social-security-pensions-Enhancement of the existing pension amount

social-security-pensions-Enhancement of the existing pension amount

AP News: ఒక్కొక్కరికి రూ. 7 వేలు.. వారందరికీ కొత్త ప్రభుత్వం డబుల్ ధమాకా.. జీవో జారీ

NTR Bharosa Pension scheme : పింఛను పథకం పేరు ‘ఎన్టీఆర్‌ భరోసా’గా మార్పు – పింఛనుదారులపై వరాల జల్లు

G.O.MS.NO.43, DATED; 13-06-2014

పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్‌ భరోసా పేరుతో ఈ పథకాన్ని అమలు చేసేలా కొత్త జీవోను జారీ చేసింది. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా.. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం భరోసానిచ్చింది.

పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పథకానికి పెట్టిన ‘ఎన్టీఆర్ భరోసా’ పేరుతో ఈ పథకం ఇప్పుడు కొనసాగనుంది. గురువారం పెన్షన్ల పెంపు ఫైల్‌పై చంద్రబాబు సంతకం చేయడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరభ్‌కుమార్ ప్రసాద్ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా.. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం భరోసానిచ్చింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇప్పుడు అందుతున్న 3వేల పెన్షన్‌ను ప్రభుత్వం రూ. 4 వేలకు పెంచింది. ఈ పెన్షన్ పెంపు మొత్తం ఏప్రిల్ నెల నుంచే అమలు కానుంది. అంటే జూలై 1న ఇచ్చే పెన్షన్‌లో గడిచిన మూడు నెలల పెంపు డబ్బులు కూడా కలిపి వృద్ధులు, వితంతువులకు రూ. 7 వేలు ఇచ్చేలా జీవో జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం.

ఇక దివ్యాంగుల పెన్షన్ డబుల్ చేస్తూ 6 వేలకు పెంచింది. పూర్తిస్థాయిలో అస్వస్థతకు గురైనవారికి, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడినవారికి, వీల్‌ఛైర్‌లో ఉన్నవారికి అందే రూ. 5 వేల పెన్షన్‌ను రూ. 15 వేలకు పెంచింది చంద్రబాబు ప్రభుత్వం. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్‌ స్టేజ్‌కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తుల పెన్షన్‌ను రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు గురువారం సాయంత్రం 4.41 గంటలకు ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. మొదటిగా ఐదు ఫైల్స్‌పై సంతకాలు చేశారు. అందులో ఒకటి పెన్షన్ల పెంపు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే 200 రూపాయలున్న వృద్ధుల పెన్షన్ ఏకంగా ఐదు రేట్లు పెంచి వెయ్యి చేశారు. ఆ తర్వాత దాన్ని 2వేలకు పెంచారు. ఈ సారి ఎన్నికల ప్రచారంలో వృద్దుల పెన్షన్ నాలుగు వేలకు పెంచుతామని చంద్రబాబు హామీనిచ్చారు. అంతేకాదు ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్‌ వర్తింపజేస్తామని ప్రకటించారు. ఆ హామీని నెరవేరుస్తూ మూడో సంతకం చేశారు సీఎం చంద్రబాబు.