Schools-start-on-August-16th-August-16th-online-classes-schedule-baseline-test

Schools-start-on-August-16th-August-16th-online-classes-schedule-baseline-test

చెప్పే దాకా సిలబస్‌ బోధించొద్దు పాఠశాలల్లో మొదలైన ప్రవేశాల ప్రక్రియ,  27 నుంచి బేస్‌లైన్‌ పరీక్షలు

పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. కరోనా లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో వచ్చే నెల 16న బడులు తెరుస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రత్యక్ష బోధన ప్రారంభించే వరకు సిలబస్‌లను బోధించొద్దని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నిర్దేశించింది.

ADMISSION FORMS PDF CLICK HERE

AP CSE NEW ADMISSIONS ONLINE LINK

అప్పటి వరకు ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ చేపట్టింది.

వారి అభ్యసనసామర్థ్యాల అంచనాకు ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు బేస్‌లైన్‌ పరీక్షలను నిర్వహించనుంది. వచ్చే నెల 4 నుంచి సాధన పత్రాలకు జవాబులు రాయించాలని సూచించింది.

*♦ఇళ్ల దగ్గరే సాధన..*

సాధనపత్రాలకు జవాబులను విద్యార్థులు తమ ఇళ్ల దగ్గరే రాయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు మార్గదర్శకాలను జారీ చేశారు.

గత తరగతుల పాఠ్యాంశాల ఆధారంగా ఎస్‌సీఈఆర్టీ ఆధ్వర్యంలో మూడు స్థాయిల్లో రూపొందించిన అధ్యయనదీపికలు(బుక్‌లెట్స్‌), సాధనపత్రాలను జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణసంస్థ (DCEB) ద్వారా పాఠశాలలకు సరఫరా చేయనున్నారు.

తెలుగు, ఆంగ్ల మాధ్యమం కలిపి ద్విభాషాపద్ధతిని అనుసరించి

ఒకటి, రెండు తరగతులకు లెవెల్‌-1,

3,4,5 తరగతులకు లెవెల్‌-2,

3 విభాగంలో 6 నుంచి 10 తరగతులకు సబ్జెక్టుల వారీగా అధ్యయన దీపికలు తీర్చిదిద్దారు.

ALL SUBJECTS WORK BOOKS LATEST PDF PAGE

*♦విద్యార్థులను రానీయొద్దు..*

ప్రవేశాలు, బేస్‌లైన్‌ టెస్ట్‌, వర్క్‌షీట్లు, బుక్‌లెట్లు వంటి వాటి కోసం విద్యార్థులను పాఠశాలలకు రాకుండా చూడాలని ఉపాధ్యాయులకు నిర్దేశించాం. తల్లిదండ్రుల సహకారంతోనే ఇదంతా జరిగేలా దిశానిర్దేశం చేస్తున్నాం. అధ్యయన దీపికలు(బుక్‌లెట్లు), సాధనపత్రాలు(వర్క్‌ షీట్లు) డీసీఈబీ ఆధ్వర్యంలో ముద్రణకు చర్యలు తీసుకున్నాం. నిర్దేశిత ప్రణాళిక మేరకు పాఠశాలలకు సరఫరా చేయనున్నాం. జిల్లా విద్యాశాఖాధికారి

*ఇదీ కార్యాచరణ..

ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు ఇళ్ల దగ్గరే బేస్‌లైన్‌ పరీక్షలు నిర్వహించాలి. ఇందుకు తల్లిదండ్రుల సహకారం తీసుకుని సాధన పత్రాలను వారి ద్వారా విద్యార్థులకు అందజేసి జవాబులు రాసిన అనంతరం రప్పించుకోవాలి.

28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు మూల్యాంకనం చేయాలి.

2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గత తరగతుల్లో విద్యాకానుకలో అందజేసిన వర్క్‌బుక్స్‌ను సాధన చేయాలి.

4 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు తాజాగా అందజేయనున్న అధ్యయన దీపికలు, సాధనపత్రాలను పూర్తి చేయాల్సి ఉంది.

ఇదే సందర్భంలో కార్యాచరణ మేరకు రేడియో, టీవీల్లో ప్రసారమయ్యే పాఠాలను అనుసరించాలి.

LATEST WORK BOOKS/WORK SHEETS 2021-22

10TH CLASS ALL SUBJECTS WORK BOOKS

9TH CLASS ALL SUBJECTS WORK BOOKS

8TH CLASS ALL SUBJECTS WORK BOOKS

7TH CLASS ALL SUBJECTS WORK BOOKS

6TH CLASS ALL SUBJECTS WORK BOOKS

5TH CLASS ALL SUBJECTS WORK BOOKS

4TH CLASS ALL SUBJECTS WORK BOOKS

3rd CLASS ALL SUBJECTS WORK BOOKS

2nd CLASS ALL SUBJECTS WORK BOOKS

1st CLASS ALL SUBJECTS WORK BOOKS

APSCERT TEXT BOOKS NEW 2021-22 FOR 1st CLASS TO 10th CLASS

10TH CLASS ALL SUBJECTS ONLINE BITS PDF

1st CLASS TO 10th CLASS ALL SUBJECTS WORK SHEETS CLICK HERE PDF PAGE