prelims-screening-test-are-cancelled-in-APPSC-group-exams-details

prelims-screening-test-are-cancelled-in-APPSC-group-exams-details

APPSC: గ్రూప్ పరీక్షల్లో భారీ మార్పులు.. ఉద్యోగ నియామకంలో ప్రిలిమ్స్, స్క్రీనింగ్ రద్దు.

ఏపీ: జాబ్‌ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్..*

2021-22 ఏడాదికి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ను శుక్రవారం విడుదల చేశారు. దీనిలో భాగంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. దేవుని దయతో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్ ప్రకటించామన్నారు. ఈ మేరకు 10,143 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.* 

సీఎం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది జూలై నుంచి నెలల వారీగా చేపట్టనున్న నియామకాల వివరాలు ఇలా ఉన్నాయి:
జూలై-2021: బ్యాక్‌లాగ్‌ వేకెన్సీలు-ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు-1,238
ఆగస్టు-2021: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1&గ్రూప్‌ 2-36
సెప్టెంబర్‌-2021: పోలీస్‌ శాఖ ఉద్యోగాలు-450
అక్టోబర్‌-2021: వైద్య శాఖలో డాక్టర్స్&అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు-451
నవంబర్‌-2021: వైద్య శాఖలో పారామెడికల్‌, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు-5,251
డిసెంబర్‌-2021: వైద్య శాఖలో నర్సులు-441
జనవరి-2022: విద్యాశాఖ- లెక్చరర్లు(డిగ్రీ కాలేజీ)-240
ఫిబ్రవరి-2022: విద్యాశాఖ- అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు(యూనివర్సిటీలు)-2,000
మార్చి-2022: ఇతర శాఖలు-36
భర్తీ చేయనున్న మొత్తం ఉద్యోగాలు: 10,143

APPSC మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి.. ప్రైవేటు కోచింగ్ సెంటర్ల దోపీడీని అరికట్టేందుకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తోంది..

            APలో విద్యావిధానం మొత్తంలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ఈ ఏడాది నుంచి డిగ్రీని ఇంగ్లీష్ మీడియంలోకి మార్చేసింది. ఇప్పుడు గ్రూప్‌ -2, గ్రూపు 3 సహా ఇతర క్యాడర్‌ పోస్టుల భర్తీ పరీక్షల విధానంలో మార్పులు చేయాలని ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇకపై అన్నింటికీ ఒకే ఒక పరీక్ష నిర్వహించనున్నారు. మెరిట్ అభ్యర్థుల ద్వారా మాత్రమే ఆయా పోస్టులను భర్తీ చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గ్రూప్‌ –1 సహా అన్ని కేటగిరీల పోస్టుల భర్తీకి ప్రస్తుతం ప్రిలిమ్స్‌/స్క్రీనింగ్‌ టెస్టు.. అర్హత సాధించిన వారికి మెయిన్స్‌ పరీక్షను నిర్వహిస్తున్నారు. అయితే ఇకపై గ్రూప్‌ –1 మినాహా 2, గ్రూప్‌ –3 సహా ఇతర క్యాడర్‌ పోస్టులకు ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలని కమిషన్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక పరీక్షనే నిర్వహించి మెరిట్‌ అభ్యర్థులను సంబంధిత పోస్టులకు ఎంపిక చేయనుంది. దీనికి సంబంధించి ప్రతిపాదనలను రెడీ చేస్తున్నట్టు సమాచారం.

            ప్రిలిమ్, స్క్రీనింగ్ టెస్టుల కారణంగా విలువైన సమయం వృధాతోపాటు అభ్యర్ధులపై మానసిక వత్తిడి పడుతోందనే అభిప్రాయం చాలా రోజుల నుంచి నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు పలు కోచింగ్ సెంటర్‌లు.. పరీక్షల పేరుతో విద్యార్థుల ఒత్తిడిని సొమ్ము చేసుకుంటుండటంతో ఏపీపీఎస్సీ కొత్తమార్పులకు శ్రీకారం చుట్టనుంది. ప్రస్తుతం గ్రూప్-1 తో సహ అన్ని కేటగిరి పోస్టుల భర్తీకి ముందుగా ప్రిలిమ్స్, స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి అందులో అర్హత సాధించిన వారిని మెయిన్స్ రాసేందుకు అనుమతిస్తున్నారు. ఈ తరహా విధానాన్ని ఒక్క గ్రూప్ 1కే పరిమితం చేయనున్నారు. మిగిలిన ఉద్యోగ నియామకాలను పరీక్ష విధానం ద్వారానే చేయాలన్న ప్రతిపాదనలను ఏపీపీఎస్సీ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. సమాచారం.

       గతంలో గ్రూప్‌–1 పోస్టులకే ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షల విధానం ఉండేది. అయితే గ్రూప్‌–2, గ్రూప్‌–3 పోస్టులకు ఒక పరీక్ష ద్వారానే ఎంపికలు ఉండేవి. 2014లో టీడీపీ అధికారం చేపట్టాక పోస్టుల భర్తీ విధానాన్ని మార్చింది. గ్రూప్‌–1 సహా అన్ని పోస్టులకూ ప్రిలిమ్స్‌/స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహించేలా ఆదేశాలిచ్చింది. ఆ నిర్ణయాన్ని మార్చింది ప్రస్తుత ప్రభుత్వం. అయితే కోచింగ్‌ కేంద్రాల దోపిడీకి చెక్ పెట్టడమే తమ ఉద్దేశంలో అంటోంది ఏపీపీఎస్సీ. అందులో భాగంగా ప్రిలిమ్స్‌/ స్క్రీనింగ్‌ విధానాన్ని రద్దు చేసే ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ విధానాన్ని మాత్రం కొందరు వ్యతిరేకిస్తుండగా.. మరికొందరు సరైన నిర్ణయం అంటూ సమర్ధిస్తున్నారు.

error: Content is protected !!
Scroll to Top