do-you-have-SBI-account-don't-install-these-apps-inyour-mobile-phone

do-you-have-SBI-account-don’t-install-these-apps-inyour-mobile-phone

మీకు SBI అకౌంట్ ఉందా .. ఐతే మీ ఫోన్ లో ఈ APPS వాడవద్దు..!!

SBI అకౌంట్ ఉన్నవారు వారి మొబైల్ ఫోన్లలో ఉపయోగించకూడని కొన్ని యాప్స్

SBI బ్యాంక్ కస్టమర్లను కొన్నియాప్స్ విషయంగా హెచ్చరిస్తూ వస్తోంది

వాటిలో ముఖ్యమైనని ఒక 4 యాప్స్ వున్నాయి.

SBI అకౌంట్ ఉన్నవారు వారి మొబైల్ ఫోన్లలో ఉపయోగించకూడని కొన్ని యాప్స్ గురించి హెచ్చరికాలు కూడా జారీచేసింది. SBI గతంలో చాలా అలర్ట్ లను కూడా జారీ చేసింది మరియు తమ బ్యాంక్  కస్టమర్లను కొన్నియాప్స్ విషయంగా హెచ్చరిస్తూ వస్తోంది. వాటిలో ముఖ్యమైనని ఒక 4 యాప్స్ వున్నాయి మరియు గతంలో ఈ యాప్స్ వాడిన కారణంగా 150 మందికి పైగా ఖాతాదారులు 70 లక్షలకు పైగా పోగొట్టుకున్నట్లు కూడా తెలిపింది. అందుకే, అటువంటి యాప్స్ ని SBI కస్టమర్లు వారి ఫోన్లలో వాడకపోవడం మంచిది. 

విషయం ఏమిటంటే, మోసపూరితమైన లేదా వాటికీ అవకాశం ఇచ్చే కొన్ని యాప్స్ వలన నష్టపోతున్న తన ఖాతాదారులను దృష్టిలో ఉంచుకొని,

ఎనిడెస్క్ (Anydesk),

క్విక్ సపోర్ట్ (Quick Support),

టీమ్ వ్యూవర్ (Teamviewer)

మరియు మింగిల్ వ్యూ (Mingleview) యాప్ లను ఇన్స్స్టాల్ చేసుకోవద్దని SBI తన కస్టమర్లను హెచ్చరించింది.