pm-yashasvi-scholarship-2022-9th-11th-class-students

pm-yashasvi-scholarship-2022-9th-11th-class-students

PM YASASVI Scheme 2022: పాఠశాల విద్యార్థులకు ఎన్‌టీఏ–యశస్వి స్కాలర్‌షిప్‌

పీఎం యశస్వి ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి పీఎం యశస్వి ( పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డు స్కీమ్ ఫర్ వైబ్రంట్ ఇండియా ) పథకం కింద 9 , 10 తరగతుల బీసీ విద్యార్థులు ఉపకార వేతనాలు పొందటానికి దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష రాయడానికి ఈనెల 11 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది .

దరఖాస్తుల్లో తప్పులుంటే ఈ నెల 14 వ తేదీ వరకు సరిదిద్దుకోవచ్చు . 20 వ తేదీ నుంచి అడ్మిట్కార్డ్స్ అందుబాటులో ఉంటాయి . 25 వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది .

దరఖాస్తుదారుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ .2.50 లక్షలకు మించకూడదు .

ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి రూ .75 వేలు , ఇంటర్మీడియట్ ఫస్ట్ , సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులకు రూ .1.25 లక్షల స్కాలర్షిప్పు ఇస్తారు .

ఆసక్తి కలిగిన విద్యార్థులు yet.nta.ac.in వెబ్సైట్ను సంప్రదించాలి.

PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (YASASVI)

MSJ&E of the Govt. of India, has formulated a scheme known as PM Young achievers Scholarship Award Scheme for Vibrant India (YASASVI) for award of scholarships to Other Backward Class (OBC), Economically Backward Class (EBC) and Nomadic and Semi-Nomadic Tribes De-notified Tribe(DNT) students, annual income of whose parents/guardian is not more than Rs. 2.5 lakhs, studying in identified Schools.

The award of scholarships is at two levels:
* For students who are studying in Class IX
* For students who are studying in Class XI

Selection of candidates for award of Scholarships under the Scheme is through a written test known as YASASVI ENTRANCE TEST (YET) 2022.
MSJ&E of Govt. of India has entrusted the responsibility of conducting the YASASVI ENTRANCE TEST-2022 to NTA.

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పీఎం యంగ్‌ అచీవర్స్‌ స్కాలర్‌షిప్‌ అవార్డ్‌ స్కీమ్‌ (YASASVI) ప్రవేశ పరీక్ష–2022 కోసం ఓబీసీ, ఈబీసీ, డీఎన్‌టీ పాఠశాల విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఈ స్కాలర్‌షిప్‌లను భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ 15,000 మంది విద్యార్థులకు అందజేస్తుంది.

అర్హత

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో తొమ్మిది, పదకొండు తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. 

  • ఇతర వెనుకబడిన తరగతి(ఓబీసీ), ఆర్థికంగా వెనుకబడిన తరగతి(ఈబీసీ), సం చార, పాక్షిక–సంచార తెగల డీ–నోటిఫైడ్‌ తెగల(డీఎన్‌టీ)కు చెందిన విద్యార్థులే అర్హులు.

  • తల్లిదండ్రులు/సంరక్షకుల వార్షిక ఆదాయం రూ. 2.5లక్షలకు మించకూడదు.

పరీక్షా విధానం: 

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ)విధానంలో జరుగుతుంది. ప్రవేశ పరీక్షలో మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 3గంటలు.

పరీక్ష ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో జరుగుతుంది. దేశవ్యాప్తంగా 78 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. అభ్యర్థులు ఎలాంటి పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌  ద్వారా.    

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.09.2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://yet.nta.ac/

Last Date 11/09/2022