GATE-2023-notification-online-application-syllabus-exam-pattern
GATE 2023 నోటిఫికేషన్.. ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో మాస్టర్స్… ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువు సైతం
గేట్–2023 షెడ్యూల్ విడుదల
2023 ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో పరీక్ష
గేట్ స్కోర్‌తో ఎంటెక్, పీహెచ్‌డీ; పీఎస్‌యూ కొలువులు
650కు పైగా స్కోర్ సాధిస్తేనే
గేట్‌లో విజయం ద్వారా ఐఐటీల్లో సీట్లు, పీఎస్‌యూ కాల్స్ ఆశించాలంటే.. గేట్‌లో కనీసం 650కు పైగా స్కోర్ సాధించేందుకు కృషి చేయాలి. దాదాపు అన్ని ఇన్‌స్టిట్యూట్‌లు కనీస కటాఫ్‌ను 600గా నిర్దేశిస్తున్నాయి. తుది ఎంపికలో టాప్ బ్రాంచ్‌లలో ఫైనల్ కటాఫ్ 800 వరకు ఉంటోంది. కాబట్టి సీఎస్‌ఈ, ఈసీఈ, ఐటీ, ఈఈఈ, మెకానికల్ వంటి బ్రాంచ్‌ల విద్యార్థులు.. ఇప్పటి నుంచే పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాలి.
గేట్.. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. ఈ పరీక్ష ఐఐటీలు, ఐఐఎస్సీ సహ పలు ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్ విభాగాల్లో పీజీ/పీహెచ్‌డీ; అలాగే ఆర్ట్స్, సైన్స్ విభాగాల్లో డాక్టోరల్ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు మార్గం! ఇందులో సాధించిన స్కోర్‌తో ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో మాస్టర్స్/పీహెచ్‌డీలో చేరిన అభ్యర్థులు ఆర్థిక ప్రోత్సాహాన్ని కూడా అందుకోవచ్చు. అంతేకాకుండా గేట్ స్కోర్‌తో పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువు సైతం సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి బహుముఖ అవకాశాల గేట్2023కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. గేట్ దరఖాస్తుకు అర్హతలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్ గురించి తెలుసుకుందాం…
గేట్ 2023 పరీక్షను ఐఐటీకాన్పూర్ నిర్వహిస్తోంది. ఈ ఏడాది మొత్తం 29 పేపర్లలో పరీక్ష ఉంటుంది. గేట్ స్కోర్ మూడేళ్లు పరిగణనలో ఉంటుంది.
అర్హతలు
ఇంజనీరింగ్/టెక్నాలజీ/అర్కిటెక్చర్/సైన్స్/కామర్స్/ఆర్ట్స్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ స్థాయి కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసే విద్యార్థులు కూడా దరఖాస్తుకు చేసుకోవచ్చు. గేట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. ఈ పరీక్షను ఎన్నిసార్లయినా రాసుకోవచ్చు.
GATE-2023 ONLINE APPLICATION

GATE-2023 OFFICIAL WEBSITE
పేపర్స్ ఇవే
ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎకాలజీ అండ్ ఎవల్యూషన్, జియోమాటిక్స్ ఇంజనీరింగ్, జియాలజీ అండ్ జియోఫిజిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మేథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్, ఫిజిక్స్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, స్టాటిస్టిక్స్, టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ అండ్ ఫైబర్ సైన్స్, ఇంజనీరింగ్ సైన్సెస్, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్.
రెండు పేపర్లు రాసేలా
గేట్2023లో అభ్యర్థులు కావాలనుకుంటే రెండు పేపర్లకు కూడా హాజరయ్యే అవకాశముంది. తమ అర్హతలకు తగ్గట్టు ఏదో ఒకటి లేదా రెండు పేపర్లు విద్యార్థుల ఇష్ట ప్రకారం ఎంచుకోవచ్చు. గేట్ పరీక్షను మన దేశంలోనే కాకుండా దుబాయ్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్),ఢాకా(బంగ్లాదేశ్),ఖాట్మం డ్ (నేపాల్), సింగపూర్‌ల్లోనూ నిర్వహిస్తున్నారు.
పరీక్ష విధానం
గేట్ పరీక్షను ఆన్‌లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ తరహాలో మూడు రకాలుగా ప్రశ్నలు అడుగుతారు. అవి.. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, మల్టిపుల్ సెలక్ట్ ప్రశ్నలు, న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు. మొత్తం 65 ప్రశ్నలు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. జనరల్ అప్టిట్యూడ్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, సబ్జెక్ట్ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం మూడు గంటలు.
జనరల్ ఆప్టిట్యూడ్
ఈ విభాగంలో మొత్తం పది ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఐదు ఒక మార్కు ప్రశ్నలు, అలాVó మరో ఐదు రెండు మార్కుల ప్రశ్నలు. ఈ విభాగానికి సంబంధించి నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు ఇంగ్లిష్ సంబంధిత(వెర్బల్ ఎబిలిటీ), మిగతా ప్రశ్నలు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్‌కు సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
సబ్జెక్ట్ విభాగం
-
ఇందులో అడిగే ప్రశ్నలు సంబంధిత సబ్జెక్టు నుంచి అడుగుతారు. మొత్తం 55 ప్రశ్నలుంటాయి. ఇందులో 25 ఒక మార్కు ప్రశ్నలు కాగా 30 రెండు మార్కుల ప్రశ్నలుంటాయి.
-
మ్యాథమెటిక్స్ నుంచి 1015 మార్కులుంటాయి. కానీ ఇవి ప్యూర్ మ్యాథ్స్ స్థాయిలో ఉండవు. ఇంజనీరింగ్ అప్లికేషన్‌తో ఉంటాయి. ప్రశ్నలు ఆయా రంగాల్లోని నూతన ఆవిష్కరణలను దృష్టిలోపెట్టుకొని అడిగే అవకాశం ఉంటుంది.
నెగిటివ్ మార్కులు
మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల్లో మాత్రమే తప్పుగా గుర్తించిన సమాధానానికి మూడో వంతు మార్కుల కోత విధిస్తారు. అంటే.. ఒక తప్పు సమాధానానికి 33.33శాతం కోత ఉంటుంది. రెండు మార్కుల ప్రశ్నలకు 2/3వంతు చొప్పున రుణాత్మక మార్కులుంటాయి. న్యూమరికల్, బహుళ ఎంపిక ప్రశ్నలకు రుణాత్మక మార్కులుండవు.
వర్చువల్ కాలిక్యులేటర్
పరీక్ష కేంద్రంలోకి కాలిక్యులేటర్‌ను అనుమతించరు. అభ్యర్థులు కాలిక్యులేషన్స్ చేసుకోవడానికి ఆన్‌లైన్ వర్చువల్ కాలిక్యులేటర్ అందుబాటులో ఉంటుంది. కంప్యూటర్ మౌస్‌ను ఉపయోగించి ఈ కాలిక్యులేటర్‌ని వాడుకోవచ్చు.
ప్రిపరేషన్ ఇలా
-
2023 ఫిబ్రవరిలో గేట్ పరీక్షను నిర్వíßంచనున్నారు. అంటే.. ఇంకా దాదాపు ఏడు నెలల సమయం అందుబాటులో ఉంది. కాబట్టి అభ్యర్థులు పూర్తిస్థాయి ఆత్మవిశ్వాసంతో ప్రిపరేషన్ సాగించొచ్చు.
-
ప్రతి సబ్జెక్టు సంబంధించి లోతైన అవగాహన పెంచుకోవాలి. మొదటగా సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలించడం ద్వారా ఏ సబ్జెక్టుల్లో ఏయో అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టాలో తెలుస్తుంది.
-
ప్రిపరేషన్‌కు, పరీక్షకు సమయ పాలన అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఏ రోజు టాపిక్‌ను ఆ రోజే పూర్తిచేయాలి. ప్రతి సబ్జెక్ట్, చాప్టర్‌కు సంబంధించి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. క్లిష్టమైన ప్రశ్నలు, సాధారణ ప్రశ్నలు.. ప్రతి దానికి సమ ప్రాధాన్యత ఇవ్వాలి.
-
ప్రిపరేషన్‌లో భాగంగా మాక్ టెస్టులు, ప్రాక్టీస్ టెస్టులు, గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. తద్వారా ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవచ్చు.
-
కాన్సెప్ట్‌లను అర్థం చేసుకుంటూ.. రోజువారి ప్రిపరేషన్ కొనసాగిస్తే అందుబాటులో ఉన్న సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతారు.
GATE -2023 SYLLABUS & PAPERS PDF
ముఖ్యసమాచారం
-
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
-
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 30.08.2022
-
దరఖాస్తులకు చివరి తేదీ: 30.09.2022
-
గేట్ పరీక్ష తేదీలు: 2023 ఫిబ్రవరి 4,5,11,12 తేదీల్లో(ప్రతి రోజు రెండు సెషన్లు)
-
ఫలితాలు విడుదల: 2023 మార్చి 16