొచ్చు. దేశంలో 6000కు పైగా హాస్పిటల్స్‌లో ఈ పాలసీ‌తో క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ చేయించుకోవచ్చు. బోనస్ ఫెసిలిటీ ఆప్షన్ ఉంది.

ఇండియా 2022 లో ఉత్తమమైన కుటుంబ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లు

మీకు సులువు గా ఉండేందుకు ఇండియా లో ఉన్న పెద్ద హెల్త్ ఇన్సూరెన్సు కంపెనీలు అందిస్తున్న ఉత్తమ మైన ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ లు కొన్నింటిని మీ కుంటుంబానికి తగిన మెడిక్లైయిమ్ పాలసీ ని కొనుగోలుచేసేందుకు అందిస్తున్నాము. మీ అవసరాలు అంటే, హామీ మొత్తం, వయోపరిమితి, ప్రీ & పోస్ట్ హాస్పిటలైజేషన్ వంటి అవసరాలకు తగిన ప్లాన్ ను ఎంచుకోవడానికి ఉపయోగపడతాయి.

ఇన్సూరెన్సు కంపెనీ ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ హామీ మొత్తం (రూ.) ప్రీ & పోస్ట్ హాస్పిటలైజేషన్ ముందే కలిగి ఉన్న వ్యాధుల కొరకు
ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్సు ఆక్టివ్ హెల్త్ ప్లాటినం 2 లక్షలు – 2 కోట్లు 1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 60 రోజులు

2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 90 రోజులు

48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత
బజాజ్ అలియాన్స్ హెల్త్ ఇన్సూరెన్సు ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్-గార్డ్ 1.5 – 50 లక్షలు 1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 60 రోజులు

2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 90 రోజులు

48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత
భారతి ఏ ఎక్స్ ఏ హెల్త్ ఇన్సూరెన్సు స్మార్ట్ సూపర్ హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ 5 లక్షలు – 1 కోటి 1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 60 రోజులు

2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 90 రోజులు

48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత
కేర్ హెల్త్ ఇన్సూరెన్సు (ఇంతకు మునుపు రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్సు) కేర్ హెల్త్ కేర్ ప్లాన్

 

3 – 6 కోట్లు 1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 30 రోజులు

2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 60 రోజులు

48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత
చోళ ఎం ఎస్ హెల్త్ ఇన్సూరెన్సు చోళ ఎం ఎస్ ఫ్యామిలీ హెల్త్ లైన్ ఇన్సూరెన్సు

 

2 – 15 లక్షలు 1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 60 రోజులు

2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 90 రోజులు

48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత
డిజిట్ హెల్త్ ఇన్సూరెన్సు డిజిట్ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్

 

2 – 25 లక్షలు వర్తించదు
ఈడెల్వెయిస్ హెల్త్ ఇన్సూరెన్సు ఫ్యామిలీ ఫ్లోటర్ 1 కోటి వరకూ 1. సిల్వర్: 30 & 60 రోజులు

2. గోల్డ్: 60 & 90 రోజులు

3. ప్లాటినం: 90 & 180

ఫ్యూచర్ జెనెరలి హెల్త్ ఇన్సూరెన్సు ఫ్యూచర్ హెల్త్ సురక్ష ఫ్యామిలీ ప్లాన్ 5 – 10 లక్షలు 1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 60 రోజులు

2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 90 రోజులు

48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత
ఇఫ్కో టోకియో హెల్త్ ఇన్సూరెన్సు ఇఫ్కో టోకియో ఫ్యామిలీ హెల్త్ ప్రొటెక్టర్ ప్లాన్ 1.5 – 30 లక్షలు 1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 45 రోజులు

2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 60 రోజులు

కోటక్ మహీంద్రా హెల్త్ ఇన్సూరెన్సు  

ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు

2 – 100 లక్షలు 1 . కవర్ చేయబడింది 48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత
లిబర్టీ హెల్త్ ఇన్సూరెన్సు సెక్యూర్ హెల్త్ కనెక్ట్ 1 .సెక్యూర్ బేసిక్: 3,4, 5 ఎల్

2 . సెక్యూర్ ఎలైట్: 2, 3, 4, 5, 6, 7.5, 10 ఎల్

3 . సెక్యూర్ సుప్రీమ్: 3, 4, 5, 6, 7.5, 10 ఎల్

4 . సెక్యూర్ కంప్లీట్: 2, 3, 4, 5, 6, 7.5, 10, 15 ఎల్

మాక్స్ భూపా హెల్త్ ఇన్సూరెన్సు హార్ట్ బీట్ ఫ్యామిలీ ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ 1. సిల్వర్: 3-15 లక్షలు

2. గోల్డ్: 3-50 లక్షలు

3. ప్లాటినం: 15-50 లక్షలు

1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 60 రోజులు

2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 90 రోజులు

సిల్వర్ ప్లాన్ కు 48 నెలలు

గోల్డ్ & ప్లాటినం ప్లాన్ కు 24 నెలలు

మణిపాల్ సిగ్న హెల్త్ ఇన్సూరెన్సు ఫ్యామిలీ ఫ్లోటర్ – ప్రో హెల్త్ ప్రొటెక్ట్ ప్లాన్ 2.5 – 50 లక్షలు 1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 60 రోజులు

2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 90 రోజులు

48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత
నేషనల్ హెల్త్ ఇన్సూరెన్సు నేషనల్ ఇన్సూరెన్సు మెడిక్లైయిం పాలసీ 50000 – 5 లక్షలు 1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 30 రోజులు

2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 60 రోజులు

48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత
న్యూ ఇండియా అసురన్సు హెల్త్ ఇన్సూరెన్సు ఫ్యామిలీ ఫ్లోటర్ మెడిక్లైయిం పాలసీ 2 – 5 లక్షలు 1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 30 రోజులు

2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 60 రోజులు

48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత
ఓరియంటల్ ఇన్సూరెన్సు కంపెనీ హ్యాపీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ 1 – 20 లక్షలు 1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 30 రోజులు

2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 60 రోజులు

48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత
రహేజా క్యూ బి ఈ హెల్త్ ఇన్సూరెన్సు హెల్త్ క్యూ బి ఈ 1 – 50 లక్షలు
రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్సు రాయల్ సుందరం లైఫ్ లైన్ హెల్త్ ఇన్సూరెన్సు 1. క్లాసిక్: 2, 3, 4 లక్షలు

2. సుప్రీం: 5, 10, 15, 20 & 50 లక్షలు

3. ఎలైట్: 25, 30, 50, 100 & 150 లక్షలు

1. క్లాసిక్: 30 & 60 రోజులు

2. సుప్రీం: 60 & 90 రోజులు

3. ఎలైట్: 90 & 180 రోజులు

24 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత
రిలయన్స్ హెల్త్ ఇన్సూరెన్సు రిలయన్స్ హెల్త్ వైస్ ప్లాన్ 1 – 5 లక్షలు 1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 30 రోజులు

2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 60 రోజులు

24 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత
స్టార్ హెల్త్ ఇన్సూరెన్సు స్టార్ ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమ ప్లాన్

 

1 – 15 లక్షలు 1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 30 రోజులు

2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 60 రోజులు (మొత్తం ఖర్చుల లో 7% గరిష్టం గా రూ. 5,000)

48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత
ఎస్ బి ఐ హెల్త్ ఇన్సూరెన్సు ఎస్ బి ఐ ఆరోగ్య ప్రీమియర్ ప్లాన్ 10 లక్షలు – 30 లక్షలు 1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 60 రోజులు

2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 90 రోజులు

48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత
టాటా ఏ ఐ జి హెల్త్ ఇన్సూరెన్సు వెల్సురేన్స్ ఫ్యామిలీ పాలసీ 2 – 4 లక్షలు 48 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత
యునైటెడ్ ఇండియా హెల్త్ ఇన్సూరెన్సు ఫ్యామిలీ మెడికేర్ పాలసీ 1 – 10 లక్షలు 1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 30 రోజులు

2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 60 రోజులు గరిష్టం గా హామీ మొత్తం లో 10 %

24 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత
యూనివర్సల్ సోంపూ హెల్త్ ఇన్సూరెన్సు కంప్లీట్ హెల్త్ కేర్ ఇన్సూరెన్సు

 

1.బేసిక్: 1-2 లక్షలు

2. ఎసెన్షియల్: 3-5 లక్షలు

3 . ప్రివిలేజ్: 6-10 లక్షలు

1 . ప్రీ- హాస్పిటలైజేషన్: 30 రోజులు

2 . పోస్ట్-హాస్పిటలైజేషన్: 60 రోజులు

36 నెలల వెయిటింగ్ పీరియడ్ తరువాత
error: Don\'t Copy!!!!