Lost-your-PAN-card?-How-to-get-new-pan-card-online-information

Lost-your-PAN-card?-How-to-get-new-pan-card-online-information

Pan card: మీ పాన్ కార్డు పోయిందా?*

           ఆర్థిక లావాదేవీల్లో పాన్‌ కార్డు భాగంగా మారిపోయింది. ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) ఫైలింగ్ మొదలుకొని బ్యాంక్ ఖాతా తెరవడం, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేయడం మొదలైన వాటికి కేవైసీ పూర్తి చేయ‌డానికి పాన్ అవ‌స‌రం. అయితే అనుకోకుండా పాన్ కార్డ్‌ను పోగొట్టుకుంటే ఎలా? నంబర్‌ కూడా గుర్తు లేకపోతే ఏం చేయాలి? దీనికి పరిష్కారమే ఇ-పాన్‌. పాన్‌ కార్డు పోయినప్పుడు ప్రత్యామ్నాయంగా దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది ఆదాయపు శాఖ విభాగం. ఐటీ శాఖ వెబ్‌సైట్‌లో లాగిన్‌తో దీన్ని పొందొచ్చు.

పాన్ కార్డ్ సంఖ్య గుర్తు లేక‌పోయినా ఇది వరకే ఆధార్‌తో అనుసంధానం చేసి ఉంటే ఇట్టే ఇ-పాన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.*

*పాన్ నంబర్ లేకుండా ఇ-పాన్ కార్డు డౌన్‌లోడ్ ఎలా?

కొత్త‌ ఆదాయపు పన్ను పోర్టల్ నుంచి తక్షణ ఇ-పాన్‌ను డౌన్‌లోడ్ చేయడానికి మొదట పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి.

ఎడమవైపు దిగువ భాగంలో ఉన్న ‘Our Services’ వద్ద క్లిక్ చేయండి.

 అక్క‌డ‌ Instant E PAN క్లిక్ చేయండి.

‘New E PAN’ వద్ద క్లిక్ చేయండి.

మీరు కోల్పోయిన పాన్ కార్డ్ నంబర్ మీకు గుర్తులేనందున ఆధార్ కార్డు నంబర్‌ను నమోదు చేయండి.

నిబంధనలు, షరతులను జాగ్రత్తగా చదివాక ‘Accept’ బటన్ క్లిక్ చేయండి

మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయండి.

 వివరాలను జాగ్రత్తగా చెక్‌ చేయండి. మీ ఇ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి ‘Confirm’ క్లిక్ చేయండి.

మీ ఇ-మెయిల్ ఐడీకి ఇ-పాన్ వ‌స్తుంది. అక్క‌డ‌ ఇ-పాన్ పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

APPLY YOUR E-PAN CARD CLICK HERE

GET YOUR NEW e-PAN CARD

CHECK STATUS OR DOWNLOAD YOUR PAN CARD