Issue of Income Certificate by Revenue Authorities – Revised orders

Issue of Income Certificate by Revenue Authorities – Revised orders

రేషన్ కార్డుయే ఇక ఆదాయ ధృవీకరణ పత్రము.ఇక బియ్యం కార్డుయే.. ప్రభుత్వ పథకాలకు Income certificate గా ప్రత్యేక ధృవీకరణ పత్రము అవసరం లేదు.

Revenue Department – Issue of Income Certificate/Rice Cards by Revenue Authorities – Revised Orders

బియ్యం కార్డునే ఆదాయ ధ్రువీకరణ పత్రంగా పరిగణించాలని, కార్డు లేని వారికి ఇచ్చే ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌) కాలపరిమితిని ఏడాది నుంచి నాలుగేళ్లకు పెంచాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

బియ్యం కార్డు చాలు
బియ్యం కార్డు ఉన్న వారిని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలేవీ ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అడగరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రం చెల్లుబాటు కాలాన్ని నాలుగేళ్లకు పొడిగించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి శనివారం జీఓ జారీ చేశారు. జీఓలోని ముఖ్యాంశాలివీ..
► ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇవి బియ్యం కార్డులను జారీ చేస్తున్నాయి. ఈ కార్డులున్న వారిని దారిద్య్రరేఖకు దిగువనున్న (బీపీఎల్‌) కుటుంబాలుగా పరిగణించాలి. 
► ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు బీపీఎల్‌ కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు నిర్వహించే ఎంపిక కార్యక్రమాలకు బియ్యం కార్డు ఉంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం అడగరాదు.
► తెల్లరేషన్‌ కార్డు లేని వారికి అధికారులు ఇచ్చే ఆదాయ ధ్రువీకరణ పత్రం నాలుగేళ్లపాటు చెల్లుబాటవుతుంది.
► ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఒరిజనల్‌ ఆదాయ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి నోట్‌ చేసుకుని తక్షణమే సంబంధితులకు వెనక్కు ఇవ్వాల్సిందే. 
► స్కాలర్‌ షిప్‌ల మంజూరు సమయంలో మాత్రమే ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పరిశీలించాలి. రెన్యువల్‌కు వీటిని అడగరాదు.
► ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరు కోసం ప్రభుత్వం జారీ చేసిన నమూ నాలో ప్రజలు రూ.10 నాన్‌ జ్యుడీషి యల్‌ స్టాంపు పేపరుతోపాటు మూడు కాపీలు తహసీల్దారు కార్యాలయంలో సమర్పించాలి. 

G.O.NUMBER 205, DATE 25.07.2020 CLICK HERE

Keeping in view of the circumstances, Govt. had issued revised orders
in G.O. 2nd read above, while reiterating the orders read in the GO direct
that:
i. “No State Government Department and corporations / Institutions /
State PSUs / selecting BPL beneficiaries shall ask for an Income certificate as long as any person to be treated as BPL category. No separate Income certificate need be insisted in such cases.
ii. With respect to beneficiaries who does not have White Ration Card,
the validity of Income Certificate issued shall be for a period of Four (4) Years”.

G.O.NO.205 PDF CLICK HERE