9th-class-admissions-in-lateral-entry-selection-test-2024-25

CLASS-9th- (2024-25)-LATERAL ENTRY SELECTION TEST IN
JAWAHAR NAVODAYA VIDYALAYA

NV: నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతిలో లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు

దేశవ్యాప్తంగా 650 జవహర్‌ నవోదయ విద్యాలయా(జేఎన్‌వీ)ల్లో 9వ తరగతిలో లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లావాసి అయి ఉండాలి. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

వివరాలు…

* జేఎన్‌వీల్లో 9వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు

అర్హత: జేఎన్‌వీల్లో ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లావాసి అయి ఉండాలి. 2023-24 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు


వయోపరిమితి: 01.05.2009 – 31.07.2011 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సర్టిఫికెట్‌ సాఫ్ట్‌ కాపీని అప్‌లోడ్‌ చేయడం తప్పనిసరిని. దీంతో పాటు అభ్యర్థి ఫొటో, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్‌ వివరాలు, నివాస ధ్రువపత్రాల అవసరమవుతాయి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

ప్రవేశ పరీక్ష: మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో నాలుగు విభాగాలు(ఇంగ్లిష్‌, హిందీ, సైన్స్‌, మ్యాథమెటిక్స్‌) ఉంటాయి. పరీక్ష పేపర్‌ ఇంగ్లిష్‌, హిందీ భాషలో ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు.

ముఖ్యమైన తేదీలు…

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-10-2023.

➥ ప్రవేశ పరీక్ష తేదీ: 10-02-2024.

Notification

Online Application

Website