how-to-control-diabetes-blood-sugar-levels

how-to-control-diabetes-blood-sugar-levels

ఇలా చేస్తే షుగర్ వ్యాధి పెరుగుతుందట.. జాగ్రత్త..

ఈ మధ్య కాలంలో చాలా మంది డయాబెటిస్‌తో బాధ పడుతున్నారు. డయాబెటిస్ సమస్య ఉన్న వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అదే విధంగా రెగ్యులర్‌గా చెకప్ చేయించుకోవడం కూడా ముఖ్యం. అయితే ఈ రోజు డయాబెటిస్ ఉన్న వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఏ విధంగా ఫాలో అవ్వాలి అనే దాని గురించి చూద్దాం. వీటిని కనుక డయాబెటిస్ ఉన్న వాళ్లు ఫాలో అయ్యారంటే కచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది. అలానే సమస్యల నుండి బయట పడవచ్చు. అయితే మరి డయాబెటిస్ ఉన్న వాళ్లు ఎలాంటి వాటిని అనుసరించాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

డయాబెటిస్ ఉన్న వాళ్ళు అల్పాహారం తీసుకునే సమయంలో ఈ తప్పులు చేయకూడదు. బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉండాలంటే రెగ్యులర్‌గా తినడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. లేదంటే అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది

ఫైబర్ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు. కొలెస్ట్రాల్‌ను కూడా ఇది తగ్గిస్తుంది. కాబట్టి ఉదయం పూట తీసుకునే అల్పాహారం‌లో ఫైబర్ ఉండేట్టు చూసుకోండి.

చాలా మంది బ్రేక్‌ఫాస్ట్ ఏంటి లంచ్ చేద్దాంలే అని అనుకుంటారు. అయితే ఉదయం అల్పాహారం మానేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. దీంతో రోజంతా కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఇంకా బ్లడ్ షుగర్ లెవల్స్ బాగా పెరిగిపోతే దీని వల్ల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి అల్పాహారాన్ని అసలు స్కిప్ చేయకండి.

అదే విధంగా డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఉదయాన్నే తీసుకొనే అల్పాహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాత్రి తిన్న తర్వాత ఎనిమిది నుండి పది గంటల పాటు ఏమీ తినకుండా వుంటారు. దీనితో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక అల్పాహారం ఎప్పుడూ బాగా ఉండేటట్టు చూసుకోవాలి. లేదంటే డయాబెటిస్ వాళ్లకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అయితే డయాబెటిస్ ఉన్న వాళ్లు అల్పాహారం విషయంలో కచ్చితంగా వీటిని అనుసరించాలి.

కార్బోహైడ్రేట్ బ్లడ్ షుగర్ లెవల్స్‌ని పెంచుతాయి. అలానే త్వరగా డైజెస్ట్ అయిపోతాయి. కనుక మీరు కార్బోహైడ్రేట్స్‌తో పాటు ప్రొటీన్లు తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అలాగే షుగర్ లెవెల్స్‌ను కూడా మెయింటైన్ చేయడానికి అవుతుంది.

ఫ్యాట్ లేని ప్రొడక్ట్స్ లేదా తక్కువ ఫ్యాట్ ఉండే వాటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఫ్యాట్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల డైజేషన్ ప్రాసెస్ స్లో అవుతుంది. దీంతో కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది.

డయాబెటిస్‌తో బాధ పడే వాళ్లు వీలైతే పండ్లు తినండి. కానీ జ్యూసులను తాగుతూ కేవలం జ్యూస్ లేదా స్మూతీ వంటివి ఉదయాన్నే తీసుకోవడం వల్ల ఆకలి తీరదు పైగా జ్యూస్ తాగడం వల్ల మీకు ఆకలి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఉదయాన్నే కేవలం వాటితోనే ఉండకండి.

​ప్రాసెస్డ్ ఫుడ్‌కి దూరంగా :

చాలా మంది ఈ మధ్య కాలంలో ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నారు. దీని వల్ల తక్కువ కేలరీలు, పోషక పదార్థాలు మాత్రమే అందుతాయి. పైగా ఇవి ఆరోగ్యానికి హానికరం కూడా. కనుక డయాబెటిస్‌తో బాధ పడే వాళ్లు వీటికి కూడా దూరంగా ఉండండి. చూశారు కదా డయాబెటిస్ ఉన్న వాళ్లు ఎలాంటి చిట్కాలను ఫాలో అవ్వాలి అనేది. మరి ఆ విధంగా ఫాలో అయ్యి సమస్యలు లేకుండా ఉండండి. వీటిని కనుక ఫాలో అవ్వలేదు అంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకనే తప్పకుండా ఈ సులువైన టిప్స్ ని ఫాలో అయ్యి డయాబెటిస్ తో బాధ పడే వాళ్లు ఆరోగ్యంగా ఉండండి. పైగా సమస్యలేమీ కూడా దీని వల్ల ఉండవు.