scholarships-for-post-graduate-students-complete-details

scholarships-for-post-graduate-students-complete-details

పీజీ చేస్తున్నారా.. అయితే స్కాల‌ర్‌షిప్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోండి

పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు స్కాల‌ర్‌షిప్ అందిస్తున్న‌ట్లు యూజీసీ ప్ర‌క‌టించింది. ప్ర‌తీ ఏటా ఆర్థికంగా వెనుక‌బ‌డిన విద్యార్థుల గుర్తించి వారి చ‌దువు సాఫీ సాగేందుకు యూజీసీ ప్రొఫెషన్ కోర్సుల వారికి రూ.7,800, నాన్ ప్రొఫెషన్ కోర్సుల వారికి రూ.4,500 స్కాల‌ర్‌షిప్ అందిస్తుంది.

పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు స్కాల‌ర్‌షిప్ అందిస్తున్న‌ట్లు యూజీసీ ప్ర‌క‌టించింది. ప్ర‌తీ ఏటా ఆర్థికంగా వెనుక‌బ‌డిన విద్యార్థుల గుర్తించి వారి చ‌దువు సాఫీ సాగేందుకు యూజీసీ స్కాల‌ర్‌షిప్ అందిస్తుంది. ఇంజినీరింగ్, ఫార్మా, మేనేజ్‌మెంట్ ఇత‌ర రంగాల‌ల్లో దేశంలో గుర్తింపు పొందిన క‌ళాశాల‌ల్లో చ‌దివే వారికి యూజీసీ స్కాల‌ర్‌షిప్ అందిస్తుంది.
సుమారుగా 1000 మంది షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ విద్యార్థుల్లో పీజీ చేస్తున్న వారికి ఈ స్కాల‌ర్ షిప్ అందిస్తున్నారు. ఎంఈ, ఎంటెక్ చేసే వారికి నెల‌కు రూ.7,800 పీజీ విద్యాభృతి అందిస్తున్నారు. అలాగే ఇత‌ర విభాగాల్లో పీజీ చేస్తున్న వారికి నెల‌కు రూ.4,500 అందించ‌నుంది. ఈ స్కాల‌ర్‌షిప్ కోర్సులో జాయిన్ అయిన మొద‌టి సంవ‌త్స‌రం నుంచే అందిస్తుంది.
స్కాల‌ర్‌షిప్ స‌మాచారం..
ఎవ‌రైతే నేష‌న‌ల్ స్కాల‌ర్‌షిప్ కోసం ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసేందుకు ఆస‌క్తి ఉన్నారో వారు కొన్ని ముఖ్య అంశాల‌ను ప‌రిశీలించుకోవాలి.
– ద‌ర‌ఖాస్తు చేసుకొనే విద్యార్థి గుర్తింపు పొందిన కళాశాల‌లో చేరి ఉండాలి.

– ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్‌, ఎంఎస్‌డ‌బ్ల్యూ, మాస్ క‌మ్యూనికేష‌న్ ఇన్ జ‌ర్న‌లిజం డిగ్రీ చేసిన కూడా నాన్ ప్రొఫేష‌న‌ల్ కోర్సు కోటాలో అర్హులు..
– దూర విద్య‌, క‌ర‌స్పాండెట్ కోర్సులో ప్రొఫెష‌న‌ల్ స‌బ్జెక్టు కోర్సులు చేసే విద్యార్థులు ఈ ఆర్థిక సాయం పొందేందుకు అర్హులు కాదు.
– రెండు లేదా మూడు సంవ‌త్స‌రాలు కోర్సు వ్య‌వ‌ధిలోనే పూర్తి చేయాలి. అంత‌కు మించితే స్కాల‌ర్‌షిప్ రాదు.
– యూజీసీ స్కాల‌ర్‌షిప్ చెల్లిపంఉ డైరెక్ట్ బెన్‌ఫిట్ ట్రాన్స్‌ఫ‌ర్ (DBT)లో ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం..
న‌వంబ‌ర్ 30, 2021 లోపు నేష‌న‌ల్ స్కాల‌ర్‌షిప్ పోర్ట‌ల్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
– ద‌ర‌ఖాస్తులో ఏమైనా త‌ప్పులు లేదా పొర‌పాట్లు జ‌రిగితే వాటి సవ‌ర‌ణ‌కు డిసెంబ‌ర్ 15, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంటుంది.
– విద్యార్థి ఎక్క‌డ చ‌దువుతున్నాడో ఆన్‌లైన్‌లో ధ్రువీక‌రించాలి.
– మ‌రింత స‌మాచారం కోసం యూజీసీ విడుద‌ల చేసిన బ్రొచ‌ర్‌ను చ‌ద‌వాలి.

ONLINE APPLICATION FOR SCHOLARSHIPS

NATIONAL SCHOLARSHIP PORTAL