Learn A Word A Day (22 days) in all schools under all managements from 05-07- 2022 to 30-07-2022

Learn A Word A Day(22 days) in all schools under all managements from 05-07-2022 to 30-07-2022

SCERT, AP – Quality Initiatives – Implementation of an Innovative Program “Learn A Word A Day (22 days) in all schools under all managements from 05-07- 2022 to 30-07-2022 – Action plan communicated.

1 నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఆంగ్లంలో అత్యుత్తమ పదజాలాన్ని అందించాలనే లక్ష్యంతో పాఠశాలల్లో “లెర్న్ ఎ వర్డ్ ఎ డే” అనే వినూత్న కార్యక్రమం అమలు చేయబడుతున్న విషయం అందరికీ తెలిసిందే*

విద్యార్థులలో పదజాలం, ఉచ్చారణ, స్పోకెన్ ఇంగ్లీష్ మెరుగుపరచడం, పిల్లలు డిక్షనరీని ఉత్తమంగా ఉపయోగించడం కోసం నిర్దిష్ట మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి

All the District Educational Officers in the state are aware that, a quality initiative “LEARN A WORD A DAY” to ensure the best vocabulary in English among the students from classes 1 to 10 has been implemented during the academic year 2021-2022. With the same spirit and outcome the program, it is proposed to continue for the ensuring academic year, as a part of this the implementation plan from 05.07.2022 to 30-07-2022 in 4 levels annexed herewith.

Therefore, all the District Educational Officers in the state are requested to communicate the action plan along with suggested guidelines to all teachers and headmasters of all schools under all managements with an instruction to implement the program “LEARN A WORD A DAY” across the state from 05-07-2022 to 30-07-2022 duly following the guidelines scrupulously.

విద్యార్థుల స్థాయిని ( తరగతిని) బట్టి 4 లెవెల్స్ గా విభజించాలి.

 *లెవెల్ 1 :* 1 నుండి 2 తరగతులు

 *లెవెల్ 2 :* 3 నుండి 5 తరగతులు

 *లెవెల్ 3 :* 6 నుండి 8 తరగతులు

 *లెవెల్ 4* : 9 మరియు 10     తరగతులు

ప్రతి రోజు  మొదటి పీరియడ్ లోఒక కొత్త ఆంగ్ల పదం పరిచయం చెయ్యాలి.

రెండవ పీరియడ్ లో పిల్లలచేత డిక్షనరీలో ఆ పదం యొక్క అర్థాన్ని వెతికించాలి.

 *గమనిక* : లెవెల్ 1 విద్యార్థులకు  ఆ రెండవ పీరియడ్ ఉపాధ్యాయుడే పదం యొక్క అర్థాన్ని వివిధ  ఉదాహరణలతో, వివిధ సందర్భాలలో ఎలా ఉపయోగించాలో వివరించాలి.

ఆంగ్ల ఉపాధ్యాయుడు తన పీరియడ్ లో పదాన్ని వివిధ సందర్భాలలో ఎలా ఉపయోగించాలో వివరించాలి.

4 వ పీరియడ్ లో level specific activities క్రింది విధంగా నిర్వహించాలి.

 *లెవెల్1:* ఓరల్ డ్రిల్లింగ్

 *లెవెల్ 2 :* స్పెల్లింగ్ గేమ్

 *లెవెల్ 3 :*  విద్యార్థులు డిక్షనరీ సహాయంతో పదం యొక్క parts of speech కనుక్కోవాలి.

 *లెవెల్ 4 :* విద్యార్థులు డిక్షనరీ సహాయంతో వ్యతిరేఖ పదాలు,సమాన అర్థ పదాలు వెతకాలి.

అదే పదం మిగిలిన అన్ని పీరియడ్ లలో repeat చెయ్యాలి.

ప్రతి రోజు ఒక పదాన్ని బోర్డ్ పై ఒక మూలలో వ్రాయాలి.వరండా లో, అసెంబ్లీ లో ప్రదర్శించాలి.

 అందరు టీచర్లు పదాన్ని,దాని అర్థాన్ని పీరియడ్ లో 5 నిమిషాలు పిల్లలచే ప్రాక్టీస్ చేయించాలి.

అయితే పదం యొక్క ఉపయోగిత మాత్రం ఆంగ్ల ఉపాధ్యాయుడు బోధించవచ్చు.

ఈ కార్యక్రమం కోసం విద్యార్థులు ప్రత్యేకంగా ఒక 100 పేజీల నోటు పుస్తకం పెట్టాలి. ఆ పుస్తకాన్ని ఉపాధ్యాయుడు తరచూ తనిఖీ చెయ్యాలి.

ప్రతి పక్షానికి (15 రోజులు), అంతవరకు నేర్పించిన పదాల పై “స్పెల్ బీ” నిర్వహించాలి.

ఇంటివద్ద పదాలను ప్రాక్టీస్ చేయమని ప్రోత్సహించాలి.

JULY 5  నుండి JULY 30 వరకు అన్ని మేనేజ్‌మెంట్‌ల పరిధిలోని అన్ని పాఠశాలల్లో 1నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు 30 రోజుల వరకు రోజుకో పదం “లెర్న్ ఎ వర్డ్ ఎ డే” (22 రోజులు) వినూత్న కార్యక్రమం అమలు – రోజువారీ కార్యాచరణ ప్రణాళికతో ఉత్తర్వులు, JULY 5 నుండి 22 రోజుల వరకు 1నుండి 10వ తరగతి వరకు తరగతుల వారీగా ప్రతిరోజు చెప్పవలసిన పదాల లిస్ట్ .