SBI Recruitment-apprentice-posts-6160

sbi-has-released-notification-for-the-engagement-of-apprentice-posts
Engagement of Apprentices Under The Apprentices Act,1961 Advertisement No: CRPD/APPR/2023-24/17
Important Events Dates
Commencement of on-line registration of application 01/09/2023
Closure of registration of application 21/09/2023
Closure for editing application details 21/09/2023
Last date for printing your application 06/10/2023
Online Fee Payment 01/09/2023 to 21/09/2023

SBI Recruitment: 6 వేలకు పైగా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌, స్టైఫండ్‌ ఎంతంటే?

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ భారీ సంఖ్యలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 6,160 ఖాళీలను భర్తీ చేయనుంది.

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ భారీ సంఖ్యలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 6,160 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో ఏపీలో 390 ఖాళీలు ఉండగా, తెలంగాణలో 125 ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 1 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు..

* ఎస్‌బీఐ – అప్రెంటిస్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 6160 (ఏపీ-390, తెలంగాణ-125)

కేటగిరీల వారీగా ఖాళీలు: ఎస్సీ- 989, ఎస్టీ- 514, ఓబీసీ- 1389, ఈడబ్ల్యూఎస్- 603, జనరల్- 2,665 చొప్పున ఉన్నాయి. 

అర్హత:  ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. 

వయోపరిమితి: 2023 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

Notification PDF


Online Application LINK

దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

స్టైఫండ్: ఎంపికైనవారికి ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఈ ఏడాది కాలం పాటు నెలకు ₹15 వేల చొప్పున స్టైఫండ్ ఇస్తారు. ఇతర అలవెన్సులకు అర్హులు కాదు.

ఆన్‌లైన్ రాత పరీక్ష అక్టోబర్/నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది.

ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 01.09.2023.

* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌, ఫీజు చెల్లించడానికి చివరితేది: 21.09.2023.

* దరఖాస్తు వివరాల్లో సవరణకు చివరితేది: 21.09.2023.

* దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 06.10.2023

Notification PDF

Online Application LINK