AP-EMPLOYEES-teachers-service-matters-doubts-and-answers

AP-EMPLOYEES-teachers-service-matters-doubts-and-answers

ఉద్యోగుల సందేహలకు సమాధానాలు తెలుసుకుందాం*

సందేహం:
*ఒక ST ఉపాధ్యాయుని అన్న ప్రభుత్వోదోగిగా ఉన్నారు. ఆ ఉపాధ్యాయుని కి ఇన్ సర్వీసులో ఉన్నత చదువులు చదవడానికి ఫస్ట్ జనరేషన్ సర్టిఫికెట్ పొందడానికి అర్హత ఉంటుందా?*
 
సమాధానం:
*అర్హత ఉంటుంది. తాత లేక తండ్రి ఉద్యోగస్థులైతే అర్హత ఉండదు. కానీ వారు ఉద్యోగులు కాకపోయినట్లయితే ప్రస్తుత తరంలో ఎంతమంది అన్నదమ్ములు ఉద్యోగులైనప్పటికి వారందరికీ ఫస్ట్ జనరేషన్ సర్టిఫికేట్ పొందే అర్హత ఉంటుంది. ఈ అంశంపై పాఠశాల విద్యాశాఖ కమీషనర్ Rc.No.860/Ser.4-3/2018 తేది: 12.01.2018 ద్వారా వివరణ ఇచ్చారు.*
 
 
 సందేహం:
*ఒక ఉద్యోగి సస్పెన్షన్ లో ఉంటూ అనారోగ్య కారణాలతో చనిపోయిన సంధర్భంలో అతని కుటుంబానికి ఉద్యోగం ఇవ్వవచ్చునా?సస్పెన్షన్ కాలాన్ని ఎలా పరిగణిస్తారు?*
 
 సమాధానం:
*సస్పెండైన ఉద్యోగి క్రమశిక్షణా చర్యలు పూర్తికాకుండానే చనిపోయిన సంధర్భంలో అతనిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వవచ్చు.సస్పెన్షన్ కాలాన్ని డ్యూటీ క్రింద పరిగణించి అతనికి రావాలసిన జీతభత్యాలు అతని వారసులకు చెల్లించాలని ప్రభుత్వం జీవో.275,F&P,తేది:8-8-1977 ద్వారా సూచించింది.
 
 
సందేహము:
*చైల్డ్ కేర్ లివ్ ఒక స్పెల్ కు మాగ్జిమం ఎన్ని రోజులు  పెట్టుకోవచ్చు. 1,2 రోజులు కూడా పెట్టుకోవచ్చునా ?*
 
 సమాధానము:
*G.O.Ms.No.209 Fin తేది:21.11.2016 ప్రకారం వివాహిత మహిళా ఉపాధ్యాయులు ప్రతి స్పెల్ కు మాగ్జిమం 15 రోజుల చొప్పున 6 స్పెల్ లకు తగ్గకుండా 90 రోజులు వాడుకోవచ్చును. జీవోలో 6 స్పెల్ లకు తగ్గకుండా అన్నారు కాబట్టి 1,2 రోజులు కూడా వాడుకొనవచ్చును.*
 
 
 సందేహము:
*చైల్డ్ కేర్ లివ్ ముందుగానే మంజూరు చేయించుకోవాలా? సెలవు కాలంలో పూర్తి జీతం చెల్లిస్తారా ?*
 
 సమాధానము:
*చైల్డ్ కేర్ లివ్ ను DDO తో ముందుగానే మంజూరు చేయించుకుని, ప్రొసీడింగ్స్ ద్వారా వివరాలను సర్వీసు పుస్తకములో నమోదు చేయించుకోవాలి.ఆ నెల వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాలసీన బాధ్యత DDO దే.*
 
 
 సందేహము:
*చైల్డ్ కేర్ లివ్ పెట్టిన సెలలో ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే మంజూరు చేయవచ్చునా ?*
 
 సమాధానము:
*వీలుపడదు. సెలవు కాలంలో వేతన వృద్ధి ఉండదు.కావున సెలవు అనంతరం విధులలో చేరిన నాటినుండే ఇంక్రిమెంట్ మంజూరుచేస్తారు.*
 
 
 సందేహము:
*మెటర్నిటి లీవుకు కొనసాగింపుగా చైల్డ్ కేర్ లీవు పెటుకోవచ్చునా ?*
 
 సమాధానము:
*చైల్డ్ కేర్ లీవును అన్ని విధాలుగా  Other than casual,spl. casual leave తో కలిపి పెట్టుకోవచ్చునని జీవో.209 లోని రూలు 3(i) సూచిస్తోంది.*
 
 
 సందేహము:
*సర్రోగసి, దత్తత ద్వారా సంతానం పొందిన మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లివ్ కు అర్హులేనా ?*
 
 సమాధానము:
*అర్హులే, 90 రోజుల సెలవు వాడుకొనవచ్చును.*
 
 
 సందేహము:
*భార్య మరణించిన పురుష ఉద్యోగికి చైల్డ్ కేర్ లివ్ మంజూరు చేయవచ్చునా ?*
 
 సమాధానము:
*వీలు లేదు. ఇందుకు సంబంధించిన GO.209 లో Women Employees* *అని ఉన్నది.*
 
 
 సందేహము:
*చైల్డ్ కేర్ లీవ్ కు అప్లై చేసిన ప్రతిసారి పుట్టినతేది వివరాలు సమర్పించాలా?*
 
 సమాధానము:
*అవసరం లేదు. మొదటి సారి అప్లై చేసేటపుడు మాత్రమే కుమారుడు/కుమార్తె డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలి. ప్రతి దఫా అప్లికేషన్ సమర్పిస్తే సరిపోతుంది.*
 
 
సందేహము:
 
*పిల్లల అనారోగ్యం, చదువుల కొరకు మాత్రమే చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేస్తారా ?*
 
 సమాధానము:
*GO.209 point.3 లో  ఇలా ఉన్నది “Children needs like examinations, sickness etc”, అని ఉన్నది కావున పై రెండు కారణాలకే కాకుండా ఇతరత్రా కారణాలకు కూడా చైల్డ్ కేర్ లీవు మంజూరు చేయవచ్చును.*
సందేహము:
 
*చైల్డ్ కేర్ లీవ్ కు ప్రిఫిక్స్,సఫిక్స్  వర్తిస్తాయా ?*
 
 సమాధానము:
*వర్తిస్తాయి, ప్రభుత్వ సెలవు దినాలతో ఇట్టి సెలవును అనుసంధానం చేసుకోవచ్చును*
 
*సందేహాలు –  సమాధానాలు*
 
*ప్రశ్న:*
ఒక జిల్లాలోని విద్యార్థి మరొక జిల్లాకు బదిలీ అయితే రికార్డు షీటు లేక టి.సి.పై ఎవరి కౌంటర్ సిగ్నేచర్ అవసరం?
 
*జవాబు:*
ఎవరు కౌంటర్ సిగ్నచర్ అవసరం లేదు. (L.Dis. No.
7310 B1/2/76, Dt. 17-9-76. DSE,Hyd)
 
*ప్రశ్న:*
ఇన్ చార్జి HM ఏయే విధులు నిర్వహించవచ్చు?
 
*జవాబు:*
ఇన్చార్జి HM ఆర్థిక కార్యకలాపాలు, టి.సి.లు జారీ చేయుట చేయరాదు. కేవలం టీచర్స్, విద్యార్థుల హాజరు పట్టీలు, విజిటర్స్ బుక్, CL రిజిస్టర్ నిర్వహణ మాత్రమే చేయాలి 15 రోజులకు మించి HM సెలవు పెడితే FACకు దరఖాస్తు చేసుకొనవచ్చును. FAC HM అన్ని రకాల HM బాధ్యతలు వారితో సమానముగా నిర్వహించవచ్చును.
 
 
*ప్రశ్న:*
ఉన్నత పాఠశాలల్లో 9:30కు మొదటి బెల్, 9:35కు రెండవ బెల్, 9:35 నుండి 9:45 వరకు అసెంబ్లీ నిర్వహించబడును. 9:45కు మూడవ బెల్ మరియు మొదటి పీరియడ్ ప్రారంభమగును, ఉపాధ్యాయుడు 9:45కు రావచ్చునా?
 
*జవాబు:*
కాదు. ఉపాధ్యాయుడు విధిగా అసెంబ్లీకు హాజరు కావలెను. School Assembly is part and parcel of curriculam. అసెంబ్లీకి రానిచో ఆరోజు హాఫ్ డే సి.ఎల్.గా నోట్ చేయాలి (Rc.No. 529/E2/97, Dt, 16-7-1997)
 
*ప్రశ్న:*
నెలలో మూడుసార్లు లేట్ పర్మిషన్ తీసుకోవచ్చునా?
 
*జవాబు:*
ఉపాధ్యాయులకు ఈ సౌకర్యం లేదు.
 
*ప్రశ్న:*
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 15 రోజుల సెలవుపై ఆన్డ్యూటీ పై వెళ్ళినప్పుడు ఎవరికి ఇన్చార్జి ఇచ్చి వెళ్ళాలి
 
*జవాబు:*
తప్పనిసరిగా సీనియర్ ఉపాధ్యాయునికి ఇన్చార్జి ఇచ్చి
వెళ్ళాలి. అతను వద్దంటే తదుపరి సీనియర్ కు ఇవ్వాలి.
 
*ప్రశ్న:*
ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రతి ఉపాధ్యాయుడు కనీసం  ఎన్ని  పిరియడ్లు బోధించాలి?
 
*జవాబు:*
కనీసం 24 లేకపోతే జీతం ఇవ్వరాదు (AER-R 77 )
 
*ప్రశ్న*
LFL HMలు గెజిటెడ్ HM గా పదోన్నతి పొందవచ్చునా?
 
*జవాబు:*
డిగ్రీ, బి.ఇడి మరియు శాఖాపరమైన పరీక్షలలో కృతార్థత ఉంటే గెజిటెడ్ HMకు పదోన్నతి పొందవచ్చును. కానీ నిర్ణీత  అర్హతలున్ననూ జూనియర్ లెక్చరరకు అవకాశములేదు.
 
*ప్రశ్న:*
ప్రభుత్వ /మండల/జడ్పి   స్కూళ్ళలో పనిచేయు SGT/LPలు 6/12/18 సం॥ల స్కేలు పొందుటకు ఎటువంటి అదనపు అర్హతలు కావాలి?
 
*జవాబు:*
ఎటువంటి అదనపు అర్హతలు అవసరం లేదు, నియామకపు అర్హతలుంటే సరిపోవును
 
*ప్రశ్న:*
ఫైవారు 24 సం|ల స్నేలు పొందాలంటే ఏఏ అర్హతలు ఉండాలి?
 
*జవాబు:*
HM పదోన్నతికి కావలసిన డిగ్రీ, బి.ఇడి పండిత శిక్షణలు మరియు సంబంధిత శాఖాపరీక్షలు ఉత్తీర్ణత పొందాలి.
 
*ప్రశ్న:*
నేరుగా నియామకము పొందిన స్కూల్ అసిస్టెంట్ కు 45 సం॥లు వయస్సు దాటితే శాఖాపరమైన వరీక్షల కృతార్ధత నుండి పదోన్నతికి 12/18/24 సం॥ల స్కేలు పొందుటకు మినహాయింపు ఉన్నదా?
 
*జవాబు:*
అవును. .
 
*ప్రశ్న*
ఇంటర్/డిగ్రీలో హిందీ 2వ భాషగా కలవారు పదోన్నతికి  ఏయేశాఖాపరమైన పరీక్షలు వ్రాయాలి
 
 *జవాబు:*
 పేపర్ కోడ్ 037, స్పెషల్ తెలుగు లాంగ్వేజ్ టెస్ట్ కృతార్ధత అవ్వాలి
ప్రశ్న:*
ఐటీ లో వికలాంగ ఉద్యోగికి ప్రత్యేక తగ్గింపు ఉందా?
 
* జవాబు:*
80 U కింద డాక్టర్ ఇచ్చిన ధ్రువ పత్రం ను బట్టి 40% వైకల్యం గల వారికి 75000రూ, 80% కన్నా ఎక్కువ వైకల్యం కలవారికి 1,25,000రూ వరకు మినహాయింపు లభిస్తుంది.
 
* ప్రశ్న:*
నేను తెలుగు పండిట్ గా పనిచేస్తున్నాను.నేను BA సంస్కృతం మరియు శిక్షా శాస్త్రి పాస్ అయ్యాను.నేను SA సంస్కృతం పోస్టుకి అర్హుడనేనా?
 
*జవాబు:* అర్హులే.
 
*ప్రశ్న:*
ఒక టీచర్ ప్రసూతి సెలవు లో ఉంది.బదిలీల లో పాల్గొని మరో స్కూల్ కోరుకుంది.ఆమె నూతన స్కూల్లో ఎప్పుడు చేరాలి?
 
 *జవాబు*:
ఆమె అందరితో పాటు relieve కావాలి.ప్రసూతి సెలవు పూర్తి ఐన పిమ్మట స్కూల్లో జాయిన్ అవుతానని కొత్త స్కూల్ HM కి, MEO కి తెలియజేయాలి.ప్రసూతి సెలవు పూర్తి ఐన పిమ్మట కొత్త స్కూల్లో జాయిన్ అవ్వాలి.
 
*ప్రశ్న:*
పదోన్నతి కల్పిస్తే, ప్రస్తుతం మనకి ఎన్ని జూనియర్ లెక్చరర్ పోస్టులు వస్తాయి?
 
*జవాబు:*
4385 లో 45% అనగా 1973 జూనియర్ లెక్చరర్ పోస్టులు పదోన్నతి పై టీచర్ల కి ఇవ్వాలి.
 
*ప్రశ్న*:
ఒక టీచర్ 2014 ఆగస్టు లో సస్పెండ్ అయి, 2016 నవంబర్ లో విధులలో చేరాడు.అతనికి fixation ఎప్పటి నుంచి చేయాలి?
 
*జవాబు:*
జీఓ.46 తేదీ:30.4.15 ప్రకారం కేవలం 1.7.13 నాడు సస్పెండ్ లో ఉన్న వారికి మాత్రమే తిరిగి నియామకం పొందిన తేదీ నుండి fixation చేస్తారు.మీరు 1.7.13 న విధులలో ఉన్నారు కాబట్టి మీకు 1.7.13 నుండే fixation చేయాలి.
 
 
*ప్రశ్న:*
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఐటీ లో మినహాయింపు ఏమైనా ఉందా?
 
*జవాబు*:
తీవ్ర రోగాల చికిత్స కై చేసిన వాస్తవ ఖర్చు లో 40,000రూ వరకు 80DDB కింద మినహాయింపు కలదు.దీని కోసం డాక్టర్ ధ్రువ పత్రం సమర్పించాలి.
 
*.ప్రశ్న:*
ఏ  టీచర్లు కామన్ సర్వీసు రూల్స్ పరిధిలోకి వస్తారు??
► జవాబు:
ప్రస్తుతం పంచాయతీ రాజ్ టీచర్లు మరియు ప్రభుత్వ పాఠశాలల టీచర్లు మాత్రమే వస్తారు.
 
* ప్రశ్న:*
నేను అంతర. జిల్లా బదిలీల లో వచ్చాను.నా సీనియారిటీ కి రక్షణ ఉంటుందా?
 
*జవాబు*:
మీరు 610జీఓ ద్వారా వస్తే రక్షణ ఉంటుంది. సాధారణ అంతర్ జిల్లా బదిలీల లో వస్తే మాత్రం కొత్త జిల్లాలో చేరిన తేదీ నుంచి మాత్రమే సీనియారిటీ లెక్కించబడుతుంది.
 
 
* ప్రశ్న:*
నేను,మరొక టీచర్ ఇద్దర0 ఒకే DSC లో సెలెక్ట్ అయ్యాము.ఒకే స్కూల్లో చేరాము.ఎవరు HM భాద్యతలు తీసుకోవాలి?
 
*జవాబు:*
మెరిట్ కమ్ రోస్టర్ లో ఎవరు ముందుంటే వారే సీనియర్. సీనియర్ ఐన టీచర్ HM గా చేయాలి.
 
*ప్రశ్న:*
17 ఇయర్స్ సర్వీస్ గల టీచర్ వైద్య కారణం పై PF లోను తీసుకున్నాడు.6 నెలలు గడిచింది.గృహ నిర్మాణం నిమిత్తం పార్ట్ ఫైనల్ తీసుకోవటానికి వీలుందా?
 
*జవాబు:*
మీ మొత్తాన్ని పార్ట్ ఫైనల్ కింద మార్చుకొని మాత్రమే 6 నెలల తరువాత పార్ట్ ఫైనల్ పొందే అవకాశం ఉంది
 
*★1) స్థానికతను ఎలా నిర్ణయిస్తారు..?*
జి.ఓ.నెం:674,తేదీ: 20-10-1975,జి.ఓ నెం:168, తేదీ:10-03-1977 ప్రకారం ఒక వ్యక్తి 4వ తరగతి నుండి 10 వరకు గల 7 సంవత్సరాల కాలంలో ఏ జిల్లాలో ఎక్కువ చదివితే అది అతని స్థానిక జిల్లాగా గుర్తించాలి.
 
*★2) EOL పెట్టిన కారణంగా ఇంక్రిమెంట్ నెల మారితే తిరిగి పాత ఇంక్రిమెంట్ నెల ఎలా పొందవచ్చు..?*
జి.ఓ.నెం:43, తేదీ: 05-02-1976 ప్రకారం వైద్య కారణాలతో EOL లో ఉన్నప్పటికీ సంబందిత వైద్య ద్రువపత్రాలతో డీఈఓ గారి ద్వారా CSE కి ప్రపోసల్స్ పంపి అనుమతి పొందితే పాత ఇంక్రిమెంట్ నెల కొనసాగుతుంది. 180 రోజులకు మించిన EOL అయితే విద్యాశాఖ కార్యదర్శి నుండి అనుమతి పొందాలి.
 
*★3) EL’s ను ఉద్యోగి ఖాతాలో ఎలా జమ చేస్తారు..?*
01-01-1978 ముందు వరకు డ్యూటీ పీరియడ్ అయిన  తరువాతే EL’s జమ చేసేవారు. జి.ఓ.నెం:384,తేదీ: 05-11-1977 నుండి జనవరి 1న ఒకసారి, జులై 1న ఒకసారి అడ్వాన్స్ గా EL’S క్రెడిట్ చేస్తున్నారు. నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ వారికి జనవరి 1న 15, జులై 1న మరో 15 EL’S సర్వీస్ ఖాతాలో జమ చేయగా, వెకేషన్ డిపార్ట్మెంట్ వారికి జనవరి 1న 3, జులై 1న మరో 3 EL’S సర్వీస్ ఖాతాలో జమ చేస్తారు.
 
*★4) లీవ్ నాట్ డ్యూ అంటే ఏమిటి..?*
ఒక ఉద్యోగి లీవ్స్ ఖాతాలో హాఫ్ పే లీవ్స్ గానీ EL’S గానీ లేనపుడు ఉద్యోగికి కల్పించబడిన సౌకర్యమే లీవ్ నాట్ డ్యూ. ఒక ఉద్యోగికి అత్యవసరంగా లీవ్స్ అవసరం అయ్యి ఖాతాలో హాఫ్ పే లీవ్స్ గానీ EL’S గానీ లేనపుడు భవిష్యత్తులో ఉద్యోగికి వచ్చే హాఫ్ పే లీవ్స్ ను లెక్కించి 180 రోజుల వరకు వైద్య కారణాల నిమిత్తం లీవ్ నాట్ డ్యూ మంజూరు చేస్తారు. లీవ్ నాట్ డ్యూ గా మంజూరు చేసిన సెలవుల ను హాఫ్ పే లీవ్స్ ఉద్యోగి ఖాతాలో జమ కాగానే తగ్గిస్తారు.
 
*★5) ఆగష్టు-15,జనవరి-26న జెండా వందనానికి హాజరు కాకపోతే చర్యలు ఉంటాయా..?*
ఆగష్టు-15, జనవరి-26 తేదీలు జాతీయ సెలవు దినాలు కావున రిజిస్టర్ లో సంతకం అవసరం లేదు. అనారోగ్యం ఉంటే జెండా వందనానికి హాజరు కాకుండా ఉండవచ్చు. అయితే సివిల్ సర్వీస్ కోడ్ ప్రకారం తగిన కారణాలు లేకుండా జెండా వందనానికి హాజరు కాకపోతే పై అధికారులు చర్యలు తీసుకోవచ్చు.
 
*★6) CPS ఉద్యోగులు basic pay + DA లో 10%కు అదనంగా మినహాయించవచ్చా..?*
ఉద్యోగి బేసిక్ పే + డి.ఏ లో 10% ను మాత్రమే సిపియస్ డిడక్షన్ చేయాలి. దీనికి సమానంగా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ జమ చేస్తుంది. వాలంటరీ గా కంట్రిబ్యూట్ చేసి టైర్-1 అకౌంట్లో అమౌంట్కు జత చేయవచ్చు. టాక్స్ మినహాయింపు పొందవచ్చు. వాలంటరీ కాంట్రిబ్యూషన్  కు మ్యాచింగ్ గ్రాంటు జత చేయబడదు.
 
*★7) మెటర్నిటీ లీవ్స్ వేసవి సెలవులలో  పెడితే కౌంట్ అవుతాయా..?*
FR 101(a) ప్రకారం మెటర్నిటీ లీవ్ కు ముందు గానీ తరువాత గానీ వేసవి సెలవులు ఉంటే మొత్తం 180 రోజులను మెటర్నిటీ లీవ్ గానే భావించాలి.
 
*★8) రిటైర్మెంట్ తరువాత  ఇంక్రిమెంట్ ఉంటే లెక్కిస్తారా..?*
 జి.ఓ.నెం:235,తేదీ:27-10-1998 ప్రకారం రిటైర్మెంట్ అయ్యిన మరుసటి రోజు ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే ఆ ఇంక్రి మెంట్ ను నోషనల్ గా సాంక్షన్ చేసి దానిని ఇంక్రిమెంట్ బెనిఫిట్స్ లెక్కింపులో పరిగణలోనికి తీసుకోవాలి.
 
*★9) 5 సంవత్సరాల 8 నెలలు పూర్తి చేసిన ఉద్యోగికి ఎన్ని అర్ధ వేతన సెలవులు వస్తాయి..?*
సమాధానం డ్యూటీ పీరియడ్ ఒక సంవత్సరం పూర్తి అయిన తరువాతనే అర్ధవేతన సెలవులు ఉద్యోగి ఖాతాకు జమ చేయబడతాయి. సంవత్సరానికి 20 చొప్పున 5 సంవత్సరాలకు 100 అర్ధవేతన సెలవులు అర్ధవేతన సెలవుల ఖాతాకు జమ చేస్తారు. –
 
*★10) ప్రభుత్వ సెలవు  దినాలకు ముందు తరువాత కమ్యూటేడ్ లీవ్స్ పెట్టవచ్చా..?*
జి.ఓ.నెం:319,తేదీ:18-12-1981 ప్రకారం వైద్య కారణాలపై వినియోగించుకున్న సెలవుకు ముందు గానీ తరువాత ఉన్న ప్రభుత్వ సెలవులను మినహాయించవచ్చు. కాబట్టి ప్రభుత్వ సెలవును కమ్యూ టెడ్ సెలవుగా పరిగణించకూడదు. అయితే ఎన్ని రోజులు కమ్యూటెడ్ – లీవ్స్ పెట్టుకుంటే అన్ని పనిదినాలకు మాత్రమే వైద్య ధ్రువ పత్రాలు సమర్పించాలి.
21. ప్రశ్న❓:*
ఒక ఉపాధ్యాయుడు సస్పెన్షన్ ఐతే,అతనికి PRC వర్తించదా??
*జవాబు✅ :*
అతను సస్పెన్షన్ కి ముందు రోజు ఉన్న బేసిక్ పే ఆధారంగా PRC చేఇ0చుకోవచ్చు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*22.  ప్రశ్న❓:*
చైల్డ్ కేర్ లీవ్ మంజూరు విషయంలో  ఉపాధ్యాయినిల వేతనంలో కోత విధిస్తారా ?
*జవాబు✅ :*
 G.O.Ms.No.209 Fin తేది:21-11-2016 ప్రకారం చైల్డ్ కేర్ లీవ్ సెలవును ముందుగా డి.డి.వో తో మంజూరు చేయించుకున్న తరువాత వాడుకోవాలి.మంజూరు ఉత్తర్వులిచ్చి,ఎస్.ఆర్ నందు నమోదుచేసి ఆ నెల పూర్తి వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాల్సిన బాధ్యత డి.డి.ఓ లకే ఉంటుంది.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*23.  ప్రశ్న❓:*
స్కూల్ ఇంచార్జ్ బాధ్యతలు హెచ్.ఏం ఎవ్వరికైనా ఇవ్వవచ్చునా ? లేక సీనియారిటీ ప్రకారమే ఇవ్వాలా ?
*జవాబు✅ :*
డి.ఎస్.సి ఉత్తర్వుల సంఖ్య Rc.2409/C3-1/2004 తేది :27.01.2005 ప్రకారం ప్రధానోపాధ్యాయుని అర్హతలు కలిగిన వారిలో సీనియరు ఉపాధ్యాయుడిని మాత్రమే ఇంచార్జ్ గా లేదా ఎఫ్.ఏ.సి.గా నియమించాలి.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*24. ప్రశ్న❓:*
 ఎస్.జి.టి ఉపాధ్యాయుడు 24 సం॥ స్కేలు పొందుటకు డిపార్ట్మెంటల్ పరీక్షల ఉత్తీర్ణత సాధించాలా ?
*జవాబు✅ :*
G.O.Ms.No.38 Fin తేది:15.04.2015 ప్రకారం 24 సం॥ స్కేలు పొందుటకు ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ పరీక్షలు (GOT&EOT) ఉత్తీర్ణత సాధించాలి
°°°°°°°°°°°°°°°°°°°°°°
*25. ప్రశ్న❓:*
వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటే ఎంత సర్వీస్ పూర్తిచేసి ఉండాలి? పూర్తి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయా?
*జవాబు✅ :*
ఏ.పి.రివైజ్డ్ పెన్షన్ రూల్స్-1980 లోని రూల్ 43 ప్రకారంగా 20 సం॥ సర్వీసు (అసాధారణ సెలవు కాకుండా) పూర్తిచేసిన వారికి వాలంటరి రిటైర్మెంట్ అర్హత లభిస్తుంది.రిటైర్మెంట్ ప్రయోజనాలన్నీ వర్తిస్తాయి.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*26 ప్రశ్న❓:*
 ముగ్గురు సంతానం ఉన్న ఉపాధ్యాయిని హిస్టరక్టమి ఆపరేషన్ చేయించుకుంటే 45 రోజుల సెలవుకు అర్హత ఉన్నదా ?
*జవాబు✅ :*
G.O.Ms.No.52 Fin తేది:1.4.2011 లో సంతానం ఇంతే మంది ఉండాలన్న షరతు ఏమీలేదు.అందుచేత సంతానం సంఖ్యతో నిమిత్తం లేకుండా 45 రోజుల సెలవు పొందవచ్చును.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*27.  ప్రశ్న❓:*
నేను SA గా పదోన్నతి పొందాను.నాకు ప్రస్తుతం 56 ఇయర్స్.GOT పాస్ అయ్యాను.నాకు 12 ఇయర్స్ స్కేల్ వస్తుందా??
*జవాబు✅ :*
మెమో.21073 తేదీ:21.2.2009 ప్రకారం మీకు 12 ఇయర్స్ స్కేల్ ఇవ్వటం సాధ్యపడదు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*28. ప్రశ్న
నేను 19 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను.వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి అవకాశం ఉందా??
*జవాబు✅ :*
వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి 20 ఇయర్స్ సర్వీసు తప్పక ఉండాలి.ఐతే 20 ఇయర్స్ సర్వీసు లేకుండానే ఒక టీచర్ కి జీఓ.51  తేదీ:24.8.13 ప్రకారం వాలంటరి రిటైర్మెంట్ కి అవకాశం కల్పించారు. మీరు కూడా ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు పొందవలసి ఉంటుంది.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*29. ప్రశ్న
11 రోజులను కూడా సరెండర్  చేసుకోవచ్చా??
*జవాబు✅ :*
జీఓ.334 తేదీ:28.9.1977 ప్రకారం 11 రోజులు కూడా సరెండర్ చేసుకొని నగదు పొందవచ్చు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*30.  ప్రశ్న❓:*
సరెండర్ కాలానికి ఏవేవి చెల్లించబడతాయి??
*జవాబు✅ :*
జీఓ.172 తేదీ:1.7.74 ప్రకారం ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్, అడిషనల్ ఇంక్రిమెంట్ లు,స్పెషల్ పే చెల్లించబడతాయి.ఐతే IR మాత్రం చెల్లించబడదు.
 
*31.  ప్రశ్న❓:*
పెన్షనర్ మరణించినపుడు కుటుంబ సభ్యులు ఏమి చెయ్యాలి??
*జవాబు✅ :*
పెన్షనర్ మరణించిన వెంటనే కుటుంబ సభ్యులు ట్రెజరీ లో తెలియపరచాలి.తెలియ పరచకుంటే మరల లైఫ్ సెర్టిఫికెట్(ప్రస్తుతం డిజిటల్ బయోమెట్రిక్/ఐరిష్)ఇచ్చే వరకు నెల నెలా పెన్షన్ అకౌంట్ లో పడుతూ ఉంటుంది. ఎటిఎం తో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కానీ భాద్యత గల పౌరులుగా అలా చేయడం తప్పు.రెండవది ప్రభుత్వంనకు ఈ విషయం తెలిసినా లేదా ఎవరైనా కంప్లైంట్ చేసినా క్రిమినల్ కేసులు పెడతారు. అందువల్ల వెంటనే ట్రెజరీలో తెలియపరచాలి.చనిపోయిన రోజు వరకు పెన్షన్ లెక్కకట్టి అకౌంట్ లో వేస్తారు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*32.  ప్రశ్న❓:*
PRC లో ఒకసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మరల మార్చుకోవచ్చా??
*జవాబు✅ :*
వెనుకటి తేదీ నుంచి వేతనం మారిన సందర్భంలో తప్ప,సాధారణంగా ఒకసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మార్చుకొనే అవకాశం లేదు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*33.  ప్రశ్న❓:*
స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ఎవరికి ఇస్తారు??
*జవాబు✅ :*
ఒక ఉద్యోగి తాను పొందుతున్న వేతన స్కేలు గరిష్టం చేరిన తరువాత ఇంకా సర్వీసు లో ఉంచి ఇంక్రిమెంట్లు మంజూరు చేయవలసి ఉన్నప్పుడు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తారు.2015 PRC లో 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు కి అవకాశం కల్పించారు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*34.  ప్రశ్న❓:*
వేసవి సెలవుల మధ్యలో ప్రసవించిన ప్రసూతి సెలవు ఎలా మంజూరు చేస్తారు??
*జవాబు✅ :*
వేసవి సెలవుల మధ్యలో ప్రసవించిన, ప్రసవించిన రోజు నుండి 180 రోజుల వేసవి సెలవులు పోను మిగిలిన రోజులకు ప్రసూతి సెలవు మంజూరు చేస్తారు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*35.  ప్రశ్న❓:*
ఐటీ రిటర్న్ అందరూ సమర్పించాలా??
*జవాబు✅ :*
2,50,000రూ ఆదాయం దాటిన వారందరూ ఆగస్టు 31లోగా రిటర్న్ దాఖలు చెయ్యాలి. వేతన ఆదాయం మాత్రమే ఉన్నవారు ITR–1 ఫారంలో ఈ–ఫైలింగ్ చేయవచ్చు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*36.  ప్రశ్న❓:*
నాకు ఈ నెలలో ఇంక్రిమెంట్ ఉంది.కానీ మెడికల్ లీవు పెట్టాను.నాకు ఈ నెలలో ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారా??చెయ్యరా??
*జవాబు✅ :*
జీఓ.192 తేదీ:1.7.74 ప్రకారం మీరు ML లో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్ ఇవ్వటం కుదరదు.మీరు ఎపుడు జాయిన్ ఐతే అప్పుడు నుండి మాత్రమే ఇంక్రిమెంట్ ఇవ్వటం జరుగుతుంది.అప్పటి వరకు పాత జీతమే వస్తుంది.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*37.  ప్రశ్న❓:*
నాకు ఉద్యోగం రాకముందు పాప ఉంది. ఉద్యోగం లో చేరిన తరువాత ఒకసారి ప్రసూతి సెలవు వాడుకున్నాను.మరొక పర్యాయం ప్రసూతి సెలవు వాడుకోవచ్చునా??
*జవాబు✅ :*
ఇద్దరు జీవించి ఉన్న పెద్ద పిల్లలు వరకు మాత్రమే ప్రసూతి సెలవు మంజూరు చేయబడుతుంది.బిడ్డ పుట్టినది ఉద్యోగం రాక పూర్వమా?వచ్చిన తరువాతా?అనే దానితో నిమిత్తం లేదు.కావున మూడవ బిడ్డకి ప్రసూతి సెలవు కి మీకు అవకాశం లేదు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*38.  ప్రశ్న❓:*
SSC డూప్లికేట్ సర్టిఫికేట్ పొందటానికి ఏమి చెయ్యాలి??
*జవాబు✅ :*
అభ్యర్థి దరఖాస్తు,250రూ ల చలానా,నోటరీ చే దృవీకరించిన 50రూ,ల అఫిడవిట్, అభ్యర్థి డిక్లరేషన్, ssc రికార్డు నకలు జతపరచి ప్రభుత్వ పరీక్షల సంచాలకులు వారికి పంపుకోవాలి.
°°°°°°°°°°°°°°°°°°°°°°
 *39.  ప్రశ్న❓:*
ఉద్యోగి మరణించిన సందర్భంలో CPS డబ్బులు ఎలా తీసుకోవాలి??
*జవాబు✅ :*
103-జీడీ ఫారం లో సంబంధిత పత్రాలు జాతపరచాలి. చివరి నెల చందా చెల్లించిన DDO ద్వారా ట్రెజరీ అధికారులు ద్వారా పి ఆర్ ఏ ముంబై కి పంపుకుంటే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబడతాయి.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*40.  ప్రశ్న❓:*
ఉపాధ్యాయులకు ఒక రోజు కూడ మెడికల్ లీవ్ మంజూరు చేయవచ్చునా..?
*జవాబు✅ :*
చేయవచ్చు. APLR-1933 రూల్స్ 13 మరియు 15 బి ప్రకారం వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు లేదా అర్థవేతన సెలవు ఒక్క రోజు కూడా మంజూరు చేయవచ్చు.కనీస పరిమితి లేదు. అయితే ఒక్క రోజైనా సెలవు కొరకు ఫారం-A, జాయినింగ్ కొరకు ఫారం-B వైద్య ధ్రువపత్రాలు సమర్పించాలి
41. ❓ప్రశ్న:*
చైల్డ్ కేర్ లీవ్ ఇద్దరు పిల్లలకు చెరో 60 రోజులు వాడుకోవచ్చా??
*✅జవాబు:*
అలా కుదరదు.ఇద్దరు పెద్ద పిల్లలు కి 18 ఇయర్స్ నిండే లోపు 60 రోజులు మాత్రమే వాడుకోవాలి.అనగా టీచర్ కి 60 రోజులు అని అర్థం.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*42. ❓ప్రశ్న:*
పండుగ అడ్వాన్స్ ఎవరికి ఇస్తారు??
*✅జవాబు:*
జీఓ.167 తేదీ:20.9.17 ప్రకారం వేతన స్కేల్ 26600-77030 లేదా అంతకంటే తక్కువ స్కేల్ గల ఉద్యోగుల కి 7500రూ మరియు నాల్గవ తరగతి ఉద్యోగుల కి 5000రూ పండుగ అడ్వాన్స్ గా చెల్లిస్తారు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*43. ❓ప్రశ్న:*
నాకు ఉద్యోగం రాకముందు పాప ఉంది. ఉద్యోగం లో చేరిన తరువాత ఒకసారి ప్రసూతి సెలవు వాడుకున్నాను.మరొక పర్యాయం ప్రసూతి సెలవు వాడుకోవచ్చునా??
*✅జవాబు:*
ఇద్దరు జీవించి ఉన్న పెద్ద పిల్లలు వరకు మాత్రమే ప్రసూతి సెలవు మంజూరు చేయబడుతుంది.బిడ్డ పుట్టినది ఉద్యోగం రాక పూర్వమా?వచ్చిన తరువాతా?అనే దానితో నిమిత్తం లేదు.కావున మూడవ బిడ్డకి ప్రసూతి సెలవు కి మీకు అవకాశం లేదు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*44. ❓ప్రశ్న:*
SSC డూప్లికేట్ సర్టిఫికేట్ పొందటానికి ఏమి చెయ్యాలి??
*✅జవాబు:*
అభ్యర్థి దరఖాస్తు,250రూ ల చలానా,నోటరీ చే దృవీకరించిన 50రూ,ల అఫిడవిట్, అభ్యర్థి డిక్లరేషన్, ssc రికార్డు నకలు జతపరచి ప్రభుత్వ పరీక్షల సంచాలకులు వారికి పంపుకోవాలి.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*45. ❓ప్రశ్న:*
ఉద్యోగి మరణించిన సందర్భంలో CPS డబ్బులు ఎలా తీసుకోవాలి??
*✅జవాబు:*
103-జీడీ ఫారం లో సంబంధిత పత్రాలు జాతపరచాలి. చివరి నెల చందా చెల్లించిన ddo ద్వారా ట్రెజరీ అధికారులు ద్వారా పి ఆర్ ఏ ముంబై కి పంపుకుంటే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబడతాయి.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*46. ❓ప్రశ్న:*
ఉపాధ్యాయులకు ఒక రోజు కూడ మెడికల్ లీవ్ మంజూరు చేయవచ్చునా..?
*✅జవాబు:*
చేయవచ్చు. APLR-1933 రూల్స్ 13 మరియు 15 బి ప్రకారం వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు లేదా అర్థవేతన సెలవు ఒక్క రోజు కూడా మంజూరు చేయవచ్చు.కనీస పరిమితి లేదు. అయితే ఒక్క రోజైనా సెలవు కొరకు ఫారం-A, జాయినింగ్ కొరకు ఫారం-B వైద్య ధ్రువపత్రాలు సమర్పించాలి.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*47. ❓ప్రశ్న:*
చైల్డ్ కేర్ లీవ్ ఇద్దరు పిల్లలకు చెరో 60 రోజులు వాడుకోవచ్చా??
*✅జవాబు:*
అలా కుదరదు.ఇద్దరు పెద్ద పిల్లలు కి 18 ఇయర్స్ నిండే లోపు 60 రోజులు మాత్రమే వాడుకోవాలి.అనగా టీచర్ కి 60 రోజులు అని అర్థం.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*48. ప్రశ్న:*
అర్ధజీతపు సెలవు కాలానికి HRA సగమే చెల్లిస్తారా??
*✅జవాబు:*
జీఓ.28 తేదీ:9.3.2011 ప్రకారం 6 నెలల వరకు HRA పూర్తిగా చెల్లించాలి.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*49. ప్రశ్న:*
నా వయస్సు 57 ఇయర్స్.నేను ఇప్పుడు APGLI ప్రీమియం పెంచవచ్చా??
*✅జవాబు:*
జీఓ.36 తేదీ:5.3.2016 ప్రకారం 55 ఇయర్స్ తర్వాత ప్రీమియం పెంచటం కుదరదు.బాండ్ కూడా ఇవ్వరు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*50. ❓ప్రశ్న:*
చైల్డ్ కేర్ లీవ్ సంవత్సరం లో 20 రోజులు మాత్రమే వాడుకోవాలా??
*✅జవాబు:*
జీఓ.132 తేదీ:6.7.2016 ప్రకారం లీవు మూడు సార్లు తక్కువ కాకుండా వాడుకోవాలని మాత్రమే ఉన్నది.
 
*41. ప్రశ్న:*
చైల్డ్ కేర్ లీవ్ ఇద్దరు పిల్లలకు చెరో 60 రోజులు వాడుకోవచ్చా??
*✅జవాబు:*
అలా కుదరదు.ఇద్దరు పెద్ద పిల్లలు కి 18 ఇయర్స్ నిండే లోపు 60 రోజులు మాత్రమే వాడుకోవాలి.అనగా టీచర్ కి 60 రోజులు అని అర్థం.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*42. ❓ప్రశ్న:*
పండుగ అడ్వాన్స్ ఎవరికి ఇస్తారు??
*✅జవాబు:*
జీఓ.167 తేదీ:20.9.17 ప్రకారం వేతన స్కేల్ 26600-77030 లేదా అంతకంటే తక్కువ స్కేల్ గల ఉద్యోగుల కి 7500రూ మరియు నాల్గవ తరగతి ఉద్యోగుల కి 5000రూ పండుగ అడ్వాన్స్ గా చెల్లిస్తారు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*43. ❓ప్రశ్న:*
నాకు ఉద్యోగం రాకముందు పాప ఉంది. ఉద్యోగం లో చేరిన తరువాత ఒకసారి ప్రసూతి సెలవు వాడుకున్నాను.మరొక పర్యాయం ప్రసూతి సెలవు వాడుకోవచ్చునా??
*✅జవాబు:*
ఇద్దరు జీవించి ఉన్న పెద్ద పిల్లలు వరకు మాత్రమే ప్రసూతి సెలవు మంజూరు చేయబడుతుంది.బిడ్డ పుట్టినది ఉద్యోగం రాక పూర్వమా?వచ్చిన తరువాతా?అనే దానితో నిమిత్తం లేదు.కావున మూడవ బిడ్డకి ప్రసూతి సెలవు కి మీకు అవకాశం లేదు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*44. ❓ప్రశ్న:*
SSC డూప్లికేట్ సర్టిఫికేట్ పొందటానికి ఏమి చెయ్యాలి??
*✅జవాబు:*
అభ్యర్థి దరఖాస్తు,250రూ ల చలానా,నోటరీ చే దృవీకరించిన 50రూ,ల అఫిడవిట్, అభ్యర్థి డిక్లరేషన్, ssc రికార్డు నకలు జతపరచి ప్రభుత్వ పరీక్షల సంచాలకులు వారికి పంపుకోవాలి.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*45. ❓ప్రశ్న:*
ఉద్యోగి మరణించిన సందర్భంలో CPS డబ్బులు ఎలా తీసుకోవాలి??
*✅జవాబు:*
103-జీడీ ఫారం లో సంబంధిత పత్రాలు జాతపరచాలి. చివరి నెల చందా చెల్లించిన ddo ద్వారా ట్రెజరీ అధికారులు ద్వారా పి ఆర్ ఏ ముంబై కి పంపుకుంటే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబడతాయి.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*46. ❓ప్రశ్న:*
ఉపాధ్యాయులకు ఒక రోజు కూడ మెడికల్ లీవ్ మంజూరు చేయవచ్చునా..?
*✅జవాబు:*
చేయవచ్చు. APLR-1933 రూల్స్ 13 మరియు 15 బి ప్రకారం వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు లేదా అర్థవేతన సెలవు ఒక్క రోజు కూడా మంజూరు చేయవచ్చు.కనీస పరిమితి లేదు. అయితే ఒక్క రోజైనా సెలవు కొరకు ఫారం-A, జాయినింగ్ కొరకు ఫారం-B వైద్య ధ్రువపత్రాలు సమర్పించాలి.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*47. ❓ప్రశ్న:*
చైల్డ్ కేర్ లీవ్ ఇద్దరు పిల్లలకు చెరో 60 రోజులు వాడుకోవచ్చా??
*✅జవాబు:*
అలా కుదరదు.ఇద్దరు పెద్ద పిల్లలు కి 18 ఇయర్స్ నిండే లోపు 60 రోజులు మాత్రమే వాడుకోవాలి.అనగా టీచర్ కి 60 రోజులు అని అర్థం.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*48. ❓ప్రశ్న:*
అర్ధజీతపు సెలవు కాలానికి HRA సగమే చెల్లిస్తారా??
*✅జవాబు:*
జీఓ.28 తేదీ:9.3.2011 ప్రకారం 6 నెలల వరకు HRA పూర్తిగా చెల్లించాలి.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*49. ❓ప్రశ్న:*
నా వయస్సు 57 ఇయర్స్.నేను ఇప్పుడు APGLI ప్రీమియం పెంచవచ్చా??
*✅జవాబు:*
జీఓ.36 తేదీ:5.3.2016 ప్రకారం 55 ఇయర్స్ తర్వాత ప్రీమియం పెంచటం కుదరదు.బాండ్ కూడా ఇవ్వరు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*50. ❓ప్రశ్న:*
చైల్డ్ కేర్ లీవ్ సంవత్సరం లో 20 రోజులు మాత్రమే వాడుకోవాలా??
*✅జవాబు:*
జీఓ.132 తేదీ:6.7.2016 ప్రకారం లీవు మూడు సార్లు తక్కువ కాకుండా వాడుకోవాలని మాత్రమే ఉన్నది.
*61. ❓ప్రశ్న:*
ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ మరియు అదనపు విద్యా అర్హతలకి ఇంక్రిమెంట్లు ఎప్పటి నుంచి నిలుపుదల చేశారు??
*✅జవాబు:*
వీటిని 98 వేతన స్కేల్స్ లో నిలుపుదల చేశారు.ఈ నిలుపుదల 1.7.98 నుండి అమలు చేశారు.1.7.98 ముందు వారికి ఈ ఇంక్రిమెంట్లు వర్తిస్తాయి.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*62. ❓ప్రశ్న:*
ఐటీ లో ధార్మిక సంస్థ లకి ఇచ్చే విరాళాలు పై ఎంత మినహాయింపు వర్తిస్తుంది??
*✅జవాబు:*
కొన్ని సంస్థలకి 100% , మరికొన్ని సంస్థ లకి 50% పన్ను మినహాయింపు వర్తిస్తుంది.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*63. ❓ప్రశ్న:*
ప్రసూతి సెలవును ఏదైనా సెలవు తో కలిపి వాడుకోవచ్చునా??
*✅జవాబు:*
FR.101(ఎ)ప్రకారం మెడికల్ సెర్టిఫికెట్ జతపరచి అర్హత గల సెలవును ప్రసూతి సెలవుతో కలిపి వాడుకోవచ్చు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*64. ❓ప్రశ్న:*
పిల్లల ఫీజు రీ- అ0బర్సుమెంట్ పెంచిన ఉత్తర్వులు వెలువడ్డాయా??
*✅జవాబు:*
మెమో.7215 తేదీ:2.5.12 ప్రకారం 4వ తరగతి మరియు నాన్-గజిటెడ్ ఉద్యోగులు అందరికీ ఈ సౌకర్యం వర్తిస్తుంది.2015 prc లో దీనిని 2500రూ కి పెంచారు.కానీ ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు.ప్రస్తుతం ఒక్కో పిల్లవాడికి 1000రూ మాత్రమే ఇస్తారు. ఇద్దరు పిల్లలకి మాత్రమే వర్తిస్తుంది.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*65. ❓ప్రశ్న:*
OH, ఆదివారం లను కూడా suffix, prefix గా వాడుకోవచ్చా??
*✅జవాబు:*
మెమో.86595 తేదీ:29.5.61 ప్రకారం ఐచ్చిక సెలవు దినాలు,పరిహార సెలవు దినాలను suffix లేదా preffix గా వాడుకోవచ్చు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*66. ❓ప్రశ్న:*
APGLI ప్రీమియం అదనంగా చెల్లించాలంటే వైద్య ధ్రువ పత్రం సమర్పించాలా??
*✅జవాబు:*
జీఓ.26 తేదీ:22.2.95 ప్రకారం చెల్లించవలసిన ప్రీమియం కన్నా అదనంగా చెల్లించుటకు ప్రతిపాదనలు సమర్పించేవారు గుడ్ హెల్త్ సెర్టిఫికెట్ ఇవ్వవలసి ఉంటుంది.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*67. ❓ప్రశ్న:*
మెడికల్ రీ-అ0బర్సుమెంట్ బిల్లులు ఎప్పట్లోగా dse కి పంపాలి??
*✅జవాబు:*
హాస్పిటల్ నుండి డిశ్చార్జి ఐన తర్వాత 6 నెలలు లోగా ప్రతిపాదనలు dse కి పంపుకోవాలి.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*68. ❓ప్రశ్న:*
నాకు 20 ఇయర్స్ సర్వీసు నిండినది.నేను వాలంటీర్ రిటైర్మెంట్ కావాలి అని అనుకుంటున్నాను.నాకు వెయిటేజ్ ఎంత ఇస్తారు??
*✅జవాబు:*
క్వాలిఫై సర్వీసుకి 60 ఇయర్స్ కి గల తేడాను వెయిటేజ్ గా add చేస్తారు.ఐతే దీని గరిష్ట పరిమితి 5 ఇయర్స్.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*69. ❓ప్రశ్న:*
డిపార్ట్మెంట్ టెస్టుల్లో తెలుగు, హిందీ, ఉర్దూ ఎవరు రాయాలి??
*✅జవాబు:*
ఇంటర్ మరియు పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవని వారు తెలుగు(కోడ్–37)రాయాలి.అదేవిధంగా 10,ఆ పై స్థాయిలో హిందీ/ఉర్దూ ఒక భాషగా చదవని వారు spl language test హిందీ/ఉర్దూ రాయాలి.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*70. ❓ప్రశ్న:*
UP స్కూల్ లో పనిచేస్తున్న టీచర్ అదే మండలం నకు FAC MEO గా భాద్యత లు నిర్వహించుచున్న అతని వార్షిక ఇంక్రిమెంట్లు, ELs ఎవరు మంజూరు చేస్తారు??
*✅జవాబు:*
FR.49 ప్రకారం ఒక పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వహించుచున్న సందర్భంలో ఆ పోస్టుకి గల అన్ని అధికారాలు సంక్రమిస్తాయి.కనుక వార్షిక ఇంక్రిమెంట్లు తనే మంజూరు చేసుకోవచ్చు. ELs మాత్రం DEO గారి ఆనుమతి తో జమ చేయవలసి ఉంటుంది.”
*81. ❓ప్రశ్న:*
ఓపెన్ యూనివర్సిటీ SSC, ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్ గా పనిచేసిన వారికి సంపాదిత సెలవు నమోదు కొరకు ప్రతి సంవత్సరం ఉత్తర్వులు రావాలా??
*✅జవాబు:*
అవసరం లేదు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వారి ఉత్తర్వులు ఆర్.సి.నo.362/ఇ1-1/2013 తేదీ:16.11.2013 ప్రకారం జమ చేయవచ్చు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*82. ❓ప్రశ్న:*
LFL HM కి 12 ఇయర్స్ స్కేల్ పొందటానికి కావలసిన అర్హతలు ఏమిటి??
*✅జవాబు:*
LFL HM కి తదుపరి పదోన్నతి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కాబట్టి డిగ్రీ, బీ. ఈ. డీ, డిపార్ట్మెంట్ పరీక్షల ఉతీర్ణత ఉండాలి.50 ఇయర్స్ వయస్సు నిండితే డిపార్ట్మెంట్ టెస్టుల మినహాయింపు వర్తిస్తుంది.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*83. ❓ప్రశ్న:*
నేను 1996 డిసెంబరు లో sgt గా చేరాను.ఐతే 2001 లో 142 రోజులు,2005 లో 90 రోజులు అనారోగ్యంతో జీత నష్టం(ఇఓఎల్)సెలవు పెట్టాను.ఇంక్రిమెంట్ ఆగస్టుకి పోస్టుపోన్ అయ్యింది. ఐతే ఇంక్రిమెంట్ ను డిసెంబరు కి మార్చుకొనే అవకాశం లేదా??
*✅జవాబు:*
జీఓ.43; తేదీ:5.2.76 ప్రకారం డిసెంబరుకి మార్చుకోవచ్చు.ఐతే సంబంధిత ప్రతిపాదనలు వైద్య ధ్రువపత్రాలతో మరియు SR తో deo ద్వారా DSE కి పంపాలి.180 రోజుల వరకు DSE, అంతకు మించిన కాలానికి విద్యా శాఖ కార్యదర్శి అనుమతితో ఈఓయల్ కాలం ఇంక్రిమెంట్కి సర్వీసు గా పరిగణించబడుతుంది.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*84. ❓ప్రశ్న:*
సస్పెన్షన్ కాలంలో ఉద్యోగి బ్రతికేది ఎలా??
*✅జవాబు:*
సస్పెండ్ పీరియడ్ లో సబ్ స్టెన్స్ అలవెన్సు కింద సగం జీతం(హాఫ్ పే,హాఫ్ డీఏ,హాఫ్ హెచ్ఆర్ఏ)ఇస్తారు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*85. ❓ప్రశ్న:*
ఒక ఉద్యోగి 9 ఇయర్స్ పాటు ఉద్యోగానికి గైరు హాజరు అయ్యాడు.అతనికి మరల పోస్టింగ్ ఇస్తారా??
*✅జవాబు:*
FR.18 మరియు aplr.1933 లోని రూల్ 5 ప్రకారం ఒక ఉద్యోగి 5 ఇయర్స్ పాటు గైర్హాజరు అయితే ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా భావించాలి.తిరిగి చేరాలి అంటే విద్యాశాఖ కార్యదర్శి నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*86. ❓ప్రశ్న:*
నేను SGT ను.75% అంగవైకల్యం తో బాధపడుతున్నాను.నేను ఉద్యోగం చేయలేకపోతున్నాను.నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. డిగ్రీ,బీ.ఎడ్ చేశాడు. నా ఉద్యోగం నా తమ్ముడు కి ఇప్పించవచ్చా??
*✅జవాబు:*
మీ ఉద్యోగం ఎవ్వరికీ నేరుగా బదిలీ చేసే అవకాశం లేదు. కానీ జీఓ.66 జీఏడీ తేదీ:23.10.2008 ప్రకారం మీరు అనారోగ్యంతో విధులు నిర్వర్హించలేక పోతున్నారని జిల్లా మెడికల్ బోర్డు దృవీకరించిన, మిమ్మల్ని మెడికల్ ఇన్వాలిడేషన్ కింద రిటైర్ చేసి మీ తమ్ముడు కి జూనియర్ అసిస్టెంట్ పోస్టు కారుణ్య నియామకం కోటాలో ఇవ్వటానికి అవకాశం ఉంది.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*87. ❓ప్రశ్న:*
ఉన్నత పాఠశాలలో బోధనేతర సిబ్బంది లేనప్పుడు వేసవి సెలవుల్లో ssc అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల విధులను ఎవరికి అప్పగించాలి??
*✅జవాబు:*
ఆర్.సి.132 తేదీ:14.5.14 ప్రకారం బోధనేతర సిబ్బంది లేనప్పుడు వేసవిలో ssc భాద్యతను ఆ ఉన్నత పాఠశాలలోని సీనియర్ ఉపాధ్యాయుడికి అప్పగించాలి.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*88. ❓ప్రశ్న:*
విద్యాహక్కు చట్టంలోని ఏ నిబంధన ప్రకారం 1 నుండి 8వ తరగతి వరకు పిల్లలను నేరుగా చేర్చుకోవచ్చు??
*✅జవాబు:*
విద్యాహక్కు చట్టం 2009 లోని 2వ అధ్యాయం 4వ సెక్షన్ ప్రకారం 6–14 వయస్సు గల పిల్లలను వారి వయస్సుకి తగిన విధంగా 1–8 తరగతులలో నేరుగా చేర్చుకోవలసి ఉంటుంది.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*89. ❓ప్రశ్న:*
గత సంవత్సరం 9వ తరగతి లో ముగ్గురు పిల్లలు వార్షిక పరీక్షలు రాయలేదు.కనీసం 20% హాజరు కూడా లేదు.వారిని ఈ సంవత్సరం 10 లోకి చేర్చుకోవచ్చా??
*✅జవాబు:*
9,10 తరగతులు విద్యాహక్కు చట్టం పరిధిలోకి రావు.కావున కనీస హాజరు లేకుండా పై తరగతికి ప్రమోట్ చేయకూడదు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*90. ❓ప్రశ్న:*
ఒక LFL HM కి కన్వేయన్స్ అలవెన్సు ఎవరు మంజూరు చేయాలి??
*✅జవాబు:*
జీఓ.40 తేదీ:7.2.02 ప్రకారం మండల పరిషత్ యాజమాన్యం లోని స్కూళ్ళు కి MEO నే కన్వేయన్స్ అలవెన్సు మంజూరు చేయాలి.

91. ❓ప్రశ్న:*
*✅జవాబు:*
========
*91. ❓ప్రశ్న:*
నేను 9.11.17న ఉద్యోగం లో చేరాను.నాకు వార్షిక ఇంక్రిమెంట్ నవంబర్ 9 నుండి ఇస్తారా?? లేక నవంబర్ 1 నుండి ఇస్తారా??
*✅జవాబు:*
జీఓ.133 , ఆర్ధిక ; తేదీ:13.5.76 ప్రకారం నియామకం తేదీ నెలలో ఏ తేదీన ఉన్నా, ఆ నెల మొదటి తేదీ నుండే వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చెయ్యాలి.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*92. ❓ప్రశ్న:*
నేను sgt గా పనిచేస్తున్నాను.EOT, GOT పాస్ కాలేదు. నాకు 51 సంవత్సరంలు.నాకు ఇప్పుడు 24 ఇయర్స్ స్కేల్ ఇస్తారా??
*✅జవాబు:*
మీకు 50 ఇయర్స్ దాటినప్పటికీ 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వాలి అంటే డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ కావాలి.వాస్తవానికి PRC లో మినహాయింపు ఇచ్చినప్పటికీ ఆర్ధిక శాఖ ఒప్పుకోలేదు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*93. ❓ప్రశ్న:*
LFL HM పదోన్నతి పొందటానికి ఏ ఏ అర్హతలు కావాలి??
*✅జవాబు:*
సర్వీసు నిబంధనలు ప్రకారం డిగ్రీ,మరియు బీఈడీ ఉండాలి.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*94. ❓ప్రశ్న:*
నేను జీత నష్టం సెలవు పెట్టిన కారణంగా నా ఇంక్రిమెంట్ 29.1.17 కి మారింది.ఇపుడు నాకు ఇంక్రిమెంట్ జనవరి 29న ఇస్తారా?? లేక జనవరి 1న ఇస్తారా??
*✅జవాబు:*
మెమో.49643 ; ఆర్ధిక ; తేదీ:6.10.74 ప్రకారం అసాధారణ సెలవు కారణంగా వాయిదా పడిన ఇంక్రిమెంట్ ను ,ఆ నెల మొదటి తేదీ నుంచే మంజూరు చేయాలి.అంటే జనవరి 1 నుంచే ఇస్తారు. _
°°°°°°°°°°°°°°°°°°°°°°
*95. ❓ప్రశ్న:*
ఒక టీచర్ తేదీ 1.1.1998 నాడు నియామకం అయ్యారు. 31.12.2017 నాటికి 20 సర్వీస్ పూర్తి అయింది. అయితే, ఈ ఇరవై ఏళ్ళ సర్వీస్లో 3 సంవత్సరాలు మెడికల్ గ్రౌండ్స్  పై తీసుకున్న జీతనష్టపు అసాధారణ సెలవు ఉంది. సదరు టీచర్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవచ్చా?
*✅జవాబు:*
తీసుకోరాదు. 20 ఏళ్ళ నెట్ సర్వీస్ పూర్తిచేసి ఉండాలి. పెన్షన్ రూల్ 43 ప్రకారం ఒక ఉద్యోగి/టీచర్ 20 సర్వీస్ పూర్తిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలచినప్పుడు…. Study కోసం పొందిన జీతనష్టపు అసాధారణ సెలవు (OCL Loss of Pay)ను మాత్రమే క్వాలిఫయింగ్ సర్వీస్ గా పరిగణిస్తారు. మెడికల్ గ్రౌండ్స్  లేదా ప్రైవేట్ అఫైర్స్ పొందిన OCL LP ని క్వాలిఫయింగ్ సర్వీస్ గా పరిగణించరు.అయితే… సూపెరాన్యుయేషన్ (58/60 Years) తో రిటైర్ అయినప్పుడు మాత్రం…. మెడికల్ గ్రౌండ్స్ పై తీసుకున్న Unlimited Period మరియు ప్రైవేట్ అఫైర్స్ తో పొందిన 36 నెలల OCL Loss of Pay ని పెన్షన్ కు క్వాలిఫయింగ్ సర్వీస్ గా లెక్కిస్తారు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*96. ❓ప్రశ్న:*
ఉద్యోగి తల్లిదండ్రులు కి వైట్ కార్డు ఉంటే EHS లో చేర్చవచ్చా??
*✅జవాబు:*
చేర్చకూడదు.అందరూ కలసి ఉండి వైట్ కార్డ్ ఉపయోగించుచున్నందులకు ఉద్యోగి పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*97. ❓ప్రశ్న:*
నా భార్య హౌస్ వైఫ్.ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేఇ0చుకుంటే నాకు ప్రత్యేక సెలవులు ఏమైనా ఇస్తారా??
*✅జవాబు:*
జీఓ.802 M&H తేదీ:21.4.72 ప్రకారం భర్త కి 7 రోజులు స్పెషల్ సెలవులు ఇస్తారు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*98. ❓ప్రశ్న:*
మెడికల్ సెలవు లో ఉండి వాలంటరి రిటైర్మెంట్ కి అప్లై చేయవచ్చా??
*✅జవాబు:*
చేయవచ్చు. కానీ నష్టం జరుగుతుంది.మెడికల్ సెలవులో ఉండి వాలంటర్ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి వేతనం రాదు.అదే స్కూల్లో జాయిన్ ఐన పిదప వాల0టరీ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి పూర్తి వేతనం పొందవచ్చు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*99. ❓ప్రశ్న:*
CL వరుసగా ఎన్ని రోజులు పెట్టవచ్చు??
*✅జవాబు:*
ఆదివారం మరియు సెలవు దినాలతో కలిపి మొత్తం 10 రోజులకి మించకూడదు.
°°°°°°°°°°°°°°°°°°°°°°
*100. ❓ప్రశ్న:*
స్పెషల్ CL ఎన్ని రోజులు వరుసగా వాడుకోవచ్చు??
*✅జవాబు:*
ఆదివారం మరియు సెలవు దినాలతో కలిపి మొత్తం 10 రోజులకి మించకూడదు.