30th-National Children Science Congress-NCSC-projects-2022

30th-National Children Science Congress-NCSC-projects-2022

ఎన్సీఎస్సీకి మంచి ప్రాజెక్టులు తయారు చేయండి

NATIONAL CHILDREN SCIENCE CONGRESS PROJECT MODEL

NCSC PROJECT DETAILED EXPLANATION

NCSC SCIENCE PROJECT STUDENT EXPLANATION

Log book వ్రాసే విధానం MODEL-1

Log book వ్రాసే విధానం MODEL-2

NCSC REGISTRATION FORM WORD FILE

NCSC REGISTRATION FORM PDF FILE

NCSC SCIENCE PROJECT “HUMAN & CLIMATE” PROJECT REPORT PDF

NCSC SCIENCE PROJECT “SAVE ENERGY & SAVE FUTURE” PROJECT REPORT PDF

విద్యార్థులతో సమాజ వికాసానికి దోహదపడే రూపొందించేలా కృషి చేయాలని అన్నారు. ఈ ఏడాది ఎన్సీఎస్ సీ థీమ్ గా ఇచ్చిన ‘ *ఆరోగ్యం, శ్రేయస్సు కోసం పర్యావరణ వ్యవస్థను అర్థం చేసు కోవడం* ‘ అంశంపై  విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు. 

 *సబ్ థీమ్ లైన

ఆవరణ వ్యవస్థలపై ,

ఆరోగ్యంపై పర్యావరణ వ్యవస్థ,

ఆరోగ్యం కోసం సామాజిక,

సాంస్కృతిక పద్ధతు లపై  పర్యా వరణ వ్యవస్థ ఆధారిత విధానం పై పర్యావరణ వ్యవస్థ, ఆరోగ్యం | కోసం వైవిధ్య సాంకేతిక పద్ధతుల* పై ప్రాజెక్టులు రూపొందించి జిల్లా స్థాయిలో సమర్పించాలని అన్నారు .

30వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ లో ప్రాజెక్టులు  ఎలా ఉండాలంటే…?

* సైన్స్ కాంగ్రెస్ ప్రాజెక్టులు కేవలం సర్వేలు కావు లేదా సైన్స్ సూత్రాలను ప్రదర్శించే నమూనాలు కావు. సమస్య పరిష్కార పద్ధతిలో ప్రాజెక్టులు నిర్వహించాలి. ప్రాజెక్టు విధిగా ఆ సంవత్సర ప్రధానాంశానికి లోబడి ఏదేని ఉప అంశానికి చెంది ఉండాలి. ప్రాజెక్టు ద్వారా సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడంతో నిర్దిష్ట కాలానికి పూర్తి చేయకపోయినప్పటికీ అధ్యాయన పద్ధతి తప్పక శాస్త్రీయంగా డాలి. ప్రాజెక్టు రూపకల్పనలో సమస్య అవగాహన, సృజనాత్మకత, నూతసత్వానికి ప్రాధాన్యతనివ్వాలి.

ప్రాజెక్టు పని సూచనలు

• ఇద్దరు విద్యార్థులు బృందంగా ప్రాజెక్ట్ నిర్వహించాలి..

• 10 – 17 సం. వయసులోపు వారు ప్రాజెక్టులు నిర్వహించవచ్చు. మీ స్థానిక ప్రాంతపు సమస్యను గుర్తించి, ప్రధాన అధ్యయన అంశంతో సబసంబంధాన్ని సరిచూసుకోండి.

నిర్ధిష్టమైన చక్కటి శీర్షిక (టైటిల్) తో, సంబంధిత నిర్దేశిత భౌగోళిక ప్రాంత పరిధిలో ప్రాజెక్ట్

నిర్వహించాలి. పరిశీలనలను చక్కగా తేదీల వారిగా లాగ్ బుక్ లో నమోదు చేయాలి.

దత్తాంశాలన్నింటిని విశ్లేషించాలి.

• పరిశోధన ఫలితాన్ని వివరించాలి, వ్యాఖ్యానించాలి.. సమస్యకు పరిష్కారాన్ని సూచించాలి.

ప్రాజెక్టు కొనసాగింపుకునేలా చేస్తావో చర్యా ప్రణాళికనివ్వాలి..

ప్రాజెక్టు మొత్తాన్ని రిపోర్టు రూపంలో డాక్యుమెంట్ గా రూపొందించి పోటీలలో సమర్పించాలి.

ప్రాజెక్టులను వ్యక్తీకరించుట: మౌఖిక రూప రిపోర్టు

* మౌఖిక వ్యక్తీకరమకు 8 ని. సమయం ఇవ్వబడుతుంది.

• అనంతరం 2 ని. ప్రాజెక్ట్ పై ప్రస్నలు కార్యక్రమం ఉంటుంది.

గరిష్టంగా 4 చార్టులు లేక పోస్టర్లు (55 సెం.మీ × 70 సెం.మీ) ఉపయోగించుకోవచ్చు. * ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, ఎల్.సి.డి ప్రాజెక్టర్లను ఉపయోగించుకోవచ్చు.

ప్రాజెక్ట్ మౌఖిక ప్రదర్సనలో సమాచార/ సంభాషణ నైపుణ్యాలు ముఖ్య భూమికను చూపుతాయి.

• ప్రాజెక్టు లీడరు ప్రాజెక్ట్ లోని అంశాలను స్పష్టంగా, మంచి ఉచ్చారణతో వివరించాల్సి ఉంటుంది.

• జట్టులోని ఇతర గ్రూపు సభ్యులు కూడా అధ్యయన అంశంపై స్పష్టమైన అవగాహనను

కల్గిఉండాలి.

లిఖిత రూప రిపోర్ట్

ముఖ పత్రంపై (కవర్ పేజీ) ప్రాజెక్ట్ పేరు, టీమ్ లీడర్, సభ్యుల పేర్లు, అడ్రసులు, గైడ్, జిల్లా, రాష్ట్రం పేర్లు ఇంగ్లీష్/హిందీ భాషల్లో మాత్రమే వుండాలి.

• 250 పదాలకు మించని ప్రాజెక్టు సంక్లిప్త రూపం (Abstract)ను ఇంగ్లీష్ టైప్ చేసిగాని లేదా చక్కటి చేతివ్రాతతో గాని వ్యాయవచ్చు. ప్రాజెక్ట్ రిపోర్టు జూనియర్ స్థాయి 2500 పదాలు, సీనియర్ స్థాయి 3500 పదాల పరిమితితో ప్రాయవచ్చు.

• ప్రాజెక్ట్ రిపోర్టును మాత్రం, రాజ్యాంగం గుర్తించిన ఏ భాషలోనైనా టైప్ చేసి గానీ లేదా చక్కటి చేతిరాతతోగానీ వ్యావచ్చు. ప్రాజెక్ట్ రిపోర్టులో సాధారణంగా ఫారమ్-ఎ, ఉపోద్ఘాతము, లక్ష్యాలు, ఉద్ధేశాలు, ప్రాజెక్ట్ అవసరం, పరికల్పన, పని ప్రణాళిక, ప్రాజెక్టు పద్ధతి, పరిశీలనలు, దత్తాంశ విశ్లేషణ, ఫలితాలు, నిర్ణయాలు, ముగింపులు ఉండాలి.

• సమస్యకు పరిష్కారం, భవిష్య ప్రణాళిక, ప్రాజెక్టు పద్ధతి, పరిశీలనలు, దత్తాంశ విశ్లేషణ, ఫలితాలు, నిర్ణయాలు, ముగింపులు ఉండాలి. సమస్యకు పరిష్కారం, భవిషప్రణాళిక, కృతజ్ఞతలు తెలుపాలి. అనుబంధం (అవసరమైతే) పేర్కొనాలి.

ప్రాజెక్టులను వ్యక్తీకరించుట: మౌఖిక రూప రిపోర్టు

మౌఖిక వ్యక్తీకరమకు 8 ని. సమయం ఇవ్వబడుతుంది.

అనంతరం 2 ని. ప్రాజెక్ట్ పై ప్రస్నలు కార్యక్రమం ఉంటుంది. గరిష్టంగా 4 చార్టులు లేక పోస్టర్లు (55సెం.మీ × 70 సెం.మీ) ఉపయోగించుకోవచ్చు.

• ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, ఎల్.సి.డి ప్రాజెక్టర్లను ఉపయోగించుకోవచ్చు.

ప్రాజెక్ట్ మౌఖిక ప్రదర్సనలో సమాచార/ సంభాషణ నైపుణ్యాలు ముఖ్య భూమికను చూపుతాయి.

30th National Children Science Congress (NCSC) : 2022-23

30TH NCSC REGISTRATION FORM PDF

Orientation to Guide Teachers PDF

NCSC 2022 ORIENTATION FOR GUIDE TEACHERS PDF (E.M)

NCSC 2022 THEMES & SUB THEMES PDF(T.M)

 జిల్లాలోని  అన్ని మేనేజ్ మెంట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు & సైన్స్ టీచర్స్ కు ముఖ్య గమనిక

 *APCOST మరియు Department of Science & Technology (DST), Government of India* వారిచే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న *NCSC -2022-23* *జిల్లాస్థాయి కాంపిటీషన్ నవంబర్ మూడవ వారం లోను,‌ రాష్ట్ర స్థాయి డిసెంబర్ మొదటి వారం లోను, జాతీయ స్థాయి డిసెంబర్ చివరి వారంలోను ఉండవచ్చును.* 

👉🏼🎯 *ప్రధాన అంశం* :       

*ఆరోగ్యం, శ్రేయస్సు కోసం పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం(Understanding Ecosystem for health  and wealth being)*

పై *ప్రధాన అంశం* మరియు క్రింది *ఉప అంశాలకు* సంబంధించి ఏదో ఒక ఉప అంశంలో మాత్రమే  విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టులు చేపట్టవలెను.

📌 *ఉప అంశాలు* 

👉🏼 *1. మీ పర్యావరణ వ్యవస్థను తెలుసుకోండి* ( *Know your Ecosystem)* 

 *👉🏼


2. ఆరోగ్యం, పోషణ మరియు శ్రేయస్సును పెంపొందించడం* 

 ( *Fostering health, nutrition and well being* )

 👉🏼 *3. పర్యావరణ వ్యవస్థ మరియు ఆరోగ్యం కోసం సామాజిక మరియు సాంస్కృతిక పద్ధతులు* 

 ( *Social and cultural practices for Ecosystem and health* )

 👉🏼 *4.స్వీయ ఆధారితం కోసం పర్యావరణ వ్యవస్థ ఆధారిత విధానం* 

 ( *Ecosystem based approach EBA for self reliance* )

 👉🏼 *5. పర్యావరణ వ్యవస్థ మరియు ఆరోగ్యం కోసం సాంకేతిక ఆవిష్కరణ*

( *Technological innovation for ecosystem and health* )

ఒకరు లేదా ఇద్దరు  విద్యార్థులు గైడ్ టీచర్ సహాయంతో ఎంచుకున్న పై ఉప అంశానికి అనుగుణంగా సర్వే, పరిశీలనలు, ప్రశ్నావళి మరియు కేస్ స్టడీస్ ఆధారంగా ప్రాజెక్టులు చేపట్టి , రిపోర్టు తయారుచెయ్యలి.

 *గైడ్ టీచర్స్ కు ముఖ్య సూచనలు:* 

➡️ గైడ్ టీచర్ ఆధ్వర్యంలో ఛైల్డ్ సైంటిస్ట్ పై సబ్ థీమ్స్ నందు ఏదైనా ఒకటి ఎంచుకొని దానిపై ప్రాజెక్ట్ నిర్వహించి, రిపోర్ట్  తయారుచేయవలెను.

➡️ ప్రాజెక్ట్ పీరియడ్ సుమారుగా అక్టోబర్ 15నుండి నవంబర్ 15.

➡️ ప్రాజెక్ట్ రిపోర్ట్, లాగ్ బుక్, 4 ఛార్ట్ లు తప్పనిసరిగా ప్రెజెంటేషన్ సమయంలో సమర్పించవలసి ఉంటుంది..

➡️ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ 6 ని., వైవా 2 ని.లు ఉంటుంది.

➡️ ఒక పాఠశాల నుండి గరిష్టంగా ఎన్ని ప్రాజెక్టులు అయినా సమర్పించవచ్చు.

➡️ పాఠశాలలలో 6 నుండి 10వ తరగతి చదివే విద్యార్థులు  పాల్గొనవచ్చు.

➡️ అత్యుత్తమమైన ప్రాజెక్టులు *రాష్ట్ర స్థాయికి* తదుపరి *జాతీయ స్థాయికి* ఎంపిక చేయబడతాయి.

➡️ **విద్యార్థులలో* *శాస్త్రీయ దృక్పధం పెంపొందించుట,* 

**ప్రకృతిని నిశితంగా      పరిశీలించుట,* **పరిశోధించుట,* *పర్యావరణాన్ని పరిరక్షించుట* 

**బాల శాస్త్రవేత్తలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడం వంటి ఉన్నత లక్ష్యాలు* కలిగిన ఈ కార్యక్రమాన్ని సైన్స్ ఉపాధ్యాయులు అందరూ విజయవంతం చేయవలసినదిగా కోరుచున్నాము.