aadhaar-services-through-theVillage-Ward-Sachivalayam–Guidelines-issued

aadhaar-services-through-theVillage-Ward-Sachivalayam–Guidelines-issued

గ్రామ సచివాలయాల్లోనూ ఆధార్‌ సేవలు

మొదట 500 సచివాలయాల్లో..  

వచ్చేనెలలో ఈ సేవల్ని ప్రారంభించనున్న సీఎం జగన్‌

ఆధార్‌ నమోదు, మార్పులు చేర్పులు వంటి సేవలు ఇక గ్రామ సచివాలయాల్లో కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేవల్ని వచ్చేనెల రెండో వారంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నట్టు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ కమిషనర్‌ భరత్‌గుప్తా తెలిపారు.

మొదట 500 గ్రామ సచివాలయాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. క్రమంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు వీటిని విస్తరిస్తామన్నారు.

ఆధార్‌ సేవలు అందుబాటులోలేని 226 మండలాల్లో మొదట ప్రాధాన్యతగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.

వీటికి అదనంగా జిల్లాకు 20 చొప్పున గ్రామ సచివాలయాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు.

ఆధార్‌ సేవలకు ఉన్న డిమాండ్‌ను అంచనా వేసి జిల్లాలో ఏయే గ్రామ సచివాలయాల్లో ఈ సేవలను ప్రారంభించాలన్న నిర్ణయాన్ని జాయింట్‌ కలెక్టర్లకు అప్పగించినట్లు తెలిపారు.

GVWV&VSWS Department – aadhaar services through the V&WS – Guidelines issued.

1 Aadhaar enrolment Free–will be reimbursed by the UIDAI @100 per transaction.
2 Mandatory Biometric Update along with Demographic Updates.
Free–will be reimbursed by the UIDAI @100 per transaction.
3 Biometric update 100 (to be collected from Citizen).

4 Demographic update 50 (to be collected from Citizen).
5 Download and colour print of Aadhaar 30 (to be collected from Citizen).

ఆధార్ సేవలు అన్ని సచివాలయాలలో ప్రొసీడింగ్స్