SBI-alert-Do you have these 4 apps on your smartphone? Delete immediately

SBI-alert-Do you have these 4 apps on your smartphone? Delete immediately

SBI Alert: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ 4 యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలిట్ చేయండి

SBI Alert | మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్ బ్యాంకింగ్ యాప్స్ (Banking Apps) ఉన్నాయా? బ్యాంకింగ్ యాప్స్ ద్వారా లావాదేవీలు (Online Transactions) జరుపుతున్నారా? అయితే అలర్ట్. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ 4 యాప్స్ ఉంటే వెంటనే డిలిట్ చేయాలని కోరుతోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). ఎందుకో తెలుసుకోండి.

స్మార్ట్‌ఫోన్‌తో ఆర్థిక లావాదేవీలు చాలా సులువైపోయాయి. ఒక్క క్లిక్‌తో లక్షలకు లక్షల రూపాయలు క్షణాల్లో ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి. ఒకప్పుడు బ్యాంకింగ్ లావాదేవీలు చేయాలంటే ఒకట్రెండు గంటలు బ్యాంకులోనే గడపాల్సిన పరిస్థితి. కానీ స్మార్ట్‌ఫోన్ వచ్చిన తర్వాత లావాదేవీలన్నీ (Online Transactions) క్షణాల్లో జరిగిపోతున్నాయి.

 ఈ మోసాలను అడ్డుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) తమ కస్టమర్లను అప్రమత్తం చేస్తూనే ఉంటోంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు నాలుగు యాప్స్‌ని ఇన్‌స్టాల్ చేయకూడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరిస్తోంది.

Anydesk,

Quick Support,

Teamviewer,

Mingleview యాప్స్ చాలా డేంజర్.

ఈ యాప్స్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయంటే హ్యాకర్లు, నేరగాళ్లు మీ స్మార్ట్‌ఫోన్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవడం చాలా సింపుల్. అందుకే ఈ యాప్స్ ఇన్‌స్టాల్ చేయకూడదని హెచ్చరిస్తోంది ఎస్‌బీఐ. ఒకవేళ ఇప్పటికే ఈ యాప్స్ ఇన్‌స్టాల్ చేసినట్టైతే యూజర్లు వాటిని వెంటనే డిలిట్ చేయడం మంచిది. ఇదొక్కటే బ్యాంకింగ్ లావాదేవీలను టార్గెట్ చేస్తూ నేరగాళ్లు చేసే మోసాలు చాలా రకాలుగా ఉంటాయి

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని ఎస్‌బీఐ సూచిస్తోంది. మీరు గిఫ్ట్స్ గెలిచారని, మీకు ప్రైజ్ వచ్చిందని నేరగాళ్లు నమ్మించి మీ డెబిట్ కార్డ్ నెంబర్, క్రెడిట్ కార్డ్ నెంబర్, సీవీవీ, పిన్ లాంటి వివరాలు తెలుసుకొని మీ అకౌంట్ ఖాళీ చేస్తారు. అందుకే ఎవరికీ ఇలాంటి సున్నితమైన వివరాలు వెల్లడించకూడదని హెచ్చరిస్తోంది ఎస్‌బీఐ. 

డెబిట్ కార్డ్ నెంబర్, క్రెడిట్ కార్డ్ నెంబర్, సీవీవీ, పిన్ లాంటి వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సిబ్బంది కూడా అడగరని చెబుతోంది బ్యాంకు. ఒకవేళ ఎవరైనా మీకు ఫోన్ చేసి, మెసేజ్ చేసి ఇలాంటి వివరాలు అడిగితే అప్రమత్తమవ్వాలి. మీ అకౌంట్ వివరాలు షేర్ చేయొద్దు. ఎలాంటి అనుమానాస్పద లింక్స్ క్లిక్ చేయొద్దు.

ఫేక్ బ్యాంక్ ఇమెయిల్ ఐడీస్‌కి రిప్లై ఇవ్వొద్దు. వెంటనే ఎస్‌బీఐ కాల్ సెంటర్ నెంబర్ 1800111109 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ https://cybercrime.gov.in/ లో కంప్లైంట్ ఇవ్వొచ్చు. 155260 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.