how-to-change-aadhar-card-address-online-without-proof

how-to-change-aadhar-card-address-online-without-proof

Aadhaar Card Update: డాక్యుమెంట్స్ లేకపోయినా ఆధార్‌లో అడ్రస్ మార్చొచ్చు ఇలా

ధార్‌లో చిరునామా మార్పు సులభమే. గెజిటెడ్‌ ఆఫీసర్‌ ధ్రువీకరణతోనూ మార్చుకోవచ్చు..*

ఆధార్‌ కార్డులో చిరునామ మార్పులను కేంద్ర ప్రభుత్వం సరళతరం చేసిందని ఆధార్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఎస్‌.గోపాలన్‌ చెప్పారు. గెజిటెడ్‌ ఆఫీసర్‌ ధ్రువీకరణ పత్రం ద్వారా చిరునామాను మార్చుకోవచ్చని వివరించారు. ‘‘గెజిటెడ్‌ అధికారి సంబంధిత వ్యక్తుల చిరునామాను ధ్రువీకరిస్తూ లేఖ ఇస్తే దాన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నాం. రేషన్‌కార్డు, వంట గ్యాస్‌ బిల్లు, అద్దె ఇంటి యజమానితో చేసుకున్న ఒప్పందం పత్రం (రెంటల్‌ అగ్రిమెంట్‌)ను కూడా ఆమోదిస్తున్నాం’’ అని వివరించారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల ఆధార్‌ వ్యవహారాలను పర్యవేక్షించే ఆయన బెంగళూరు నుంచి ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.*

ప్ర: స్వీయ ధ్రువీకరణతో చిరునామాలో మార్పులకు అవకాశం ఉందా?

*జ: సాధ్యం కాదు. దరఖాస్తులో పేర్కొనే చిరునామాకు మద్దతుగా చెల్లుబాటు అయ్యే పత్రం లేదా ఎలక్ట్రానిక్‌  ధ్రువీకరణ అనివార్యం.*

ప్ర: ఆధార్‌ కార్డులో పేరు, పుట్టిన తేదీ వంటి సవరణలు చేసుకోవటం కష్టంగా ఉందని ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఎందుకని?

*జ: మీరు చెబుతున్నంత సమస్య ప్రస్తుతం లేదు. సులువుగా సవరణలు చేసేందుకు సౌలభ్యాలను కల్పించాం. ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు లేదా ఆధార్‌ కేంద్రాల్లోనూ చేసుకోవచ్చు. సమీపంలో ఉన్న బ్యాంకుల్లో సదుపాయం అందుబాటులో ఉంది. స్త్రీ,శిశు సంక్షేమ, పాఠశాల శాఖల్లోనూ అవకాశం కల్పించాం. సెల్ఫ్‌ సర్వీస్‌ అప్‌డేట్‌ పోర్టల్‌(ఎస్‌ఎస్‌యూపీ) ద్వారా చేసుకోవచ్చు.*

ప్ర: అనుసంధానం ఎంత వరకు ఉపయుక్తంగా ఉంటోంది?

*జ: ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయటం ద్వారా గణాంకాల్లో స్పష్టత వస్తోంది. మత్స్యకారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వారిని గుర్తించేందుకు వీలుగా క్యూఆర్‌ కోడ్‌తో కార్డులు జారీ చేయటం ప్రయోజనకరంగా ఉంది. ఆదాయ పన్నుతో లింకు చేయటంతో సరైన పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు అవకాశం ఏర్పడింది.*

ప్ర: ఆన్‌లైన్‌లో సవరణలను అనుమతించినా సమాచారం రావటం లేదన్న ఫిర్యాదులొస్తున్నాయి కదా?

*జ: కార్డుదారులు అవసరానికి మించిన సమాచారాన్ని నమోదు చేస్తే ఇబ్బందులొస్తాయి. గతంలో నమోదు చేసిన సమాచారానికి ప్రస్తుత నమోదుకు వ్యత్యాసం ఉంటే అనుమతించకపోవచ్చు.

ప్ర: కార్డుల దుర్వినియోగంపై ఏమంటారు?

*జ: ఆధార్‌కార్డుల నమోదు, సవరణలు, ధ్రువీకరించటం వరకే యూఐడీఏఐ బాధ్యత. నమోదు సమయంలో అన్ని రకాల జాగ్రత్తలను కేంద్రం తీసుకుంటోంది. విచారణ వ్యవహారాలు స్థానిక ప్రభుత్వాల పర్యవేక్షణలో ఉంటాయి.

 CHANGE YOUR AADHAR ADDRESS CLICK HERE

  • మనం ఒక చోటు నుంచి మరో చోటుకు మారుతూ ఉంటాం..

  • ఇలాంటి సందర్భాల్లో వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ కష్టంగా మారొచ్చు

  • ఈ సమస్య పరిష్కరించేందుకు యూఐడీఏఐ చర్యలు

  • అడ్రస్ ప్రూఫ్ లేకుండానే ఆధార్‌లో అడ్రస్ మార్చుకునేందుకు వెసులుబాటు

చాలావరకు వివరాలను ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేయొచ్చు. కొన్ని వివరాల కోసం ఆధార్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది

ఉద్యోగం చేసేవాళ్లు ఒక చోటు నుంచి మరో చోటుకు బదిలీ అవుతుంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఒకే నగరంలో ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి మారుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్ పొందటం కష్టంగా మారొచ్చు. అలాగే ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
           యూఐడీఏఐ ఇలాంటి వారి కోసం ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడానికి వెసులుబాటు కల్పించింది. దీనికి వ్యాలిడ్ రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూప్ సమర్పించాల్సిన అవసరం లేదు. అడ్రస్ వ్యాలిడేషన్ లెటర్ అందిస్తే సరిపోతుంది.

          ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడానికి ముందు మీ మొబైల్ నెంబర్ ఆధార్‌తో లింక్ అయ్యిందో లేదో చూసుకోండి. మీ ఆధార్ కార్డుతో లాగిన్ అవ్వాలంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తప్పనిసరి. అలాగే అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లను దగ్గర పెట్టుకోండి.

        వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ లేకపోతే.. యూఐడీఏఐ పంపే అడ్రస్ వ్యాలిడేషన్ లెటర్ సాయంతో ఆధార్‌లో అడ్రస్ మార్చుకోవచ్చు. అడ్రస్ వ్యాలిడేషన్ లెటర్‌కు విజ్ఞప్తి పంపాలంటే రెసిడెంట్.. అడ్రస్ లెండర్ లేదా వెరిఫయర్ నుంచి అనుమతి తీసుకోవాలి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, యజమానులు ఇలా ఎవరైనా అడ్రస్ లెండర్ లేదా వెరిఫయర్‌గా ఉండొచ్చు.

ఆధార్ వ్యాలిడేషన్ లెటర్ పొందడం ఎలా?

అడ్రస్ వ్యాలిడేషన్ లెటర్‌ కోసం రెసిడెంట్.. యూఐడీఏఐ పోర్టల్‌లో ఆధార్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత వెరిఫయర్ ఆధార్ ఎంటర్ చేయాలి. సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ (ఎస్ఆర్ఎన్) వస్తుంది.

✺ ఇప్పుడు అడ్రస్ వెరిఫయర్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇతనికి వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ), లింక్ వస్తుంది. వెరిఫయర్ లింక్‌పై క్లిక్ చేసి తన అనుమతి ఇవ్వాలి.

✺ వెరిఫయర్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎన్‌తో లాగిన్ అవ్వాలి. అడ్రస్ చూసుకోవచ్చు. మార్పులు అవసరమైతే చేసుకొని సబ్‌మిట్ చేయాలి.

✺ రెసిడెంట్‌ కోసం అడ్రస్ వ్యాలిడేషన్ లెటర్ పోస్ట్ ద్వారా వెరిఫయర్ అడ్రస్‌కు వస్తుంది. రెసిడెంట్ అడ్రస్ వ్యాలిడేషన్ లెటర్ తీసుకున్న తర్వాత అతను మళ్లీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ప్రొసీడ్ టు అప్‌డేట్ అడ్రస్‌పై క్లిక్ చేసి సీక్రెట్ కోడ్ ఎంటర్ చేయాలి. మీ అడ్రస్ మారుతుంది.

కానీ ఇప్పుడు ఆధార్ సెంటర్‌కు వెళ్లకుండా ఆన్‌లైన్‌లో అడ్రస్ అప్‌డేట్ చేసే అవకాశం కల్పిస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. అంతేకాదు… డాక్యుమెంట్స్ లేకపోయినా అడ్రస్ అప్‌డేట్ చేయడం సాధ్యమవుతుంది. మరి ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో, ఏఏ స్టెప్స్ ఫాలో కావాలో తెలుసుకోండి.

ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయాలి.

హోమ్ పేజీలో My Aadhaar సెక్షన్‌లో Update Your Aadhar పైన క్లిక్ చేయాలి.

ఆ తర్వాత Update Demographics Data Online పైన క్లిక్ చేయాలి.

కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. Proceed to Update Aadhaar పైన క్లిక్ చేయాలి.

మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Send OTP పైన క్లిక్ చేయాలి.

మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.

లాగిన్ అయిన తర్వాత Update Address పైన క్లిక్ చేయాలి.

అందులో మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి.

Update Address via Address Proof లేదా Update Address via Secret Code సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
మొదటి ఆప్షన్ ఎంచుకుంటే మీరు అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి.

 CHANGE YOUR AADHAR ADDRESS CLICK HERE