new-rules-for-getting-driving-licence-training

new-rules-for-getting-driving-licence-training

Driving License: ఎక్కడ డ్రైవింగ్ నేర్చుకుంటే.. అక్కడే లైసెన్స్.. జూన్ 1 నుంచే అమల్లోకి

డ్రైవింగ్ లైసెన్స్” కోసం ఇకపై జూన్ 1 నుండి కొత్త నిబంధన అమలులోకి వస్తుంది

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీవో కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారా? ఇకపై మీకా బాధ అక్కర్లేదు. జూన్ 1 నుంచి ప్రైవేటు శిక్షణ సంస్థలే డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి లైసెన్స్ చేతికి అందిస్తాయి.

డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో కేంద్రం భారీ మార్పులు చేస్తూ నిబంధనలు జారీచేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచే ఇది అమల్లోకి వస్తుంది. ప్రైవేటు సంస్థలకు డ్రైవింగ్ సర్టిఫికెట్ జారీచేసేందుకు అనుమతినిచ్చిన కేంద్రం అందుకు కొన్ని నిబంధనలు విధించింది

ఆ సంస్థలకు కనీసం ఎకరం భూమి ఉండాలి. ఫోర్ వీలర్ డ్రైవింగ్ శిక్షణ కోసం అదనంగా మూడు ఎకరాల భూమి ఉండాలి. ముఖ్యంగా ఆ సెంటర్ అందరికీ అందుబాటులో ఉండాలి. రాకపోకలకు ఎలాంటి అంతరాయమూ ఉండకూడదు. శిక్షణ ఇచ్చే వారు కనీసం హైస్కూలు విద్యను పూర్తిచేసి ఉండాలి.

డ్రైవింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉండాలి. బయోమెట్రిక్స్, టెక్నాలజీపై ప్రాథమిక అవగాహన ఉండాలి.

ఇవన్నీ ఉంటేనే ప్రభుత్వం ఆ సంస్థలకు అనుమతినిస్తుంది. లైట్ వెహికల్ ట్రైనింగ్‌ను కచ్చితంగా 4 వారాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కనీసం 29 గంటల శిక్షణ ఇవ్వాలి. ఇది థియరీ, ప్రాక్టికల్ రూపంలో ఉండాలి. థియరీలో 8 గంటలు, ప్రాక్టికల్‌లో 21 గంటల శిక్షణ ఇవ్వాలి.

హెవీ మోటార్ వాహనాల డ్రైవింగ్‌కు ఆరువారాల పాటు కనీసం 39 గంటల ట్రైనింగ్ ఇవ్వాలి. ఇందులో 8 గంటల థియరీ, 31 గంటల ప్రాక్టికల్ తరగతులు ఉండాలి. ఫీజుల విషయానికొస్తే.. లెర్నర్ లైసెన్స్ 200 రూపాయలు, లెర్నర్ లైసెన్స్ రెన్యువల్ 200 రూ. , పెర్మనంట్ లైసెన్స్ 200 రూపాయలు, ఇంటర్నేషనల్ లైసెన్స్ 1000 రూపాయలుగా ఉంది.