AP Cabinet Meeting-details-July-12th-2023

AP Cabinet Meeting-details-July-12th-2023

AP Cabinet Meet : అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు – ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.

ఏడాదిలోగా ఈ వేతన సవరణ సంఘం వివిధ అంశాలపై అధ్యయనం చేసి రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో వివరించింది.

పూర్తి వివరాలు, ఉత్తర్వులు కాపీ క్రింది వెబ్ పేజీలో కలవు. CLICK HERE

AP Cabinet Meet : ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  మూడున్నర గంటలపాటు 55 అంశాలపై కేబినెట్ భేటీ జరిగింది.  ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలపడంతో పాటు రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు, భూ కేటాయింపులు రాష్ట కేబినెట్‌ చేసింది. అలాగే.. అసైన్‌మెంట్‌ ల్యాండ్‌ విషయంలో, నిరుపేదలకు ఇచ్చిన ల్యాండ్‌ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ సమావేశంలో పలు ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వైసీపీ సర్కార్. ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. వైఎస్సార్ సున్నా వడ్డి పథకం అమలుకు.. ఎస్ఐపీబీ నిర్ణయాలకు కూడా ఆమోదం తెలిపింది. అలాగే జనవనరుల శాఖలో పలు నిర్ణయాలకు కూడా గ్రీన్ ఇచ్చేశారు.

అసైన్డ్ భూములపై అనుభవదారులకి సర్వ హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 20 సంవత్సరాలకు ముందు కేటాయించిన భూములకు సైతం హక్కులు కల్పించేలా నిర్ణయించారు. దీంతో ఇతర రైతుల మాదిరిగానే వారికి క్రయ-విక్రయాలపై పూర్తి హక్కులు దక్కుతాయి.

 మొత్తం 63,191,84 ఎకరాల అసైన్‌మెంట్‌ ల్యాండ్స్‌, లంక భూముల విషయంలో 66,111 మందికి పూర్తి హక్కులు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.  ఒరిజినల్‌ అసైనీలకు మాత్రమే ఇది వర్తించనుంది. ఒరిజినల్‌ అసైనీలు కాలం చేస్తే.. వారి వారసులకు ఈ నిబంధన వర్తిస్తుంది.  

1966 రెవెన్యూ గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికల ఏర్పాటునకు నిర్ణయిం తీసుకుంది.  రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్‌ పర్చేజ్‌ స్కీం కింద దళితులకు ఇచ్చిన 16,213 ఎకరాలకు సంబంధించి వారు కట్టాల్సిన రుణాలు మాఫీ. తద్వారా పూర్తి హక్కులు కల్పిస్తారు.  

వైఎస్సార్‌ సున్నా వడ్డీ ​ఈ పథకం అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  కేంద్రం నుంచి వచ్చిన క్లియరెన్స్‌తో..అమరావతి సీఆర్‌డీఏలో 47 వేల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  వర్సీటీలో శాశ్వత అధ్యాపకుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. 

రాష్ట్రంలో అర్చకులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించే దిశగా అడుగులు వేస్తోంది. అర్చకులకు రిటైర్‌మెంట్‌ లేకుండా చట్టసవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల్లాగే దేవాదాయ శాఖ ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

టోఫెల్‌ పరీక్షలకు ప్రభుత్వ విద్యార్థులకు శిక్షణ కోసం ప్రముఖ విద్యాసంస్థ ఈటీఎస్‌తో చేసుకున్న ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదించింది.  కర్నూల్‌లో కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌కు 247 పోస్టులు మంజూరుచేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.  జులైలో చేపట్టబోయే పలుసంక్షేమ పథకాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
 
కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు జగన్. ఎన్నికలకు అందరూ సన్నద్ధం కావాలని సూచించారు. నిత్యం ప్రజల్లోనే ఉండాలంటూ దిశానిర్దేశం చేశారు.  ప్రభుత్వ కార్యక్రమాలపై ఆరా తీశారు.

జగనన్న సురక్ష కార్యక్రమం బాగా జరుగుతోందన్న సీఎం.. మరింత బాగా కొనసాగించాలన్నారు. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం మెరుగ్గా సాగేలా చూడాలని సూచించారు. అన్ని కార్యక్రమాలు చేస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని తెలిపారు. 

జగనన్న సురక్ష అమలుపైనా కేబినెట్‌ భేటీలో ప్రస్తావనకు రాగా.. అద్భుతమైన ఫలితాలపై సీఎం జగన్‌ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘‘ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు అక్కడికక్కడే సచివాలయాలు ద్వారా అందిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు’’ అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.