Rationalised-8th-class-sylubus-2023-24-deleted-chapters

Rationalised-8th-class-sylubus-2023-24-deleted-chapters

ఎనిమిదవ తరగతి సిలబస్ తగ్గింపు
_ఎనిమిదో తరగతి సిలబస్ ను NCERT బోర్డ్ తగ్గించింది. ఇంగ్లీష్, మ్యాథ్స్,  సైన్స్, సోషల్ స్టడీస్ లోని కొన్ని చాప్టర్లను పాక్షికంగా కుదించింది. మరికొన్నింటిని పూర్తిగా తొలగించింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది._

Deleted syllabus for 8th class CLICK HERE
తగ్గించిన సిలబస్ కొరకు పేపర్ క్లిపింగ్ చదివి తెలుసుకోవచ్చు.

8వ తరగతి సిలబస్ తగ్గింపు

విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఎన్సీఈఆర్టీ నిర్ణయం

8వ తరగతి విద్యార్థులకు బోధించే సిలబస్ ను ఎన్సీఈఆర్టీ బోర్డు తగ్గించింది. ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్లలోని కొన్ని చాప్టర్లను పాక్షి కంగా కుదించింది. మరికొన్నింటిని పూర్తిగా తొలగించింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గిం చేందుకు ఎన్సీఈఆర్టీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఎన్సీఈఆర్టీ సిలబస్ ప్రకారం బోధన చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తగ్గించిన సిలబస్ వివరాలను గురువారం ఉపాధ్యాయులకు పంపించారు. ఇంగ్లిష్ హనీడ్యూలోని 3, 7 చాప్టర్లలో పోయమ్స్ పాటు 9, 10 చాప్టర్లను పూర్తిగా తొలగించారు.

మ్యాథ్స్ ఒకటి నుంచి 16 చాప్టర్లలో.. ఒక్కో చాప్ట ర్లో కొన్ని భాగాలను తొలగించారు.

సైన్స్ (పీఎస్-బీఎస్) లో కొన్ని చాప్టర్లను పూర్తిగా తొలగించారు.

సోషల్-రిసోర్స్ అండ్ డెవలప్మెంట్లో మూడో చాప్టర్, 5వచాప్టర్లోని కొన్ని అంశాలను తొలగించారు. సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్-3లో 1, 3, 4, 5, 7, 8 చాప్టర్లను పాక్షికంగా, 6వ చాప్టర్ను పూర్తిగా తీసివేశారు. సోషల్-అవర్ పాస్ట్-3లో 2 నుంచి 10 వరకు చాప్టర్లను తొలగించారు.