whatsapp-new-features-whatsapp-web-without-smartphone

స్మార్ట్‌ఫోన్ లేకపోయినా వాట్సప్ వెబ్ ఉపయోగించండి ఇలా

గతంలో స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోతే వాట్సప్ వెబ్  ఉపయోగించడం సాధ్యం కాదు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా వాట్సప్ వెబ్ యాక్సెస్ చేయొచ్చు.

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సప్ యూజర్లకు సరికొత్త ఫీచర్స్‌ని  అందిస్తూనే ఉంది. ఇటీవల మల్టీ డివైజ్ ఫీచర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఒక యూజర్ తన వాట్సప్ అకౌంట్‌ను ఒకేసారి నాలుగు డివైజ్‌లల్లో ఉపయోగించుకోవచ్చు. ఒక డివైజ్‌లోని ఛాటింగ్ మరో డివైజ్‌లో సింక్ అవుతుంది. ఈ మెసేజెస్, మీడియా, కాల్స్ అన్నింటికీ ఎండ్ టు ఎంట్ ఎన్‌క్రిప్షన్ వర్తిస్తుంది.

సాధారణంగా వాట్సప్‌ను వెబ్ వర్షన్ లేదా బ్రౌజర్‌లో ఉపయోగించాలంటే స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ యాక్టీవ్‌గా ఉండాలి.

కానీ ఇకపై స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా మిగతా డివైజ్‌లల్లో వాట్సప్ ఉపయోగించొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

వాట్సప్ మల్టీ డివైజ్ ఫీచర్ ఉపయోగించండి ఇలా

Step 1- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ యాప్ ఓపెన్ చేయండి.

Step 2- టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న త్రీ డాట్ ఐకాన్ క్లిక్ చేయండి.

Step 3- Linked devices పైన క్లిక్ చేయండి.

Step 4- ఆ తర్వాత Multi-device beta ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

Step 5- ఆ తర్వాత Join Beta పైన క్లిక్ చేయండి.

Step 6- ఆ తర్వాత Continue పైన క్లిక్ చేయాలి.

Step 7- వాట్సప్ వెబ్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ స్మార్ట్‌ఫోన్‌కు లింక్ చేయాలి.

ఆ తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా వాట్సప్ ఉపయోగించుకోవచ్చు. మెసేజెస్ పంపొచ్చు. ఫైల్స్ కూడా షేర్ చేయొచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ ఓపెన్ చేసినప్పుడు వాట్సప్ వెబ్ ద్వారా చేసిన మెసేజెస్ సింక్ అవుతాయి. స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా వాట్సప్ వెబ్‌లో వాట్సప్ యాక్టీవ్‌గానే ఉంటుంది. అయితే మెయిన్ డివైజ్ 14 రోజులపాటు డిస్‌కనెక్టెడ్‌గా ఉంటే మిగతా డివైజ్‌లల్లో ఆటోమెటిక్‌గా వాట్సప్ లాగౌట్ అవుతుంది.

వాట్సప్ మల్టీ డివైజ్ ఫీచర్ వాడుకునేముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అన్ని ఫీచర్స్ ఉపయోగించుకోవడం సాధ్యం కాదు. ఛాట్స్ డిలిట్ చేయడం లాంటి కొన్ని ఫీచర్స్ పూర్తిగా పనిచేయవు. మల్టీ డివైజ్ ఫీచర్‌ను పూర్తి స్థాయిలో రూపొందించేందుకు వాట్సప్ కసరత్తు చేస్తోంది. దీంతో పాటు మరిన్ని ఫీచర్స్ రూపొందిస్తోంది వాట్సప్.

error: Don\'t Copy!!!!