josaa-counselling-2023-schedule-released-important-dates

josaa-counselling-2023-schedule-released-important-dates

నేడు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలైనవి.

 దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలైన ఐఐటిల్లో ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించిన జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలను ఈరోజు(ఆదివారం) ఉదయం 10 గంటలకు విడుదలైనవి.. పరీక్షలను నిర్వహించిన గౌహతి ఐఐటి ఈ ఫలితాలను విడుదల చేస్తుంది. ఫలితాలను జెఇఇ అడ్వాన్స్డ్ అధికారిక సైట్లో చెక్ చేసుకోవచ్చు.

జూన్ 4వ తేదీన ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 1,89,744 మంది పరీక్షకు రిజిస్టర్ చేయించుకోగా 95 శాతం మంది అంటే లక్షా 80 వేల 226 మంది హాజరయ్యారు. పరీక్ష రెండు పేపర్లుగా నిర్వహించారు. మొదటి పేపర్ను ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, రెండో పేపర్ను మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5.30 గంటల వరకు నిర్వహించారు.

JEE (Advanced) – 2023 ఫలితాలు (Results) విడుదల

https://result23.jeeadv.ac.in/

JEE ADVANCED OFFICIAL WEBSITE LINK

జోసా’ కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) షెడ్యూలు జూన్ 7న విడుదలైంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు జూన్ 18న వెలువడనున్నాయి.

ఫలితాలు విడుదలైన మరుసటిరోజు నుంచే అంటే.. జూన్ 19 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది.

జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జోసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19 నుంచి 29 వరకు కొనసాగనుంది.

దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) షెడ్యూలు జూన్ 7న విడుదలైంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు జూన్ 18న వెలువడనున్నాయి. ఫలితాలు విడుదలైన మరుసటిరోజు నుంచే అంటే.. జూన్ 19 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జోసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19 నుంచి 29 వరకు కొనసాగనుంది.

సీట్ల కేటాయింపునకు సంబంధించి జూన్ 26 వరకు అభ్యర్థులకు మాక్‌ కౌన్సెలింగ్‌ అందుబాటులో ఉంటుందని.. దానివల్ల తమ ర్యాంకు ఆధారంగా ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. జూన్ 30 నుంచి అసలు ప్రక్రియ ప్రారంభంకానుంది. మొత్తం 6 రౌండ్ల కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 6 రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్లు ఖాళీగా ఉంటే జులై 26 నుంచి 31 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. సీట్లు పొందిన జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.40,000; ఇతరులు రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈసారి మొత్తం 114 విద్యాసంస్థలు కౌన్సెలింగ్‌లో పాల్గొననున్నాయి. అందులో 23 ఐఐటీలు, 32 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్‌ఐటీలు, మరో 38 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.

JOSA STATE WIDE VERIFICATION CENTERS PDF CLICK HERE

JoSAA Counselling ఇలా..

♦ 1వ రౌండ్‌ : జూన్ 30 నుంచి జులై 5 వరకు

♦ 2వ రౌండ్‌: జులై 6 నుంచి జులై 11 వరకు

♦ 3వ రౌండ్‌: జులై 12 నుంచి జులై 15 వరకు

♦ 4వ రౌండ్‌: జులై 16 నుంచి జులై 20 వరకు

♦ 5వ రౌండ్‌: జులై 21 నుంచి జులై 25 వరకు

♦ 6వ రౌండ్‌ (చివరి): జులై 26 నుంచి  జులై 28 వరకు నిర్వహిస్తారు. 
 
6 రౌండ్ల సీట్ల కేటాయింపు తేదీలు ఇవే:

♦ 1వ రౌండ్‌ సీట్ల కేటాయింపు: జూన్ 30న

♦ 2వ రౌండ్‌: జులై 6న

♦ 3వ రౌండ్‌: జులై 12న

♦ 4వ రౌండ్‌: జులై 16న

♦ 5వ రౌండ్‌: జులై 21న

♦ 6వ రౌండ్‌ (చివరి): జులై 26న

JEE ADVANCED OFFICIAL WEBSITE LINK

COMPLETE INFORMATION ABOUT JOSA COUNSELLING PDF