ap-ehs-medical-reimbursement-new-modifications-guidelines

ap-ehs-medical-reimbursement-new-modifications-guidelines

Health,Medical & famlly Welfare Department-* *Strenathening of Employees Heaith Scheme – Orders- Issued*
ఉద్యోగులకు 204 రకాల ప్రొసీజర్స్లో మెడికల్ రీయింబర్స్ మెంట్*
 ఈహెచ్ఎస్కు అర్హత ఉన్న ఉద్యోగులకు 204 ప్రొసీజర్స్ (వ్యాధి రకాలు)లో మెడికల్ రీయింబర్స్మెంట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 *ఈహెచ్ఎస్ లబ్ధిదారులకు కన్సల్టేషన్, మెడికేషన్, డయాగ్నోస్టిక్స్, రెఫరల్ సేవల కోసం ఆయా ఏరియా ఆస్పత్రుల్లో క్లినిక్లు ఏర్పాటు చేయనున్నారు.
ఈ మేరకు శుక్రవారం వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మార్చి 14న ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ప్రతినిధుల కోరిక మేరకు ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టు పేర్కొన్నారు.
ఉత్తర్వుల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ సీఈఓను ఆదేశించారు.
*ఉద్యోగుల నగదు రహిత చికిత్స స్కీమ్ (EHS)ను బలోపేతం చేస్తూ ఉత్తర్వులు (జి ఓ 353)విడుదల*
*అవుట్ పేషెంట్ చికిత్స ప్యాకేజీలు మార్పులు మరియు ఇతర అంశాలపై తాజా మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
 Flash..AP EHS, Medical Reimbursement New Modifications Guidelines 2023 with Dental Procedures New Rates*
► ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) స్కీం బలోపేతానికి  *GO.Rt . No. 353 Dt. 12.05.2023* విడుదల. 
► రూ.2 లక్షలపైన ఖర్చయ్యే 25 రకాల ప్రొసీజర్స్ కి మెడికల్ రీయింబర్స్మెంట్కు అవకాశం కూడా కల్పిస్తూ ఉత్తర్వులు..

► ప్రస్తుతం ఉన్న 14 కేంద్రాలతో కలిపి అన్ని 26 జిల్లాల కేంద్రాలలో దీర్ఘకాలిక వ్యాధులకు ఔట్ పేషెంట్ సర్వీసెస్ అవకాశం కల్పిస్తారు. 
► EHSకు అర్హులైన ఉద్యోగులకు ఏరియా ఆస్పత్రుల్లో క్లినిక్స్ ఏర్పాటు చేయనున్నారు.
► డెంటల్ ప్రొసీజర్ ధరలను పెంచుతూ ఉత్తర్వులు.
► గతంలో తొలగించబడిన 204 ప్రొసీజర్స్ (వ్యాధి రకాలు) లో మెడికల్ రీయింబర్స్మెంట్కు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు.